త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Lunar Eclipse | మార్చి 3న తొలి సంపూర్ణ చంద్రగ్రహణం.. భారత్‌లో ఏ నగరంలో ఎంత సేపు కనిపిస్తుందో తెలుసా?

Lunar Eclipse | ఈ ఏడాది తొలి సూర్యగ్రహణం ఫిబ్రవరి 17న ఏర్పడింది. ఈ గ్రహణం భారత్‌లో మాత్రం కనిపించలేదు. తాజాగా తొలి చంద్రగ్రహణం ఏర్పడనున్నది. ఈ క్రమంలో ఈ గ్రహణమైనా భారత్‌లో కనిపిస్తుందా? ఏయే ప్రాంతాల్లో కనిపిస్తుంది? అనే ఆసక్తి నెలకొన్నది. ఈ ఏడాది తొలి చంద్రగ్రహణం మార్చి 3న సంభవించబోతున్నది.

P

Science | Published On Feb 28, 2026, 10.16 am IST

Lunar Eclipse | మార్చి 3న తొలి సంపూర్ణ చంద్రగ్రహణం.. భారత్‌లో ఏ నగరంలో ఎంత సేపు కనిపిస్తుందో తెలుసా?
Advertisement

Lunar Eclipse | ఈ ఏడాది తొలి సూర్యగ్రహణం ఫిబ్రవరి 17న ఏర్పడింది. ఈ గ్రహణం భారత్‌లో మాత్రం కనిపించలేదు. తాజాగా తొలి చంద్రగ్రహణం ఏర్పడనున్నది. ఈ క్రమంలో ఈ గ్రహణమైనా భారత్‌లో కనిపిస్తుందా? ఏయే ప్రాంతాల్లో కనిపిస్తుంది? అనే ఆసక్తి నెలకొన్నది. ఈ ఏడాది తొలి చంద్రగ్రహణం మార్చి 3న సంభవించబోతున్నది. భారత కాలమానం ప్రకారం 3 గంటల 27 నిమిషాలకు ప్రారంభమై సాయంత్రం 6 గంటల 47 నిమిషాలకు ముగుస్తుంది. మొత్తం 3 గంటల 27 నిమిషాల పాటు ఈ గ్రహణం కొనసాగుతుంది. ఇది సంపూర్ణ చంద్రగ్రహణం కావడం విశేషం. ఆసియా దేశాలతో పాటు ఆస్ట్రేలియా ప్రాంతాల్లో కూడా ఇది స్పష్టంగా కనిపించనుంది. అయితే, ఈ గ్రహణం మాత్రం ప్రారంభం నుంచే కనిపించేందుకు అవకాశంలో లేదు. చంద్రోదయాన్ని బట్టి ఆయా నగరాల్లో కొద్దిసేపు మాత్రమే కనిపించేందుకు అవకాశం ఉంది. ముఖ్యంగా ఈశాన్య భారతదేశంలో చంద్రగ్రహణం ఎక్కువసేపు కనిపించనుంది. ఉత్తర, పశ్చిమ భారతదేశ ప్రాంతాల్లో మాత్రం కొద్దిసేపు మాత్రమే దర్శనమిస్తుంది.

ఏయే నగరాల్లో ఎంత సేపు కనిపిస్తుందంటే?

ఇటానగర్‌లో సుమారు ఒక గంట 40 గంటల పాటు కనిపిస్తుంది కోల్‌కతాలో దాదాపు ఒక గంట 15 నిమిషాలు, పాట్నాలో సుమారు  ఒక గంట మూడు నిమిషాల పాటు కనబడుతుంది. లక్నోలో సుమారు 45 నిమిషాలు, ఢిల్లీలో దాదాపు 25 నిమిషాలు కనువిందు చేస్తుంది. భోపాల్‌లో సుమారు 26 నిమిషాలు, చెన్నైలో 29 నిమిషాలు, ముంబయి నగరంలో కేవలం ఐదు నిమిషాలు మాత్రమే కనువిందు చేస్తుంది. ప్రాంతాల వారీగా చంద్రోదయం సమయాల్లో తేడాలు ఉండడంతో గ్రహణం సైతం కనిపించే వ్యత్యాసం ఉంటుందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.

చంద్రగ్రహణం ఎలా ఏర్పడుతుంది?

చంద్రుడు స్వయంగా ప్రకాశించడు. సూర్యకిరణాలు చంద్రుడిపై పడినప్పుడు అవి ప్రతిబింబించి మనకు వెలుగు కనిపిస్తుంది. భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతున్న సమయంలో పలు సందర్భాల్లో సూర్యుడు–భూమి–చంద్రుడు ఒకే సరళిలో వస్తాయి. అప్పుడు సూర్యుడికి, చంద్రుడికి మధ్యలో భూమి అడ్డుగా నిలుస్తుంది. ఈ పరిస్థితిలో సూర్యకాంతి నేరుగా చంద్రుడిపై పడదు. కానీ, భూమి నీడ చంద్రుడిపై పడుతుంది. భూమి నీడ పడిన భాగం చీకటిగా మారుతాడు. భూమి మీద నుంచి చూసినప్పుడు చంద్రుడు మసకబారినట్టుగా, కాస్త నల్లగా కనిపిస్తాడు. దీన్నే చంద్రగ్రహణం అంటారు. భూమి పూర్తి నీడ చంద్రుడిని పూర్తిగా కప్పేసినప్పుడు చంద్రుడు సంపూర్ణంగా చీకటిగా మారుతుంది దాన్నే సంపూర్ణ చంద్రగ్రహణంగా పేర్కొంటారు.

Advertisement
Advertisement