Chandra Grahan | నేడు సంపూర్ణ చంద్రగ్రహణం.. హైదరాబాద్‌లో ఎప్పుడు కనిపిస్తుందంటే?
Chandra Grahan | ఆకాశంలో జరుగుతున్న అద్భుతాన్ని వీక్షించే సమయం ఆసన్నమైంది. ఈ ఏడాది మొదటి చంద్రగ్రహణం (Chandra Grahan) మంగళవారం మధ్యాహ్నం ఏర్పడనుంది. సంపూర్ణ చంద్రగ్రహణం మధ్యాహ్నం 3.20 బ్లడ్‌మూన్ (Blood Moon) దశ ప్రారంభం కానుంది.
Chandra Grahan | త్రినేత్ర.న్యూస్: ఆకాశంలో జరుగుతున్న అద్భుతాన్ని వీక్షించే సమయం ఆసన్నమైంది. ఈ ఏడాది మొదటి చంద్రగ్రహణం (Chandra Grahan) మంగళవారం మధ్యాహ్నం ఏర్పడనుంది. సంపూర్ణ చంద్రగ్రహణం మధ్యాహ్నం 3.20 బ్లడ్‌మూన్ (Blood Moon) దశ ప్రారంభం కానుంది. సాయంత్రం 6.47 గంటలకు ముగుస్తుంది. మొత్తం 3 గంటల 27 నిమిషాల పాటు ఇది కొనసాగుతుంది. హైదరాబాద్‌తోపాటు (Hyderabad) దేశంలోని చాలా ప్రాంతాల్లో సాయంత్రం చంద్రోదయం అయ్యే సమయానికే గ్రహణం ముగింపు దశలో ఉంటుంది. అందువల్ల మనం చంద్రగ్రహణ (Lunar Eclipse) ముగింపు దశను మాత్రమే చూడగలం. అంటే సాయంత్రం 6 గంటల తర్వాతే ఆకాశంలో కనువిందు చేయనున్న బ్లడ్‌మూన్‌ను వీక్షించవచ్చు. ఈ సమయంలో చంద్రుడు ఎరుపు రంగులోకి మారనున్నాడు. దీంతో దీనిని బ్లడ్‌మూన్ అని పిలుస్తున్నారు.
ఎక్కడ స్పష్టంగా కనిపిస్తుందంటే..
మన దేశంలో ఈ గ్రహణం పాక్షికంగా మాత్రమే కనిపిస్తుంది. అయితే అస్సాంలోని దిబ్రూగఢ్, దిస్పూర్, గువాహటి, అరుణాచల్‌ప్రదేశ్‌లోని ఇటానగర్ (Itanagar), మేఘాలయలోని షిల్లాంగ్‌లో మాత్రం సాయంత్రం 5.10 నుంచి 5.25 గంటల వరకు గ్రహణం స్పష్టంగా కనిపించనుంది. కాగా, ఇటానగర్‌లో సుమారు ఒక గంట 40 నిమిషాల పాటు, కోల్‌కతాలో దాదాపు ఒక గంట 15 నిమిషాలు, పాట్నాలో సుమారు ఒక గంట మూడు నిమిషాల పాటు కనబడుతుంది. లక్నోలో సుమారు 45 నిమిషాలు, ఢిల్లీలో దాదాపు 25 నిమిషాలు కనువిందు చేస్తుంది. భోపాల్‌లో సుమారు 26 నిమిషాలు, చెన్నైలో 29 నిమిషాలు, ముంబైలో 5 నిమిషాలు మాత్రమే కనువిందు చేయనుంది. ప్రాంతాల వారీగా చంద్రోదయం సమయాల్లో తేడాలు ఉండడంతో గ్రహణం సైతం కనిపించే వ్యత్యాసం ఉంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు.
ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ సంపూర్ణ చంద్రగ్రహణం ప్రధానంగా తూర్పు ఆసియా, ఆస్ట్రేలియా, పసిఫిక్ మహాసముద్ర ప్రాంతాలు, ఉత్తర, మధ్య అమెరికా, అలాగే దక్షిణ అమెరికాలోని పశ్చిమ భాగాలలో స్పష్టంగా కనిపిస్తుంది. ఐరోపా, ఆఫ్రికా ఖండాల వారికి ఇది కనిపించకపోవడం విశేషం. మళ్లీ ఇలాంటి చంద్రగ్రహణం 2028, జూలై 6న ఏర్పడే అవకాశం ఉంది.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్




