Sun Corona Heat | సూర్యుడి కరోనా గుట్టు వీడింది.. భారత శాస్త్రవేత్తల కీలక అధ్యయనం..!
Sun Corona Heat | సూర్యుడి వెలుపలి పొర అయిన కరోనా అత్యంత వేడిగా ఉంటుంది. లక్షల డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుంది. అక్కడ ఎందుకు ఉంటాయన్న ప్రశ్న దశాబ్దాలుగా శాస్త్రవేత్తలను వేధిస్తోంది. ఇప్పటివరకు పూర్తిస్థాయిలో సమాధానం దొరకలేదు. ఎట్టకేలకు ఈ రహస్యానికి సంబంధించి భారత శాస్త్రవేత్తలు కీలక ఆధారాలను గుర్తించారు.
Sun Corona Heat | సూర్యుడి వెలుపలి పొర అయిన కరోనా అత్యంత వేడిగా ఉంటుంది. లక్షల డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుంది. అక్కడ ఎందుకు ఉంటాయన్న ప్రశ్న దశాబ్దాలుగా శాస్త్రవేత్తలను వేధిస్తోంది. ఇప్పటివరకు పూర్తిస్థాయిలో సమాధానం దొరకలేదు. ఎట్టకేలకు ఈ రహస్యానికి సంబంధించి భారత శాస్త్రవేత్తలు కీలక ఆధారాలను గుర్తించారు. కరోనాలో ఉన్న అయస్కాంత తరంగాలు, వాటితో ఏర్పడే సూక్ష్మ అలజడులే అక్కడి అసాధారణ వేడికి ప్రధాన కారణమని తాజా పరిశోధనలో వెల్లడైంది. పెద్ద మొత్తంలో వాయు ప్రవాహాలు లేకపోయినా, ఈ తరంగాలు ఇంతకుముందు కేవలం బలమైన ప్లాస్మా ప్రవాహాలతో మాత్రమే ముడిపడి ఉన్న సంకేతాలను ఉత్పత్తి చేస్తున్నాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
ఈ అధ్యయనాన్ని భారతీయ శాస్త్రవేత్తలు సాధించిన కీలకమైన విజయంగా భావిస్తున్నారు. ఆర్యభట్ట రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అబ్జర్వేషనల్ సైన్సెస్ (ARIES), ఐఐటీ ఢిల్లీ శాస్త్రవేత్తలు సంయుక్తంగా ఈ పరిశోధన నిర్వహించారు. ఈ అధ్యయనం ‘ది ఆస్ట్రోఫిజికల్ జర్నల్’లో ప్రచురితమైంది. భారత శాస్త్రవేత్తల ఈ ఆవిష్కరణకు అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు లభిస్తున్నాయి. శాస్త్రవేత్తల పరిశీలన ప్రకారం.. కరోనాలో ఉన్న మాగ్నెటిక్ హైడ్రోడైనమిక్ తరంగాలు నిరంతరంశక్తిని నిరంతరం వ్యాప్తి చేస్తూ ఉన్నాయి. గాలిలో తాడు ఊగినట్లుగా ఈ తరంగాలు అయస్కాంత నిర్మాణాలను కదిలిస్తుంటాయి. ఈ ప్రకంపనల వల్లే కరోనా ఉష్ణోగ్రతలు లక్షల డిగ్రీల వరకు చేరుతున్నాయని గుర్తించారు. సాధారణంగా దూరంగా వెళ్తే ఉష్ణోగ్రత తగ్గుతుంది.
కానీ సూర్యుడి విషయంలో మాత్రం పరిస్థితి విరుద్ధంగా కనిపిస్తుంది. సూర్యుడి ఉపరితలం ‘ఫోటోస్ఫియర్’ కంటే దాని పైన ఉన్న కరోనా అనేక రెట్లు ఎక్కువ వేడిగా ఉంటుంది. ఈ శక్తి అక్కడికి ఎలా చేరుతుందన్నది ఇప్పటికీ ఒక పెద్ద శాస్త్రీయ మిస్టరీగా ఉంది. తాజా అధ్యయనం ప్రకారం కరోనాలోని తరంగాలు, సాంద్రత వ్యత్యాసాలు శక్తిని నిరంతరం వ్యాప్తి చేస్తూ ఉష్ణోగ్రతను స్థిరంగా ఉంచుతున్నాయి. ఈ పరిశోధనలో భాగంగా శాస్త్రవేత్తలు త్రీడీ కంప్యూటర్ సిమ్యులేషన్‌ను ఉపయోగించి కరోనాను విశ్లేషించారు. అయస్కాంత క్షేత్రాలు, సాంద్రత మార్పులను మోడల్‌లో చేర్చి తరంగాలను దిగువ నుంచి పైకి పంపించి కాంతి, శక్తి మార్పులను పరిశీలించారు. ఇందులో ఐరన్ అయాన్ల వల్ల ఏర్పడే ప్రత్యేక స్పెక్ట్రల్ లైన్ Fe XIII 10749 Åని విశ్లేషించారు.
పరిశీలనలో కరోనాలోని తరంగాలు ఒకే వేగంతో ప్రయాణించవని, సాంద్రత మార్పుల కారణంగా వాటి వేగం మారుతూనే ఉంటుందని తేలింది. దీంతో ఎరుపు, నీలం తరంగ సంకేతాల్లో అసమతుల్యత ఏర్పడుతున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. గతంలో ఈ తరహా సంకేతాలు భారీ ప్లాస్మా ప్రవాహాల వల్లే వస్తాయని భావించేవారు. అయితే ఇప్పుడు కేవలం అయస్కాంత తరంగాల ద్వారానే అవి ఏర్పడవచ్చని ఈ అధ్యయనం సూచిస్తోంది. ఈ ఆవిష్కరణతో అంతరిక్ష వాతావరణం, సౌర తుఫాన్ల ప్రభావంపై మెరుగైన అవగాహన ఏర్పడనుంది. భవిష్యత్తులో ఉపగ్రహ కమ్యూనికేషన్, అంతరిక్ష మిషన్ల పరిశోధనలకు ఇది కొత్త దిశ చూపే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Agadha Movie | బోనమెత్తిన హీరోయిన్.. బల్కంపేట ఎల్లమ్మకు బోనం సమర్పించిన కామాక్షి భాస్కర్ల
జులై 26, 2026

