త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sanju Samson | ఆడింది 60 మ్యాచ్‌లే.. 100 మ్యాచ్‌లు డ‌గౌట్‌లోనే..

Sanju Samson | అప్పుడెప్పుడో 11 ఏండ్ల క్రితం టీ20 భార‌త జ‌ట్టులో అడుగుపెట్టిన సంజు శాంస‌న్ (Sanju Samson).. త‌న కెరీర్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు ఆడింది 60 మ్యాచ్‌లే. ఇండియా టీమ్‌కు (Team India) ఎంపిక‌య్యే ఈ హార్డ్ హిట్ట‌ర్‌కు తుది జ‌ట్టులో మాత్రం చోటు ద‌క్క‌క‌పోయేది.

G

Cricket | Published On Mar 2, 2026, 11.12 am IST

Sanju Samson | ఆడింది 60 మ్యాచ్‌లే.. 100 మ్యాచ్‌లు డ‌గౌట్‌లోనే..
Advertisement

Sanju Samson | త్రినేత్ర‌.న్యూస్‌: అప్పుడెప్పుడో 11 ఏండ్ల క్రితం టీ20 భార‌త జ‌ట్టులో అడుగుపెట్టిన సంజు శాంస‌న్ (Sanju Samson).. త‌న కెరీర్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు ఆడింది 60 మ్యాచ్‌లే. ఇండియా టీమ్‌కు (Team India) ఎంపిక‌య్యే ఈ హార్డ్ హిట్ట‌ర్‌కు తుది జ‌ట్టులో మాత్రం చోటు ద‌క్క‌క‌పోయేది. అలా అత‌డు డ‌గౌట్‌లోనే ఉండి 100 మ్యాచ్‌లు చూశాడు. టీ 20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో ఓపెన‌ర్లు ఇషాన్ కిష‌న్‌, అభిషేక్ శ‌ర్మ వ‌రుస మ్యాచుల్లో విఫ‌ల‌మ‌వ‌డంతో ఫుల్ ఫామ్‌లో ఉన్న‌ శాంస‌న్‌ను ఎంపిక చేయ‌ని ప‌రిస్థితి త‌లెత్తింది. దీంతో జింబాబ్వేపై సాధికార ఇన్నింగ్స్ ఆడిన సంజూ.. వెస్టిండీస్‌తో జ‌రిగిన డూ ఆర్ డై మ్యాచ్‌లో త‌న చివ‌రి వ‌ర‌కూ క్రీజ్‌లో ఉండి జ‌ట్టును విజ‌య‌ప‌థంలో న‌డిపాడు. దీంతో ప్ర‌స్తుతం అత‌డు సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యారు. నెటిజ‌న్లు ప్ర‌సంశ‌ల‌తో ముంచెత్తుతున్నారు. మ్యాచ్ అనంత‌రం సంజూ మాట్లాడుతూ.. తాను ఆడింది 60 మ్యాచ్‌లే అయిన‌ప్ప‌టికీ.. డ‌గౌట్‌లో నుంచే 100 మాచ్‌లు చూశానంటూ ఎమోషనల్ అయ్యాడు.

`ఈ ఇన్నింగ్సే నాకు ఇప్పుడు ప్రపంచం లాంటిది. క్రికెట్ మొదలెట్టినప్పటి నుంచే దేశం కోసం ఆడాలని కలలు కన్నా. నేను ఎదురు చూస్తున్న రోజు ఇది. నా జర్నీలో చాలా అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి. నేను చేయగలనా లేదా అని నాపై నాకు అనుమానాలూ ఉన్నాయి. కానీ ఇప్పుడు సాధించా. ఎంతో సంతోషంగా ఉంది. నేను చాలా కాలంగా ఈ ఫార్మాట్‌లో ఆడుతున్నా. బెంచ్‌పై కూర్చుని విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ వంటి గొప్ప ఆటగాళ్ల నుంచి నేర్చుకున్నా. వాళ్లు ఎలా ఆడుతున్నారో గమనించడం నాకు చాలా ఉపయోగపడింది. నేను 60 మ్యాచ్ లే ఆడాను. కానీ డగౌట్లో కూర్చుని 100 మ్యాచ్ లు చూశా. క్రికెట్ ఆడ‌టం మొద‌లు పెట్టిన‌ప్ప‌టి నుంచి ఈ రోజు కోస‌మే ఎదురుచూశా. ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్నా. ఒక ద‌శ‌లో నేనిది చేయ‌గ‌ల‌నా అని నా సామ‌ర్థ్యాన్ని ప్ర‌శ్నించుకున్నా. ఇలాంటి ఇన్నింగ్స్ ఆడ‌తాన‌ని ఊహించ‌లేదు. నా జీవితంలో ఇది అద్భుత‌మైన రోజు. మ్యాచ్ ప‌రిస్థితికి అనుగుణంగా ఆడాను అంతే. న‌న్ను న‌డిపించిన దేవుడికి కృతజ్ఞ‌త‌లు` అని సంజు శాంసన్ చెప్పాడు.

కోహ్లి రికార్డు బ్రేక్

టీ20 ప్రపంచకప్‌లో భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి రికార్డును సంజు శాంసన్ బ్రేక్ చేశాడు. వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో 196 పరుగుల చేజింగ్ లో శాంసన్ 97 నాటౌట్ గా నిలిచాడు. దీంతో టీ20 ప్రపంచకప్ లో ఛేజింగ్ లో అత్యధిక స్కోరు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లి రికార్డును శాంసన్ బద్దలు కొట్టాడు. కోహ్లి 2016లో ఆస్ట్రేలియాపై, 2022లో పాకిస్థాన్ పై 82 పరుగుల చొప్పున చేశాడు.

టీ 20 ఫార్మ‌ట్‌లో ఇప్ప‌టివ‌ర‌కు 60 మ్యాచ్‌లో 52 ఇన్నింగ్సులు ఆడిన సంజు.. 25.98 యావ‌రేజ్‌తో 1221 ప‌రుగులు చేశాడు. 3 సెంచ‌రీలు, 4 అర్ధ‌శ‌త‌కాలు కొట్టాడు. అత‌ని అత్య‌ధిక స్కోర్ 111.

https://x.com/LoyalCskFan/status/2028327790584775154

Advertisement

తాజావార్తలు

Advertisement