త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rain Update | నేడు, రేపు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు

Rain Update | త్రినేత్ర‌.న్యూస్‌: రాష్ట్ర‌వ్యాప్తంగా సోమ‌, మంగ‌ళ‌వారాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం (Rain Update) ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తూర్పు, ఉత్త‌ర తెలంగాణ‌ జిల్లాల్లో (Telangana) రెండ్రోజుల పాటు మోస్తారు నుంచి భారీ వాన‌లు ప‌డుతాయ‌ని వెల్ల‌డించింది.

G

Telangana | Published On Jul 27, 2026, 7.34 am IST

Rain Update | నేడు, రేపు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు
Advertisement

Rain Update | త్రినేత్ర‌.న్యూస్‌: రాష్ట్ర‌వ్యాప్తంగా సోమ‌, మంగ‌ళ‌వారాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం (Rain Update) ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తూర్పు, ఉత్త‌ర తెలంగాణ‌ జిల్లాల్లో (Telangana) రెండ్రోజుల పాటు మోస్తారు నుంచి భారీ వాన‌లు ప‌డుతాయ‌ని వెల్ల‌డించింది. ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, నిర్మ‌ల్‌, మంచిర్యాల‌, జ‌గిత్యాల‌, పెద్ద‌ప‌ల్లి, భూపాల‌ప‌ల్లి, ములుగు, కొత్త‌గూడెం, మ‌హ‌బూబాబాద్‌, ఖ‌మ్మం జిల్లాల్లో సోమ‌వారం మ‌ధ్యాహ్నం నుంచి రాత్రి వ‌ర‌కు భారీ వ‌ర్షాలు కురుస్తాయ‌ని పేర్కొంది.

ఇక నిజామాబాద్‌, కామారెడ్డి, సంగారెడ్డి, వికార‌బాద్‌, మెద‌క్‌, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌, రంగారెడ్డి, సిద్దిపే, జ‌న‌గామ‌, క‌రీంన‌గ‌ర్‌, హ‌నుమ‌కొండ‌, వ‌రంగ‌ల్‌, నారాయ‌ణ‌పేట జిల్లాల్లో మ‌ధ్యాహ్నం త‌ర్వాత వాన ప‌డే అవ‌కాశం ఉంద‌ని చెప్పింది. మిగిలిన జిల్లాల్లో సాధార‌ణ వ‌ర్ష‌పాతం న‌మోద‌వుతుంద‌ని తెలిపింది. హైద‌రాబాద్‌లోని ప‌లు ప్రాంతాల్లో సాయంత్రం వ‌ర్షం కురిసే అవ‌కాశం ఉంద‌ని వెల్ల‌డించింది.

జూరాలకు మొదలైన వరద..

ఎగువ ప్రాంతాల్లో ఉన్న ప్రాజెక్టుల నుంచి జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం మొదలైంది. జూరాలకు గత ఏడాది వరద ప్రవాహం మే నెలలో వస్తే, ఈ ఏడాది ఆలస్యంగా జులై చివరలో వరద మొదలైంది. ప్రాజెక్టులోకి 22,600 క్యూసెక్కుల వరద నీరు ప్రాజెక్టులోకి చేరుతున్న‌ది. జూరాల పూర్తి నీటి మట్టం 9.657 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 5.897 టీఎంసీల నీరు నిలువ ఉంది. ఇదే వరద ఇలాగే కొనసాగితే మూడు రోజుల్లో జూరాల జల విద్యుదుత్పత్తి ప్రారంభించి, దిగువకు నీటిని విడుదల చేయనున్నారు.

Advertisement
Advertisement