జపాన్‌కు ‘మెగా క్వేక్’ ముప్పు? ప్రజలకు ముందస్తు హెచ్చరికలు జారీ
జపాన్‌లో 7.5 తీవ్రత భూకంపం తర్వాత మొదటిసారిగా ‘మెగాక్వేక్ అడ్వైజరీ’ జారీ అయింది. మాగ్నిట్యూడ్ 8 లేదా అంతకంటే పెద్ద ప్రకంపనం వచ్చే ప్రమాదం ఎంత? మెగాక్వేక్ అంటే ఏమిటి? భారత్‌కు ప్రభావముందా? పూర్తి వివరణ ఇక్కడ.
What Is a Megaquake? Why Japan Issued a High-Risk Advisory for Hokkaido–Sanriku
- వారంలో జపాన్‌కు భారీ భూకంప ప్రమాదం?
- ప్రజలకు హెచ్చరికలు జారీ చేసిన జపాన్ వాతావరణ శాఖ
- తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచించిన ప్రభుత్వం
సోమవారం డిసెంబర్ 8 రాత్రి జపాన్ ఉత్తర తీరాన్ని అతలాకుతలం చేసిన 7.5 భూకంపం తరువాత, జపాన్ వాతావరణ శాఖ (JMA) దేశంలో అరుదుగా వినిపించే “మెగాక్వేక్ అడ్వైజరీ(Mega Quake Advisory)”ని జారీ చేసింది.
జపాన్‌లో ‘మెగాక్వేక్ అడ్వైజరీ’: పరిస్థితి ప్రమాదకరమా?

Aomori–Hokkaido తీరానికి సమీపంలో 54 కి.మీ లోతులో పుట్టిన ఈ భూకంపం 60–70 సెం.మీ. ఎత్తులో చిన్న సునామీలకు దారితీసి, 30–34 మంది గాయపడటం, 90,000 మంది వరకు ముందుజాగ్రత్తగా తరలించబడటం, రోడ్లు–భవనాల్లో పగుళ్లు రావడానికి దారితీసింది. 2022లో అమలులోకి వచ్చిన కొత్త నిబంధనల ప్రకారం, ఒక ప్రాంతంలో 7.0 కంటే పెద్ద కంపనం నమోదైతే, అదే సబ్‌డక్షన్ జోన్(Subduction Zone – భూఫలకాలు ఢీకొనే ప్రదేశం)లో 8.0 లేదా అంతకంటే పెద్ద భూకంపం వచ్చే అవకాశాలు “సాధారణం కన్నా హెచ్చుగా” కనిపిస్తే ఈ మెగాక్వేక్ హెచ్చరిక జారీ చేస్తారు. ఇదే కారణంగా ఇప్పుడు వాతావరణ శాఖ, హొక్కైడో–సన్‌రికు తీర ప్రాంతంలో మొదటిసారిగా ప్రజలను అప్రమత్తం చేస్తోంది. పెను సునామీని సృష్టించగలిగే కంపనం జపాన్ ట్రంచ్, చిషిమా ట్రెంచ్‌ల వెంట సంభవించే అవకాశం ఉందని హెచ్చరించింది. అయితే భారీ భూకంపం వచ్చే అవకాశం కేవలం 1% మాత్రమే అయినా, ఆ ఒక్కశాతంలో కూడా విపరీతమైన ప్రాణ, ఆస్తి నష్టం జరుగుతుంది. ఇదే ఇప్పుడు ప్రభుత్వ ఆందోళన.
‘మెగా క్వేక్’ అంటే ఏంటి? ఎటువంటి ప్రమాద సూచన ఇది?

