త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

India-US tariff | భారత్‌పై యూఎస్ టారిఫ్ 10 శాతమా? లేక 18 శాతమా? 13.5 శాతమా?

ఈ టారిఫ్ చిక్కుల మీద క్లారిటీ కోసం వచ్చే వారం భారత్ ప్రభుత్వ ప్రతినిధులు వాషింగ్టన్ వెళ్లనున్నారు. అప్పుడే ఈ కొత్త టారిఫ్ మీద ఓ క్లారిటీ రానుంది. కానీ.. అప్పటి వరకు మాత్రం ఈ సందిగ్ధత వీడటం కష్టమే.

J

Business | Published On Feb 21, 2026, 4.25 pm IST

India-US tariff | భారత్‌పై యూఎస్ టారిఫ్ 10 శాతమా? లేక 18 శాతమా? 13.5 శాతమా?
Advertisement

India-US tariff | యూఎస్ సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు తర్వాత యూఎస్, ప్రపంచ దేశాల మధ్య ఉన్న టారిఫ్‌లపై సందిగ్ధత నెలకొన్నది. ముఖ్యంగా భారత్, యూఎస్ మధ్య ఇప్పటికే ట్రేడ్ డీల్ ఫైనల్ అయిన విషయం తెలిసిందే. ఆ డీల్ ప్రకారం 18 శాతం టారిఫ్‌ను యూఎస్.. భారత్ మీద విధించింది. సుప్రీంకోర్టు తీర్పుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ట్రంప్.. అన్ని దేశాలపై 10 శాతం టారిఫ్ విధిస్తానని వెంటనే ప్రకటించారు. ఇప్పటి వరకు ఉపయోగించని సెక్షన్ 122ను వాడుకొని ఈ టారిఫ్‌ను ప్రపంచ దేశాల మీద ట్రంప్ విధించారు. ఈనేపథ్యంలో ఇప్పటికే యూఎస్, భారత్ మధ్య ఉన్న 18 శాతం టారిఫ్ ఉంటుందా? లేక కొత్తగా విధించిన 10 శాతం ఉంటుందా? అనే దానిపై క్లారిటీ రాలేదు. దీంతో అసలు భారత్ 18 శాతం టారిఫ్ కట్టాలా? లేక 10 శాతమా? లేక 13.5 శాతమా? అనే ప్రశ్న అందరిలోనూ తలెత్తింది.

150 రోజులే వాలిడిటీ

నిజానికి ట్రంప్ వాడుకున్న ఆ సెక్షన్ 122 ప్రకారం 150 రోజుల వరకు మాత్రమే 15 శాతం వరకు టారిఫ్‌ను ఇతర దేశాల మీద వేసే చాన్స్ ఉంటుంది. ఆ తర్వాత అమెరికా కాంగ్రెస్ ఆ టారిఫ్‌ను ఒప్పుకొని చట్టబద్ధం చేస్తేనే ఆ టారిఫ్‌కి వాల్యూ ఉంటుంది. లేదంటే 150 రోజుల్లోపు అమెరికా కాంగ్రెస్ ప్రస్తుతం ట్రంప్ విధించిన ఆ 10 శాతం టారిఫ్‌పై కూడా కొర్రీలు పెడితే ఇక అంతే. ఈ 10 శాతం టారిఫ్ ప్రపంచ దేశాలకు ఫిబ్రవరి 24 నుంచి అమలులోకి రానుంది.

మరి భారత్ సంగతేంటి?

ప్రపంచ దేశాలు అన్నింటితో పాటు భారత్ కూడా ఫిబ్రవరి 24 నుంచి 10 శాతం టారిఫ్ పరిధిలోకే రానుంది. ఇప్పటి వరకు ఇరు దేశాల మధ్య ఉన్న ట్రేడ్ డీల్ క్యాన్సిల్ కాబోతోంది. నిజానికి ట్రంప్ అధికారంలోకి రాకముందు భారత్ 3.5 శాతం టారిఫ్ మాత్రమే కట్టేది. యూఎస్ సుప్రీం కోర్టు ఆర్డర్ ప్రకారం.. ఇప్పటి వరకు ట్రంప్ విధించిన అన్ని టారిఫ్‌లు రద్దు అవుతాయి కాబట్టి.. భారత్ పాత టారిఫ్ విధానాన్నే ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అంటే 3.5 శాతం. దానికి అదనంగా ఇప్పుడు ట్రంప్ విధించిన 10 శాతం కలిపితే 13.5 శాతం టారిఫ్ పడే అవకాశం ఉంది. కానీ.. దీనిపై వైట్ హౌస్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

ఆ వస్తువుల మీద ఉన్న టారిఫ్ మారదు

సెక్షన్ 232 ప్రకారం భారత్ నుంచి యూఎస్‌కి ఎగుమతి అయ్యే స్టీల్, అల్యూమినియం మీద ఉన్న పాత టారిఫ్ 50 శాతం, ఆటో పార్ట్స్ మీద ఉన్న 25 శాతం టారిఫ్ మాత్రం అలాగే ఉండనుంది.

ట్రంప్ వ్యాఖ్యలకు అర్థం ఏంటి?

మరోవైపు ప్రపంచ దేశాలపై కొత్త టారిఫ్స్ ప్రకటన తర్వాత యూఎస్, భారత్ డీల్‌పై వ్యాఖ్యానించిన ట్రంప్ 18 శాతం సుంకాలు అలాగే ఉంటాయన్నారు. ఏం మారదు. వాళ్లు మాకు సుంకాలు చెల్లిస్తున్నారు. మేము వాళ్లకు ఎలాంటి సుంకం చెల్లించడం లేదు.. అని ట్రంప్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ప్రధాని మోదీ జెంటిల్‌మ్యాన్. గ్రేట్ మ్యాన్. కానీ భారత్ మా నుంచి ఒకప్పుడు అధిక సుంకాలు తీసుకునేది. అందుకే భారత్‌తో డీల్ కుదుర్చుకున్నాం. అది ఫెయిర్ డీల్ అని నాకు అనిపిస్తోంది అని ట్రంప్ వ్యాఖ్యానించారు.

వచ్చే వారం యూఎస్‌కి భారత్ అధికారులు

ఈ టారిఫ్ చిక్కుల మీద క్లారిటీ కోసం వచ్చే వారం భారత్ ప్రభుత్వ ప్రతినిధులు వాషింగ్టన్ వెళ్లనున్నారు. అప్పుడే ఈ కొత్త టారిఫ్ మీద ఓ క్లారిటీ రానుంది. కానీ.. అప్పటి వరకు మాత్రం ఈ సందిగ్ధత వీడటం కష్టమే.

Advertisement
Advertisement