త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

ISRO | గువాహటికి ఇస్రో కొత్త కేంద్రం.. అంతరిక్ష భద్రతకు మరింత బలం..

ISRO | భార‌త అంత‌రిక్ష ప‌రిశోధ‌నా సంస్థ ఇస్రో మ‌రో కీల‌క అడుగు వేసింది. ఇస్రోకు రాడార్‌, ఉప‌గ్ర‌హాల ట్రాకింగ్ సామ‌ర్థ్యాలు ఇక‌పై మ‌రింత మెరుగుప‌డ‌నున్నాయి. అసోంలోని గువాహ‌టికి స‌మీపంలో ఉన్న చంద్రాపూర్‌లో ఇస్రో ఆధ్వ‌ర్యంలో కొత్త అత్యాధునిక కేంద్రాన్ని ఏర్పాటు చేయ‌నున్నారు. ఈ కేంద్రానికి ఇటీవ‌లే అసోం ముఖ్య‌మంత్రి హిమంత బిశ్వ‌శ‌ర్మ శంకుస్థాప‌న చేశారు.

S

Science | Published On Oct 2, 2026, 1.03 pm IST

ISRO | గువాహటికి ఇస్రో కొత్త కేంద్రం.. అంతరిక్ష భద్రతకు మరింత బలం..
Advertisement

ISRO | భార‌త అంత‌రిక్ష ప‌రిశోధ‌నా సంస్థ ఇస్రో మ‌రో కీల‌క అడుగు వేసింది. ఇస్రోకు రాడార్‌, ఉప‌గ్ర‌హాల ట్రాకింగ్ సామ‌ర్థ్యాలు ఇక‌పై మ‌రింత మెరుగుప‌డ‌నున్నాయి. అసోంలోని గువాహ‌టికి స‌మీపంలో ఉన్న చంద్రాపూర్‌లో ఇస్రో ఆధ్వ‌ర్యంలో కొత్త అత్యాధునిక కేంద్రాన్ని ఏర్పాటు చేయ‌నున్నారు. ఈ కేంద్రానికి ఇటీవ‌లే అసోం ముఖ్య‌మంత్రి హిమంత బిశ్వ‌శ‌ర్మ శంకుస్థాప‌న చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో ఇస్రో చైర్మ‌న్ వి.నారాయ‌ణ‌న్‌తోపాటు ప‌లువురు సీనియ‌ర్ అంత‌రిక్ష శాస్త్రవేత్త‌లు పాల్గొన్నారు. ఇస్రో నెట్‌వ‌ర్క్ ఫ‌ర్ స్పేస్ ఆబ్జెక్ట్ ట్రాకింగ్ అండ్ అనాలిసిస్ (నేత్రా)లో భాగంగా ఈ కొత్త కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అంత‌రిక్ష ప‌రిస్థితుల‌పై అవ‌గాహ‌న‌ను మ‌రింత మెరుగుప‌ర‌చ‌డంలో ఇది కీల‌కంగా పనిచేస్తుంది.

అంత‌రిక్షంలో నిరంత‌రం భ‌ద్ర‌త ప‌ర్య‌వేక్ష‌ణ‌..

అంత‌రిక్షంలో ఉన్న ఉప‌గ్ర‌హాలు, ఇత‌ర వస్తువుల‌ను నిరంత‌రం ప‌ర్య‌వేక్షించ‌డం, అంత‌రిక్ష వ్య‌ర్థాల‌తో ఢీకొనే ప్ర‌మాదాల‌ను గుర్తించి అంత‌రిక్ష ఆస్తుల‌ను ర‌క్షించ‌డం కోసం ఈ వ్య‌వ‌స్థ ఉప‌గ‌యోగ‌ప‌డుతుంది. అధునాత‌న రాడార్ సాంకేతిక‌త‌ల‌తో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తుండ‌గా, దీని బాధ్య‌త‌ను ఇస్రో ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంది. ఇస్రోలోని టెలిమెట్రీ, ట్రాకింగ్ అండ్ క‌మాండ్ నెట్‌వ‌ర్క్ ఆధ్వ‌ర్యంలో పనులు కొన‌సాగుతున్నాయి. కేంద్రం పూర్తి స్థాయిలో అందుబాటులోకి వ‌చ్చిన అనంత‌రం గువాహ‌టి కేంద్రం అయానోస్పియ‌ర్‌, వాతావ‌ర‌ణ ప‌రిశీల‌న‌ల‌ను మెరుగుప‌ర‌చ‌డంతోపాటు వాతావ‌రణ ప‌ర్య‌వేక్ష‌ణ‌, మేఘాల ప‌రిశీల‌న‌, అంత‌రిక్ష వాతావ‌ర‌ణంపై అధ్య‌య‌నాల‌కు స‌హ‌కారం అందించ‌నుంది.

వాతావ‌ర‌ణ మార్పులు సైతం ట్రాకింగ్‌..

వాతావ‌ర‌ణంలో భూమికి స‌మీపంలోని అంత‌రిక్ష ప‌రిస‌రాల్లో చోటు చేసుకునే కీల‌క ప్ర‌క్రియ‌ల‌ను శాస్త్ర‌వేత్తలు ప‌రిశీలించి అర్థం చేసుకునేందుకు ఈ కేంద్రం ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని ఇస్రో తెలిపింది. మెరుగైన వాతావ‌ర‌ణ అంచ‌నాలు, అంత‌రిక్ష వాతావ‌ర‌ణ ప‌రిస్థితుల అంచ‌నా, క‌మ్యూనికేష‌న్‌, నావిగేష‌న్ అధ్య‌య‌నాలు, భ‌విష్య‌త్ అంత‌రిక్ష మిష‌న్లు, వివిధ అంతరిక్ష అనువ‌ర్త‌నాల‌కు ఈ కేంద్రం మ‌ద్ద‌తు అందిస్తుంది. ఆక‌స్మిక వ‌ర‌ద‌లు, ప‌ట్ట‌ణ వ‌ర‌ద‌ల‌ను ప‌ర్య‌వేక్షించి ముంద‌స్తు హెచ్చ‌రిక‌ల‌ను జారీ చేయ‌డంలోనూ కీల‌క‌పాత్ర పోషిస్తుంది. ఉరుములు, పిడుగుల‌పై త‌క్ష‌ణ అంచ‌నాల‌ను మ‌రింత మెరుగుప‌ర‌చ‌డంతోపాటు, విమాన‌యాన సేవ‌ల‌కు అవ‌సర‌మైన స‌మాచారాన్ని అందించ‌డం వంటి అనేక ప్ర‌యోజ‌నాలు ఉంటాయ‌ని ఇస్రో తెలియ‌జేసింది. దీంతో ఈ కేంద్రం ప్రాంతీయ అస‌వ‌రాల‌కు తోడు జాతీయ స్థాయిలోనూ కీల‌క‌మైన సేవ‌ల‌ను అందిస్తుంద‌ని స్ప‌ష్టం చేసింది.

Advertisement
Advertisement