Planetary Parade | స్కైవాచర్లకు గుడ్‌న్యూస్.. గ్రహాల పరేడ్‌ను చూసేయండి..!
Planetary Parade | స్కైవాచర్లకు గుడ్‌న్యూస్. మన సౌర కుటుంబంలోని నాలుగు గ్రహాలైన బుధుడు, అంగారకుడు, శని, నెప్ట్యూన్ ఒకే దిశలో వరుసగా కనిపించనున్నాయి. దీన్నే సాధారణంగా “ప్లానెట్ పరేడ్”గా పిలుస్తుంటారు. ఈ ఖగోళ దృగ్విషయం ఈ నెల 23 వరకు కనిపించనుంది.
Planetary Parade | స్కైవాచర్లకు గుడ్‌న్యూస్. మన సౌర కుటుంబంలోని నాలుగు గ్రహాలైన బుధుడు, అంగారకుడు, శని, నెప్ట్యూన్ ఒకే దిశలో వరుసగా కనిపించనున్నాయి. దీన్నే సాధారణంగా “ప్లానెట్ పరేడ్”గా పిలుస్తుంటారు. ఈ ఖగోళ దృగ్విషయం ఈ నెల 23 వరకు కనిపించనుంది. భూమిపై నుంచి చూస్తే ఆయా గ్రహాలన్నీ ఒకే వరుసలో ఉన్నట్లుగా దర్శనమిస్తాయి. కానీ, నిజానికి అవి ఎంతో దూరంలో వాటి కక్ష్యల్లోనే తిరుగుతుంటాయి. సూర్యుని చుట్టూ గ్రహాలు తిరిగే క్రమంలో ఒకే రేఖలోకి వచ్చినప్పుడు మాత్రమే ఈ దృశ్యం కనిపిస్తుంది.
ఈ ఖగోళ సంఘటనను చూసేందుకు ఉదయం సూర్యోదయానికి కొద్దిసేపటి ముందు లేచి తూర్పు దిశలో చూడాలి. సుమారు ఉదయం 5 గంటల నుంచి 5.45 మధ్య సమయం అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఏప్రిల్ 18 నుంచి 20 వరకు ఈ నాలుగు గ్రహాలు మరింత స్పష్టంగా వరుసలో కనిపించే అవకాశం ఉన్నాయి. అయితే ఆకాశం నిర్మలంగా, కాలుష్యంతో పాటు వెలుతురు తక్కువగా ఉంటే చూసేందుకు అనువుగా ఉంటుంది. బుధుడు చాలా దిగువన, క్షితిజానికి దగ్గరగా కనిపిస్తాడు. ఉదయం సమయంలో సూర్యకాంతి ఎక్కువగా ఉండటం వల్ల ఈ గ్రహాన్ని గుర్తించడం కొద్దిగా కష్టమవుతుంది. బుధుడి పై భాగంలో శని పసుపు రంగులో మెరిసిపోతాడు.
కొంచెం పైకి చూస్తే అంగారకుడు ఎరుపు ఛాయతో సులభంగా గుర్తించవచ్చు. నెప్ట్యూన్ మాత్రం చాలా మసకగా ఉండడం వల్ల కంటికి కనిపించే అవకాశం లేదు. ఇందు కోసం బైనాక్యులర్, చిన్న టెలిస్కోప్ అవసరమవుతుంది. ఈ సంఘటనలో మరో ఆసక్తికర విషయం ఏమిటంటే.. కొన్ని రోజుల్లోనే గ్రహాల అమరిక మారుతూ ఉంటుంది. మొదట్లో అవి కొంచెం వేర్వేరు కోణాల్లో కనిపించినా.. ఏప్రిల్ 20 నాటికి ఒక కోణంలో కనిపిస్తాయి. ఇలా తక్కువ సమయంలోనే గ్రహాల స్థానం మార్పును పరిశీలించొచ్చని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

HD Kumaraswamy | కర్నాటకలో సర్ కార్యక్రమం.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన కేంద్రమంత్రి కుమారస్వామి
జులై 4, 2026

Vaibhav Suryavanshi | 15 ఏళ్లకే టీమిండియా క్యాప్.. సచిన్ రికార్డును అధిగమించిన వైభవ్ సూర్యవంశీ
జులై 4, 2026

CS Review | స్పెషల్ కాంటింజెన్సీ పంట ప్రణాళికలు సిద్ధం చేయాలి.. కలెక్టర్లకు సీఎస్ సంజయ్ జాజు ఆదేశం
జులై 4, 2026
తాజావార్తలు
- ●Global Passport Index 2026 | గ్లోబల్ పాస్‌పోర్ట్ ఇండెక్స్‌లో 125వ స్థానానికి పడిపోయిన భారత్.. ఏయే దేశాలకు వీసా-ఫ్రీగా వెళ్లొచ్చంటే?
- ●Mother Helps Son Crack JEE | బెడ్‌పై కొడుకు.. క్లాస్‌లో తల్లి: జేఈఈ అడ్వాన్స్డ్ క్రాక్ చేసి ఐఐటీ ఢిల్లీకి ఎంపికైన గుంజన్
- ●Gold Ramcharitmanas Missing | అయోధ్య రామమందిరంలో రూ.5 కోట్ల విలువైన బంగారు రామచరితమానస్ ఏమైంది?
- ●Vakiti Srihari | పాడి రైతుల కష్టాలు నాకెరికే.. ఇక 15 రోజులకోసారి బిల్లులు చెల్లిస్తం
- ●New Ration Cards | 48 గంటల్లోనే కొత్త రేషన్ కార్డులు జారీ : మంత్రి పొన్నం
- ●Ponnam Prabhakar | ఉపాధి ఉన్న దగ్గరే ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తం

Global Passport Index 2026 | గ్లోబల్ పాస్‌పోర్ట్ ఇండెక్స్‌లో 125వ స్థానానికి పడిపోయిన భారత్.. ఏయే దేశాలకు వీసా-ఫ్రీగా వెళ్లొచ్చంటే?

Mother Helps Son Crack JEE | బెడ్‌పై కొడుకు.. క్లాస్‌లో తల్లి: జేఈఈ అడ్వాన్స్డ్ క్రాక్ చేసి ఐఐటీ ఢిల్లీకి ఎంపికైన గుంజన్

Gold Ramcharitmanas Missing | అయోధ్య రామమందిరంలో రూ.5 కోట్ల విలువైన బంగారు రామచరితమానస్ ఏమైంది?

Vakiti Srihari | పాడి రైతుల కష్టాలు నాకెరికే.. ఇక 15 రోజులకోసారి బిల్లులు చెల్లిస్తం



