Ajinkya Rahane | అజింక్యా రహానే రిటైర్మెంట్.. క్రికెట్‌కు వీడ్కోలు..
Ajinkya Rahane | భారత సీనియర్ క్రికెటర్ అజింక్యా రహానే అన్ని రకాల క్రికెట్ ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇక రిటైర్మెంట్ సమయం వచ్చిందని భావిస్తున్నానని సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. అజింక్యా రహానే భారత జట్టు తరఫున మూడు ఫార్మాట్లలో కలిపి 195 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడి, టెస్ట్ క్రికెట్లో అత్యంత విశ్వసనీయ బ్యాటర్లలో ఒకరిగా గుర్తింపు పొందాడు.
Ajinkya Rahane | భారత సీనియర్ క్రికెటర్ అజింక్యా రహానే అన్ని రకాల క్రికెట్ ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇక రిటైర్మెంట్ సమయం వచ్చిందని భావిస్తున్నానని సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. అజింక్యా రహానే భారత జట్టు తరఫున మూడు ఫార్మాట్లలో కలిపి 195 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడి, టెస్ట్ క్రికెట్లో అత్యంత విశ్వసనీయ బ్యాటర్లలో ఒకరిగా గుర్తింపు పొందాడు. 38 ఏళ్ల రహానే తన అంతర్జాతీయ కెరీర్లో 85 టెస్ట్‌లు, 90 వన్డేలు, 20 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. అతని అంతర్జాతీయ ప్రయాణం 2013లో ప్రారంభమైంది.
2023లో చివరిసారిగా..
అయితే రహానే చివరిసారిగా 2023లో వెస్టిండీస్ పర్యటనలో జరిగిన టెస్ట్ సిరీస్‌లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ఆ తర్వాత జాతీయ సెలెక్టర్ల ఎంపికలో చోటు దక్కలేదు. అన్ని రకాల క్రికెట్ ఫార్మాట్లతో పాటు అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పేందుకు ఇదే సరైన సమయమని భావిస్తున్నానని రహానే తన సోషల్ మీడియా పోస్టులో గురువారం పేర్కొన్నాడు. భారత జట్టుకు దూరమైనప్పటికీ రహానే దేశీయ క్రికెట్లో కొనసాగాడు. 2024-25 సీజన్ వరకు ముంబై జట్టుకు కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వహించాడు.
View this post on Instagram
ఇటీవలి ఐపీఎల్ లాస్ట్ సీజన్..
వైట్ బాల్ క్రికెట్లో రహానే 2014 టీ20 ప్రపంచకప్, 2015 వన్డే ప్రపంచకప్‌లలో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. చివరిసారిగా 2016లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో టీ20 అంతర్జాతీయ క్రికెట్ ఆడగా, 2018 ఫిబ్రవరిలో తన చివరి వన్డే మ్యాచ్ ఆడాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో కూడా రహానే సుదీర్ఘ కెరీర్‌ను కొనసాగించాడు. 2010 సీజన్ మినహా 2008లో ప్రారంభమైన తొలి ఐపీఎల్ సీజన్ నుంచి ప్రతి ఏడాది టోర్నీలో పాల్గొన్నాడు. 2026 ఐపీఎల్ సీజన్లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన రహానే 335 పరుగులు సాధించాడు. మొత్తం ఐపీఎల్ కెరీర్లో 5,367 పరుగులు నమోదు చేసి తన ప్రయాణాన్ని ముగించాడు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

INDW Vs ENGW | లార్డ్స్ మైదానంలో చరిత్ర సృష్టించిన భారత మహిళల క్రికెట్ జట్టు
జులై 13, 2026

Shah Rukh Khan | లాస్ ఏంజిల్స్‌లో నైట్ రైడర్స్ క్రికెట్ గ్రౌండ్.. ఆనందం వ్యక్తం చేసిన షారుఖ్ ఖాన్
జులై 2, 2026

Collector Manu Choudary | నాతో ఐదారు మంది సీసీలు పని చేశారు.. అందులో భాస్కర్ చాలా బెస్ట్: కలెక్టర్ ప్రశంస
జూన్ 30, 2026
తాజావార్తలు
- ●Lal Darwaza Bonalu | లాల్‌దర్వాజా ఆలయంలో శిఖర పూజ.. 24 గంటలు ప్రత్యేక నిఘా
- ●Stock Markets | లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. వరుసగా మూడో రోజూ సూచీల జోరు..
- ●Jana Nayagan | కర్ణాటకలో జననాయగన్ స్క్రీనింగ్ నిలిపివేత - సీఎం దళపతి విజయ్ పోస్టర్లు చించేసిన ఆందోళనకారులు
- ●Teenmar Mallanna | మా మొదటి ఎమ్మెల్యే అభ్యర్థి సైనికుడు.. ఇక కత్తెర గుర్తుతో చరిత్ర మారుస్తాం
- ●Vande Bharat | వందేభారత్‌లో తొలిసారి గుండె తరలింపు
- ●OpenAI | ఏఐ యూజర్లకు గుడ్ న్యూస్.. చాట్ జీపీటీలో వినియోగధరలు తగ్గింపు..

Lal Darwaza Bonalu | లాల్‌దర్వాజా ఆలయంలో శిఖర పూజ.. 24 గంటలు ప్రత్యేక నిఘా

Stock Markets | లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. వరుసగా మూడో రోజూ సూచీల జోరు..

Jana Nayagan | కర్ణాటకలో జననాయగన్ స్క్రీనింగ్ నిలిపివేత - సీఎం దళపతి విజయ్ పోస్టర్లు చించేసిన ఆందోళనకారులు

Teenmar Mallanna | మా మొదటి ఎమ్మెల్యే అభ్యర్థి సైనికుడు.. ఇక కత్తెర గుర్తుతో చరిత్ర మారుస్తాం