Vaibhav Suryavanshi | మళ్లీ చితక్కొట్టిన వైభవ్.. టీ20ల్లో అరుదైన చరిత్ర సృష్టించిన సూర్యవంశీ
జులై 26, 2026

CWG 2026 | గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్.. వెయిట్లిఫ్ట్లో భారత్కు సిల్వర్..!
జులై 26, 2026
తాజావార్తలు
- ●Stock Markets | భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు.. పతనమైన చమురు ధరలు..
- ●Shooting at Food Festival | ఫుడ్ఫెస్టివల్లో కాల్పులు.. ఇద్దరు దుర్మరణం
- ●Uday Krishna Reddy | పరారీలో ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి
- ●Adilabad Airport | ఆదిలాబాద్ విమానాశ్రయానికి రూ.2,278 కోట్లు.. 2 వేల ఎకరాల భూసేకరణ
- ●Rain Update | నేడు, రేపు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు
- ●UPSC Recruitment | బీఈడీ అర్హతతో యూపీఎస్సీ ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్ ఉద్యోగాలు

Stock Markets | భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు.. పతనమైన చమురు ధరలు..

Shooting at Food Festival | ఫుడ్ఫెస్టివల్లో కాల్పులు.. ఇద్దరు దుర్మరణం

Uday Krishna Reddy | పరారీలో ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి

Adilabad Airport | ఆదిలాబాద్ విమానాశ్రయానికి రూ.2,278 కోట్లు.. 2 వేల ఎకరాల భూసేకరణ



