త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

BCCI | భారత్‌లో పర్యటించనున్న అఫ్గానిస్తాన్‌.. టెస్టు, మూడు వన్డేలు ఆడనున్న జట్టు..!

BCCI | అఫ్గానిస్తాన్ జట్టు జూన్‌లో భారత్‌లో పరటించనున్నది. ఒక టెస్టుతో పాటు మూడు వన్డేలు ఆడుతుందని బీసీసీఐ సోమవారం వెల్లడించింది. ఐపీఎల్‌ ముగిసిన తర్వాత ఈ సిరీస్‌ మొదలవుతుంది. 2024 జనవరి మూడు టీ20 సిరీస్‌ తర్వాత భారత్‌తో అఫ్గానిస్తాన్‌కు ఇదే తొలి ద్వైపాక్షిక సిరీస్ కావడం విశేషం.

P

Sports | Published On Mar 2, 2026, 1.00 pm IST

BCCI | భారత్‌లో పర్యటించనున్న అఫ్గానిస్తాన్‌.. టెస్టు, మూడు వన్డేలు ఆడనున్న జట్టు..!
Advertisement

BCCI | అఫ్గానిస్తాన్ జట్టు జూన్‌లో భారత్‌లో పరటించనున్నది. ఒక టెస్టుతో పాటు మూడు వన్డేలు ఆడుతుందని బీసీసీఐ సోమవారం వెల్లడించింది. ఐపీఎల్‌ ముగిసిన తర్వాత ఈ సిరీస్‌ మొదలవుతుంది. 2024 జనవరి మూడు టీ20 సిరీస్‌ తర్వాత భారత్‌తో అఫ్గానిస్తాన్‌కు ఇదే తొలి ద్వైపాక్షిక సిరీస్ కావడం విశేషం. బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. జూన్ 6 నుంచి 10 వరకు న్యూ చండీగఢ్‌లోని పీసీఏ స్టేడియంలో టెస్ట్‌ మ్యాచ్‌ జరుగనున్నది. అనంతరం జూన్ 14న ధర్మశాలలోని హెచ్‌పీసీఏ స్టేడియంలో తొలి వన్డే జరుగుతుంది. మిగతా రెండు వన్డేలు జూన్ 17న లక్నోలోని ఎకానా స్టేడియంలో, జూన్‌ 20న చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరుగుతాయి. ఇప్పటివరకు భారత్‌-అఫ్గానిస్తాన్ మధ్య ఏకైక టెస్ట్ 2018 జూన్‌లో బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో జరిగింది. అది అఫ్గానిస్తాన్‌కు టెస్ట్ క్రికెట్‌లో తొలి మ్యాచ్ కాగా, ఆ మ్యాచ్‌లో భారత్ ఇన్నింగ్స్ 262 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

మూడు వన్డేల సిరీస్‌లో భారత జట్టుకు సీనియర్ బ్యాటర్లు విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ మళ్లీకి మైదానంలోకి రానున్నది. టెస్టులు, టీ20లకు వీడ్కోలు పలికిన ఈ ఇద్దరూ ప్రస్తుతం కేవలం 50 ఓవర్ల ఫార్మాట్‌లోనే ఆడుతున్న విషయం తెలిసిందే. భారత్–అఫ్గానిస్తాన్ మధ్య ఇప్పటివరకు నాలుగు వన్డేలు జరిగాయి. అందులో భారత్ మూడు గెలువగా.. 2018 ఆసియా కప్‌లో జరిగిన మరో మ్యాచ్ టైగా ముగిసింది. అఫ్గానిస్తాన్ సిరీస్ అనంతరం కోహ్లీ, రోహిత్ ఇంగ్లండ్ పర్యటనకకు వెళ్లనున్నారు. జూలై 1 నుంచి ప్రారంభమయ్యే ఈ వైట్‌బాల్ సిరీస్‌లో ఐదు టీ20లు, మూడు వన్డేలు ఉన్నాయి. వన్డే సిరీస్ జూలై 14 నుంచి మొదలవుతుంది. ఇటీవల అఫ్గానిస్తాన్ జట్టు అన్ని ఫార్మాట్లకు ప్రధాన కోచ్‌గా రిచర్డ్‌ పైబస్‌ని నియమించింది. వచ్చే నెల యూఏఈ శ్రీలంకతో జరిగే వన్డే సిరీస్‌కు ముందు బాధ్యతలు స్వీకరించనున్నారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్ జట్లకు కోచ్‌గా పని చేసిన అనుభవం ఉన్న పైబస్, టీ20 ప్రపంచకప్ లీగ్ దశలోనే అఫ్గానిస్తాన్ ప్రయాణం ముగిసిన తర్వాత జొనాథన్‌ ట్రాట్‌ బాధ్యతల నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే.

Read Also :

భార‌త్ సెమీఫైన‌ల్‌కు చేర‌ద‌న్నాడు.. క‌ట్ చేస్తే భారీ ఎత్తున ట్రోల్స్‌..
ఆడింది 60 మ్యాచ్‌లే.. 100 మ్యాచ్‌లు డ‌గౌట్‌లోనే..
Advertisement
Advertisement