Planetary Alignment | ఒకే వరుసలోకి ఆరు గ్రహాలు..! చూడడం అస్సలు మిస్సవ్వొద్దు..!
Planetary Alignment | ఫిబ్రవరి మాసంలో ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతం కాబోతున్నది. ఒకేసారి ఆరుగ్రహాలు ఒకేవరుసలో కనిపించనున్నాయి. బుధుడు, శుక్రుడు, గురుడు, శని, యురేనస్, నెప్ట్యూన్ ఆరు గ్రహాలు ఆకాశంలో పరేడ్ చేయబోతున్నాయి.
Planetary Alignment | ఫిబ్రవరి మాసంలో ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతం కాబోతున్నది. ఒకేసారి ఆరుగ్రహాలు ఒకేవరుసలో కనిపించనున్నాయి. బుధుడు, శుక్రుడు, గురుడు, శని, యురేనస్, నెప్ట్యూన్ ఆరు గ్రహాలు ఆకాశంలో పరేడ్ చేయబోతున్నాయి. సూర్యాస్తమయం తర్వాత సుమారు గంట తర్వాత ఈ దృశ్యం కనిపించనున్నది. ఖగోళ ప్రియులు, ఫొటోగ్రాఫర్లు ఈ అరుదైన దృశ్యాన్ని తమ కెమెరాల్లో బంధించేందుకు సిద్ధమవుతున్నారు.
సూర్యాస్తమయం తర్వాత బుధుడు ప్రకాశవంతంగా మెరుస్తూ కనిపిస్తాడు. అలాగే, శుక్రుడు సైతం ఎప్పటికలాగే ఆకాశంలో మెరుస్తూ దర్శనమిస్తాడు. గురుడు సైతం ఎలాంటి పరికరాలు అవసరం లేకుండానే స్పష్టంగా కనిపిస్తాడు. శని కొంచెం పసుపు రంగులో కనిపిస్తాడు. అయితే, శనిగ్రహం చుట్టూ ఉన్న వలయాలు మాత్రం కంటికి కనిపించవు. యురేనస్ మాత్రం మసకగా కనిపిస్తుంది. బైనాక్యులర్లు ఉంటే మాత్రం బాగానే కనిపిస్తుంది. నెప్ట్యూన్ అయితే ఇంకా కంటితో చూడడం కష్టమే. చిన్న టెలిస్కోప్‌తోనే సరిగా చూడగలం. ఈ ఆరుగ్రహాలు కలిసి భూమి నుంచి ఒకేవరుసలో కనిపిస్తాయి.
ఈ గ్రహాలు ఫిబ్రవరి 28న ఒకే వరుసలోకి వస్తాయి. సాయంత్రం 6.30 గంటల నుంచి 7.30 గంటల వరకు మాత్రమే చూసేందుకు అవకాశం ఉంటుంది. ఈ గ్రహాలను చూసేందుకు భవనాలు, చెట్లు లేని ఓపెన్ ప్లేస్ నుంచి చూసేందుకు బాగుంటుంది. ఈ సమయంలో ఆకాశాన్ని మేఘాలు కమ్మేస్తే మాత్రం కనిపించవు. బుధుడు, శుక్రుడు, గురుడు, శని గ్రహాలను చూసేందుకు ప్రత్యేకంగా పరికరాలు అవసరం లేదు. యూరేనస్‌ని చూసేందుకు బైనాక్యులర్లు ఉపయోగకరంగా ఉంటాయి. నెప్ట్యూన్ చూడాలంటే టెలిస్కోప్ అవసరమవుతుంది. సూర్యాస్తమయం తర్వాత ఈ దృశ్యం స్పష్టంగా కనిపిస్తుంది.
వాస్తవానికి ఆరుగ్రహాలు ఒకేవరుసలో చాలా తక్కువ సమయాల్లో కనిపిస్తాయి. నాలుగు గ్రహాలు భూమిపై నుంచి కనిపిస్తుంటాయి. యురేనస్, నెప్ట్యూన్‌లను చూడడం అరుదే. ఇలా గ్రహాలు కొన్ని సంవత్సరాలకోసారి మాత్రమే భూమికి దగ్గరగా ఒకేవరుసలోకి వస్తాయి. ఈ గ్రహాలు ఒకే వరుసలోకి రావడాన్ని ప్లానెటరీ అలైన్‌మెంట్‌గా పిలుస్తుంటారు. ఈ సారి ప్లానెటరీ అలైన్‌మెంట్ ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందికి గుర్తుండిపోయే అనుభూతిని కలిగిస్తుందని ఖగోళ శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. గ్రహాలు సూర్యుడి చుట్టూ వేర్వేరు వేగంతో తిరుగుతుంటాయి. భూమి నుంచి చూసినప్పుడు కొన్నిసార్లు అవన్నీ ఒకే వరుసలో ఉన్నట్లు కనిపిస్తాయి. కానీ నిజానికి అవి పక్కన పక్కన మాత్రం ఉండవు. భూమి నుంచి చూసిన సమయంలోనే అలా అనిపిస్తుంది. ఈ దృశ్యం మాత్రం చూసేందుకు ముచ్చటగా ఉంటుంది.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






