త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Horoscope | ప్రత్యక్షంలోకి వచ్చిన బుధుడు.. ఈ మూడురాశులవారి జీవితాల్లో అన్నీ సానుకూల మార్పులే..!

Horoscope | జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. గ్రహాల సంచారానికి ప్రత్యేకత ఉన్నది. ఆయా గ్రహాల సంచారంతో పలురాశులవారిపై ప్రభావం ఉంటుంది. బుధుడు శుక్రవారం తెల్లవారు జామున 3.54 గంటలకు మిథునరాశిలో ప్రత్యక్ష గమనంలోకి వచ్చాడు. మిథునం బుధుడి సొంత రాశి కావడంతో ఈ మార్పు ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకుంది.

P

Horoscope | Published On Jul 25, 2026, 6.25 am IST

Horoscope | ప్రత్యక్షంలోకి వచ్చిన బుధుడు.. ఈ మూడురాశులవారి జీవితాల్లో అన్నీ సానుకూల మార్పులే..!
Advertisement

Horoscope | జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. గ్రహాల సంచారానికి ప్రత్యేకత ఉన్నది. ఆయా గ్రహాల సంచారంతో పలురాశులవారిపై ప్రభావం ఉంటుంది. బుధుడు శుక్రవారం తెల్లవారు జామున 3.54 గంటలకు మిథునరాశిలో ప్రత్యక్ష గమనంలోకి వచ్చాడు. మిథునం బుధుడి సొంత రాశి కావడంతో ఈ మార్పు ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకుంది. బుధుడి మార్గి కారణంగా పలు రాశుల వారికి అదృష్టం కలిసి రావడంతో పాటు కెరీర్‌, వ్యాపారం, ఆర్థిక వ్యవహారాలు, విద్య రంగాల్లో అనుకూల ఫలితాలు కనిపించే అవకాశాలున్నాయని పండితులు పేర్కొంటున్నారు. ఇంతకీ ఆ అదృష్ట రాశులవారెవరో తెలుసుకుందాం..!

మిథున రాశి

మిథున రాశి వారికి బుధుడు లగ్నాధిపతితో పాటు నాలుగో స్థానానికి అధిపతి. ప్రస్తుతం బుధుడు తన సొంత రాశి అయిన మిథున లగ్నంలోనే ప్రత్యక్షంలోకి రావడం వల్ల ఈ రాశి వారికి విశేష ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. వ్యక్తిత్వంలో మరింత ఆకర్షణ పెరగడంతో పాటు ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది. ఉద్యోగ బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తారు. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకునే అవకాశం కనిపిస్తోంది. గృహ, విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. విద్యార్థులు రాసిన పరీక్షల్లో అనుకున్న ఫలితాలు సాధించే ఛాన్స్‌ ఉన్నది.

కన్య రాశి

కన్య రాశి వారికి బుధుడు లగ్నంతో పాటు దశమ స్థానానికి అధిపతి. దశమ స్థానంలో సంచారం కారణంగా ఉద్యోగ, వృత్తి రంగాల్లో శుభ ఫలితాలు కనిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కెరీర్‌లో పురోగతి సాధించేందుకు కొత్త అవకాశాలు లభించే అవకాశం ఉంది. గతంలో చేసిన పెట్టుబడులు మంచి లాభాలను అందించే సూచనలు కనిపిస్తున్నాయి. వ్యాపార విస్తరణకు అనుకూల పరిస్థితులు ఏర్పడటంతో పాటు భారీ పెట్టుబడులకు సంబంధించిన ప్రణాళికలు కార్యరూపం దాల్చే పరిస్థితి గోచరిస్తోంది. ఆర్థిక పరిస్థితి గతంతో పోలిస్తే మరింత బలపడుతుంది. పనిచేసే చోట మీ పనితీరుకు గుర్తింపు లభించడంతో పాటు మీ నైపుణ్యానికి ప్రశంసలు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి బుధుడు అష్టమ స్థానంతో పాటు లాభ స్థానానికి అధిపతి. ఈ సారి బుధుడు అష్టమ స్థానంలో ప్రత్యక్షంలోకి రావడం వల్ల నిలిచిపోయిన అనేక పనులు మళ్లీ వేగం పుంజుకునే అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు పేర్కొంటున్నారు. వ్యాపారంలో నిలిచిపోయిన ఒప్పందాలు ముందుకు సాగే సూచనలు ఉన్నాయి. చాలా కాలంగా రావాల్సిన బకాయిలు తిరిగి చేతికి వచ్చే అవకాశం ఉన్నది. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగ అవకాశాలు లభించే పరిస్థితులు గోచరిస్తున్నాయి. పలువురికి అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. దాంతో ఆర్థిక సమస్యల నుంచి బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడుతాయి. దాంతో వ్యాపార అవకాశాలు పెరగే అవకాశం ఉంటుంది. సమాజంలో మీ మాటకు గౌరవం పెరుగుతుంది.

Read Also :

Tholi Ekadashi 2026 | తొలి ఏకాదశి వేళ.. ఉడుపి శ్రీకృష్ణుడి దివ్య వైభవం

Toli Ekadashi | పూజ చేస్తే ఫలితం.. పరమార్థం తెలిస్తేనే పరిపూర్ణం

Advertisement
Advertisement