భూకంప శాస్త్రంలో 8.0 లేదా అంతకంటే పెద్ద స్థాయి భూకంపానికి ‘మెగా క్వేక్’ అని పేరు. ఇవి సాధారణంగా సబ్‌డక్షన్ జోన్లలో జరుగుతాయి — ఒక భారీ సముద్ర ఫలకం, భూఫలకం కిందికి నెమ్మదిగా జారుతూ సంవత్సరాల తరబడి పేరుకుని ఉన్న ఒత్తిడి ఒక్క క్షణంలో విడుదల కావడం వల్లే ఇలాంటి భూకంపాలు సంభవిస్తాయి. మెగాక్వేక్‌ల ప్రత్యేకత ఏమంటే — ఇవి స్థానికంగా మాత్రమే కాదు, వందల కిలోమీటర్ల విస్తీర్ణంలో బలమైన కంపనం, 15–30 మీటర్ల వరకు ఎత్తైన సునామీలు, తీర నగరాల మొత్తం నిర్మాణాన్ని నాశనం చేయగల శక్తి కలిగి ఉంటాయి. జపాన్‌కు ఇది కొత్త కాదు. 1923 కాన్‌టో, 1946 నాంకై, 2003 టోకాచి–ఒకి, ముఖ్యంగా 2011 తోహోకు (M 9.0) వంటి మెగాథ్రస్ట్ భూకంపాలు ఇదే రకం ఫలకాల సరిహద్దుల్లోనే జరిగాయి. 2011 విపత్తు — 20,000 మంది మరణం, 23–30 మీటర్ల సునామీలు, ఫుకుశిమా అణు ప్లాంట్ ప్రమాదం — ఇప్పటికీ జపాన్ జ్ఞాపకాలలో మిగిలిపోయిన దుర్ఘటన. ఇప్పుడు 7.5 కంపనం ఆ ప్రాంతంలోని ఒత్తిడి సమతుల్యతను మార్చి మరో పెద్ద భూకంపానికి అనువైన పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉందన్న భయం శాస్త్రవేత్తల్లో కనిపిస్తోంది. వాస్తవానికి రిక్టర్ స్కేలుపై 7కు 8కి ఒకటే అంకె తేడా అయినప్పటికీ భూకంప తీవ్రత 7.0 కంటే 32 రెట్లు ఎక్కువ. అంటే అది ఏ స్థాయి వినాశనానికి దారితీస్తుందో ఊహించుకోవచ్చు.
వచ్చే ముప్పు ఎంతవరకు వాస్తవం? జపాన్‌లో ప్రభావం ఏ స్థాయికి వెళ్లొచ్చు?

జపాన్ ప్రభుత్వం ప్రకటించిన అత్యంత అరుదైన అంచనాల ప్రకారం, హొక్కైడో–సన్‌రికు ప్రాంతంలో మెగాక్వేక్ సంభవిస్తే 30 మీటర్ల (98 అడుగుల) ఎత్తైన సునామీ అలలు తీరప్రాంతాలు ముంచే అవకాశం ఉంది. దాంతో 1.99 లక్షల మంది ప్రాణనష్టం, 2.20 లక్షల భవనాల ధ్వంసం, 31 ట్రిలియన్ యెన్ల ఆర్థిక నష్టం, శీతాకాలం కావడంతో 42,000 మందికి హైపోథర్మియా వచ్చే ప్రమాదం కూడా ఉందని ప్రభుత్వం చెబుతోంది. అందుకే ప్రజలకు ఎమర్జెన్సీ కిట్లు, రాత్రి మామూలు డ్రస్‌లోనే నిద్రించడం, ఫర్నిచర్‌ను గోడలకు బిగించడం, ఎమర్జెన్సీ మెయిల్, ఎస్ఎంఎస్ అలర్ట్‌ల కోసం రిజిస్ట్రేషన్.. అన్నీ తప్పనిసరిగా సూచించింది. అయితే దీనర్థం భూకంపం తప్పనిసరిగా వస్తుందని కాదు, “సంభావ్యత సాధారణం కన్నా ఎక్కువ” అని మాత్రమే ఈ advisory చెప్పేది.
భారత్‌పై ప్రభావం ఉండే అవకాశం?
జపాన్ ట్రెంచ్ భూకంపాలు తమ శక్తిని పసిఫిక్ మహాసముద్రంలోకే విడుదల చేస్తాయి. హిందూ మహాసముద్రం ఈ శక్తి ప్రవహించే దారిలో ఉండదు. భారత తీరాలకు ప్రమాదం కలిగించే ప్రధాన ప్రాంతాలు సుమత్రా–ఆండమాన్ సబ్‌డక్షన్ జోన్, అరేబియన్ సముద్రం. 2004 సునామీ కూడా పసిఫిక్ నుంచి కాదు, సుందా ట్రెంచ్ నుంచే వచ్చింది. అందువల్ల జపాన్‌లో మెగాక్వేక్ వచ్చినా, వచ్చినట్టైనా, భారత్ తీరాలకు భూకంపం గానీ, సునామీ ప్రమాదం గానీ లేదు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Earthquake | జపాన్ను కుదిపేసిన శక్తిమంతమైన భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ.. ప్రజలు బయటకు రావొద్దు
ఏప్రిల్ 20, 2026

India-US tariff | భారత్‌పై యూఎస్ టారిఫ్ 10 శాతమా? లేక 18 శాతమా? 13.5 శాతమా?
ఫిబ్రవరి 21, 2026

Mars | మంచుతో మార్స్‌పై బంగ్లాలు.. అంగారకుడిపై మనుషులు ఉండేందుకు సైంటిస్టుల బ్రిలియంట్ ప్లాన్!
డిసెంబర్ 25, 2025
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



