Ajinkya Rahane | పశ్చాత్తాపం లేదు.. కొత్త బాధ్యతలు చేపట్టేందుకు ఆసక్తితో ఉన్నా : అజింక్య రహానే
Ajinkya Rahane | భారత మాజీ క్రికెటర్ అజింక్య రహానే ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే. తాజాగా తన భవిష్యత్ ప్రణాళికలను వెల్లడించాడు. 14 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలుకడంలో తనకు ఎలాంటి పశ్చాత్తాపం లేదని స్పష్టం చేశాడు.
Ajinkya Rahane | భారత మాజీ క్రికెటర్ అజింక్య రహానే ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే. తాజాగా తన భవిష్యత్ ప్రణాళికలను వెల్లడించాడు. 14 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలుకడంలో తనకు ఎలాంటి పశ్చాత్తాపం లేదని స్పష్టం చేశాడు. ఆటగాడిగా తన శక్తికి మించిన స్థాయిలో కృషి చేశానని, ఇకపై ప్రపంచవ్యాప్తంగా జరిగే టీ20 లీగ్‌ల్లో ఆడుతూ తన అనుభవాన్ని యువ ఆటగాళ్లతో పంచుకోవడమే లక్ష్యమని తెలిపాడు. భవిష్యత్తులో కోచ్, మెంటర్‌గా బాధ్యతలు చేపట్టాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు వెల్లడించాడు. యూరప్‌లో తొలిసారిగా ఐసీసీ గుర్తింపు పొందిన యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్ (ఈటీపీఎల్) ప్రారంభ సీజన్‌కు రహానేను ఆమ్‌స్టర్‌డామ్ ఫ్లేమ్స్ జట్టు మార్కీ ప్లేయర్‌గా ఎంపిక చేసింది. ఆగస్టు 26 నుంచి సెప్టెంబర్ 20 వరకు జరిగే ఈ లీగ్‌లో ఆరు నగరాల ఫ్రాంచైజీలు 33 మ్యాచ్‌ల్లో తలపడనున్నాయి. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత యూరప్‌లో క్రికెట్ అభివృద్ధికి తన వంతు పాత్ర పోషించేందుకు ఇది మంచి అవకాశమని రహానే పేర్కొన్నాడు.
అందుకే సంతృప్తి..
రిటైర్మెంట్ నిర్ణయం గురించి మాట్లాడుతూ.. దాదాపు నెల రోజుల పాటు తీవ్రంగా ఆలోచించానని రహానే తెలిపాడు. "నా నిర్ణయంపై ఎలాంటి పశ్చాత్తాపం లేదు. నా చేతుల్లో ఉన్న దానికంటే ఎక్కువగా ప్రయత్నించాను. ప్రతి మ్యాచ్‌లో 200 శాతం కృషి చేశాను. కెరీర్ చివర్లో నేను చేయాల్సినదంతా చేశాననే సంతృప్తి కలగడం గొప్ప అనుభూతి" అని చెప్పాడు. ఆటగాడిగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న అనుభవం తనకు ఉందని, ఆటగాళ్ల మనస్తత్వాన్ని బాగా అర్థం చేసుకోగలనని రహానే తెలిపాడు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా టీ20 లీగ్‌ల్లో ఆడడమే తన తొలి ప్రాధాన్యత అని చెప్పిన ఆయన.. భవిష్యత్తులో కోచ్, మెంటర్‌గా కూడా మంచి పాత్ర పోషించగలననే నమ్మకం వ్యక్తం చేశాడు. ఆటగాళ్లను తీర్చిదిద్దడం, వారికి మార్గనిర్దేశం చేయడం తన అనుభవానికి సహజమైన కొనసాగింపుగా భావిస్తున్నట్లు చెప్పాడు. ఆమ్‌స్టర్‌డామ్ ఫ్లేమ్స్ సహ వ్యవస్థాపకుడు, చీఫ్ క్రికెట్ ఆఫీసర్, స్టీవ్ వా ఎంపికను స్వాగతించాడు.
రహానే కెరీర్..
రహానే భారత జట్టు తరఫున 85 టెస్టులు, 90 వన్డేలు, 20 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడి మొత్తం 195 మ్యాచ్‌ల్లో 8,414 పరుగులు సాధించాడు. ఇందులో 15 సెంచరీలు, 51 అర్ధశతకాలు ఉన్నాయి. టెస్టుల్లోనే 5,077 పరుగులు చేశాడు. కెప్టెన్‌గా రహానే ప్రత్యేక గుర్తింపు సంపాదించాడు. 2020-21 బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో విరాట్ కోహ్లీ స్వదేశానికి తిరిగివెళ్లిన తర్వాత జట్టు బాధ్యతలు చేపట్టి, మెల్‌బోర్న్‌లో భారత్‌ను విజయపథంలో నడిపించాడు. అనంతరం గబ్బా టెస్టులో చారిత్రక విజయంతో భారత్ 2-1 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. ఐపీఎల్‌లో ఆరు ఫ్రాంచైజీలకు ప్రాతినిధ్యం వహించిన రహానే 5,367 పరుగులు నమోదు చేశాడు. 2023లో టైటిల్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సభ్యుడు. 2025, 2026 సీజన్లలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఇటీవల ఇంటర్నేషన్ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. యూరోపియన్ టీ20 లీగ్‌లో కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించనున్నాడు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Gold Sales | పుత్తడి ధరలు తగ్గినా ఆచితూచి కొనుగోళ్లు.. పండుగలు, పెళ్లిళ్ల సీజన్‌పై ఆశలు
సెప్టెంబర్ 21, 2026

