UPSC Recruitment | బీఈడీ అర్హతతో యూపీఎస్సీ ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్ ఉద్యోగాలు
UPSC Recruitment | బీఈడీతోపాటు (BEd) టీచింగ్ అనుభవం ఉన్నవారికి గుడ్‌న్యూస్. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC Recruitment) భారత ప్రభుత్వ విద్యాశాఖ విభాగంలో మొత్తం 828 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
UPSC Recruitment | త్రినేత్ర.న్యూస్: బీఈడీతోపాటు (BEd) టీచింగ్ అనుభవం ఉన్నవారికి గుడ్‌న్యూస్. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC Recruitment) భారత ప్రభుత్వ విద్యాశాఖ విభాగంలో మొత్తం 828 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా ప్రిన్సిపాల్ (Principal), వైస్ ప్రిన్సిపాల్ (Vice Principal) పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. అర్హత గల అభ్యర్థులు https://upsconline.nic.in/ora/ ఆగస్టు 14 వరకు చేసుకోవచ్చు.
ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్: 828
ప్రిన్సిపాల్: 124 (పురుషులు- 72, మహిళలు- 52)
జనరల్ 69, ఈడబ్ల్యూఎస్ 11, ఓబీసీ 18, ఎస్సీ 16, ఎస్టీ 10 ఖాళీలు ఉన్నాయి.
వైస్ ప్రిన్సిపాల్: 704 (పురుషులు - 364 మహిళలు - 340)
జనరల్ 287 ఈడబ్ల్యూఎస్ 71, ఓబీసీ 189, ఎస్సీ 103, ఎస్టీ 54 పోస్టులు ఉన్నాయి.
అర్హతలు: ప్రిన్సిపాల్ పోస్టులకు మాస్టర్ డిగ్రీ, బీఈడీ (B.Ed.) పూర్తి చేయాలి. అలాగే గుర్తింపు పొందిన హైస్కూల్, హయ్యర్ సెకండరీ స్కూల్, సీనియర్ సెకండరీ స్కూల్, ఇంటర్ కాలేజీలలో వైస్ ప్రిన్సిపాల్, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్, టీజీటీగా కనీసం 10 సంవత్సరాల టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి.
వైస్ ప్రిన్సిపాల్ పోస్టులకు మాస్టర్ డిగ్రీ, బీఈడీ ఉత్తీర్ణతతోపాటు పీజీటీగా రెండేండ్ల అనుభవం లేదా టీజీటీగా మూడేండ్ల టీచింగ్ అనుభవం తప్పనిసరి.
వయసు: ప్రిన్సిపాల్ పోస్టుకు 50 ఏండ్లు, వైస్ ప్రిన్సిపాల్ పోస్టులకు 35
ఎంపిక విధానం: కంబైన్డ్ రిక్రూట్‌మెంట్ టెస్ట్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా
పరీక్షను 300 మార్కులకు నిర్వహిస్తారు. రెండు గంటల్లో పూర్తిచేయాలి. ప్రతి తప్పు సమాధానానికి 1/3 నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. జనరల్ నాలెడ్జ్, హిందీ, ఇంగ్లీష్, రీజనల్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్,ఎడ్యుకేషనల్ పాలసీ, మేనేజ్మెంట్, ఫైనాన్షియల్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించి ప్రశ్నలు అడుగుతారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
దరఖాస్తు ఫీజు: రూ.25, మహిళలు, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు దరఖాస్తు లేదు.
దరఖాస్తుకు చివరి తేదీ: ఆగస్టు 14
రాత పరీక్ష తేదీ: నవంబర్ 1
వెబ్‌సైట్: https://upsconline.nic.in/ora/
సంబంధిత వార్తలు

Students Attack | 30 మందితో వచ్చి.. ప్రిన్సిపాల్ ముందే విద్యార్థిని చితకబాదారు..
సెప్టెంబర్ 10, 2026

BJP Ramchandar Rao | ఇకనుంచి ఏ పరీక్ష పేపర్ లీకైనా 10 ఏండ్ల జైలు.. 15 కోట్ల ఫైను
జులై 25, 2026

MCRHRD | సివిల్ సర్వీసెస్ అభ్యర్థులకు సువర్ణావకాశం.. ఎంసీఆర్హెచ్ఆర్డీలో ఉచిత ఓరియంటేషన్ ప్రోగ్రామ్
జులై 24, 2026
తాజావార్తలు
- ●Income Tax Notice Rs 1.33 Crore Cash Deposit | రూ.1.33 కోట్లు డిపాజిట్ చేసిన రిటైర్డ్ టీచర్.. ఐటీ శాఖ నోటీసులు.. కొట్టేసిన ట్రిబ్యునల్
- ●IND Vs JPN | పోరాడి ఓడిన జపాన్.. రెండు పరుగుల తేడాతో భారత్ విన్.. వైడ్ నిర్ణయంపై హాట్ టాపిక్..!
- ●Heavy Rains | రంగు మారిన నింగి.. ట్యాంక్‌బండ్ నుంచి హైటెక్ సిటీ వరకు జోరు వాన
- ●Tamannaah | వివాదంలో తమన్నా బాలీవుడ్ మూవీ - తన పాటను దొంగిలించారంటూ మ్యూజిక్ డైరెక్టర్ ఆరోపణ
- ●Airtel | ఎయిర్టెల్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్లలో అదిరిపోయే బెనిఫిట్స్.. యాపిల్ నుంచి ఇవన్నీ ఉచితమే..
- ●Jagadeesh Reddy | వందల ఎకరాలు ఏడున్నయో రాధాకృష్ణ చెప్తే అమ్ముకుంటా

Income Tax Notice Rs 1.33 Crore Cash Deposit | రూ.1.33 కోట్లు డిపాజిట్ చేసిన రిటైర్డ్ టీచర్.. ఐటీ శాఖ నోటీసులు.. కొట్టేసిన ట్రిబ్యునల్

IND Vs JPN | పోరాడి ఓడిన జపాన్.. రెండు పరుగుల తేడాతో భారత్ విన్.. వైడ్ నిర్ణయంపై హాట్ టాపిక్..!

Heavy Rains | రంగు మారిన నింగి.. ట్యాంక్‌బండ్ నుంచి హైటెక్ సిటీ వరకు జోరు వాన

Tamannaah | వివాదంలో తమన్నా బాలీవుడ్ మూవీ - తన పాటను దొంగిలించారంటూ మ్యూజిక్ డైరెక్టర్ ఆరోపణ



