త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Yadagirigutta | రేపు సంపూర్ణ‌ చంద్రగ్ర‌హ‌ణం.. యాద‌గిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయం బంద్‌

Yadagirigutta | త్రినేత్ర‌.న్యూస్‌: ఈ నెల 3న సంపూర్ణ చంద్ర‌గ్ర‌హ‌ణం (Lunar Eclipse) సందర్భంగా యాద‌గిరిగుట్ట (Yadagirigutta) శ్రీల‌క్ష్మీన‌ర‌సింహ స్వామివారి (Lakshmi Narasimha Swamy) ఆల‌యం మూత‌ప‌డ‌నుంది.

G

Devotional | Published On Mar 2, 2026, 10.40 am IST

Yadagirigutta | రేపు సంపూర్ణ‌ చంద్రగ్ర‌హ‌ణం.. యాద‌గిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయం బంద్‌
Advertisement

Yadagirigutta | త్రినేత్ర‌.న్యూస్‌: ఈ నెల 3న సంపూర్ణ చంద్ర‌గ్ర‌హ‌ణం (Lunar Eclipse) సందర్భంగా యాద‌గిరిగుట్ట (Yadagirigutta) శ్రీల‌క్ష్మీన‌ర‌సింహ స్వామివారి (Lakshmi Narasimha Swamy) ఆల‌యం మూత‌ప‌డ‌నుంది. మంగ‌ళ‌వారం ఉద‌యం 7 నుంచి బుధ‌వారం ఉదయం 3 గంటల వరకు మూసివేయ‌నున్న‌ట్లు ఆల‌య ఈఓ భవాని శంకర్ వెల్ల‌డించారు.

4వ తేదీన ఉదయం 3 నుంచి 5.30 గంటల వరకు ప్రధానాలయంతో పాటు ఉపాలయాలను తెరిచి గ్రహణ దోష పరిహారార్థం సంప్రోక్షణ, ఆలయ శుద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తామని చెప్పారు. అనంతరం సుప్రభాతం, తిరువారాధన, బాలబోగం, ఆరగింపు, నిజాభిషేకం నిర్వహించి, ఉదయం 8.45 గంటలకు భ‌క్తుల‌కు స్వామివారి దర్శనం క‌ల్పిస్తామ‌న్నారు. చంద్రగ్రహణం సందర్భంగా స్వామివారి సన్నిధిలో జరిగే హోలికోత్సవాన్ని సోమవారం సాయంత్రం నిర్వహిస్తామని తెలిపారు.

రాజ‌న్న‌, భీమేశ్వ‌రాల‌యాలు కూడా..

ఈ నెల 3న వేముల‌వాడ రాజ‌రాజేశ్వ‌ర‌స్వామి, భీమేశ్వ‌ర ఆల‌యాలతో పాటు అనుబంధ ఆల‌యాల‌ను మూసివేయ‌నున్న‌ట్లు అధికారులు తెలిపారు. మంగ‌ళ‌వారం చంద్ర‌గ్ర‌హ‌ణం ఏర్ప‌డ‌నున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఆల‌యాల‌ను ఉద‌యం ప్రాతఃకాల పూజ అనంతరం రాజన్న ఆలయంతో అనుబంధ ఆల‌యాల‌ను మూసివేస్తామ‌న్నారు. భ‌క్తుల ద‌ర్శ‌నాల‌ను నిలిపివేయ‌నున్న‌ట్లు తెలిపారు.

చంద్ర‌గ్ర‌హ‌ణం మ‌ధ్యాహ్నం 3.30 గంట‌ల‌కు ప్రారంభ‌మై.. సాయంత్రం ముగుస్తుంది. గ్రహణ సమయంలో జపాలు గ్రహణ పట్టు విడుపు స్నానాలు చేయాలని, గ్రహణం పుబ్బ, ముఖ నక్షత్ర జాతకులు సింహ, కుంభరాశి వారు గ్రహణాన్ని చూడొద్ద‌ని సూచించారు. గ్ర‌హ‌ణం ముగిసిన త‌ర్వాత రాత్రి 7 గంట‌ల‌కు సంప్రోక్ష‌ణ‌, ఆల‌య శుద్ధి త‌ర్వాత పూజాధికాలు కొన‌సాగుతాయ‌ని, ఆ త‌ర్వాత భ‌క్తులకు ద‌ర్శ‌నాలు క‌ల్పించ‌నున్న‌ట్లు ఆల‌య అధికారులు వివ‌రించారు.

Advertisement
Advertisement