Uttam Kumar Reddy | రైతులకు రూ.813 కోట్ల పరిహారం వెంటనే చెల్లించాలి : మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
సెప్టెంబర్ 21, 2026

IPL 2027 | ఫ్లెమింగ్ శకం ముగిసింది.. సీఎస్కే కొత్త హెచ్కోచ్గా జహీర్ ఖాన్..!
సెప్టెంబర్ 21, 2026
తాజావార్తలు
- ●Gold Sales | పుత్తడి ధరలు తగ్గినా ఆచితూచి కొనుగోళ్లు.. పండుగలు, పెళ్లిళ్ల సీజన్‌పై ఆశలు
- ●Preity Mukhundhan | హిట్ డైరెక్టర్‌తో కోలీవుడ్ హీరోయిన్ తెలుగు రొమాంటిక్ మూవీ - రిలీజ్ డేట్ కన్ఫామ్
- ●Uttam Kumar Reddy | రైతులకు రూ.813 కోట్ల పరిహారం వెంటనే చెల్లించాలి : మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
- ●IPL 2027 | ఫ్లెమింగ్ శకం ముగిసింది.. సీఎస్కే కొత్త హెచ్కోచ్గా జహీర్ ఖాన్..!
- ●Krithi Shetty | జనవరి 12 విడుదల సెట్స్‌లో కృతిశెట్టి బర్త్‌డే సెలబ్రేషన్స్
- ●Snapana Tirumanjanam | ముత్యాల మాలలు, పంచామృతాభిషేఖాలు.. శ్రీవారికి వైభవంగా స్నపన తిరుమంజనం

Gold Sales | పుత్తడి ధరలు తగ్గినా ఆచితూచి కొనుగోళ్లు.. పండుగలు, పెళ్లిళ్ల సీజన్‌పై ఆశలు

Preity Mukhundhan | హిట్ డైరెక్టర్‌తో కోలీవుడ్ హీరోయిన్ తెలుగు రొమాంటిక్ మూవీ - రిలీజ్ డేట్ కన్ఫామ్

Uttam Kumar Reddy | రైతులకు రూ.813 కోట్ల పరిహారం వెంటనే చెల్లించాలి : మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

IPL 2027 | ఫ్లెమింగ్ శకం ముగిసింది.. సీఎస్కే కొత్త హెచ్కోచ్గా జహీర్ ఖాన్..!



