3I/ATLAS | భూమికి అతి దగ్గరగా వస్తున్న తారంతర వస్తువు 3ఐ/అట్లాస్ : ఇది తోకచుక్కేనా?
డిసెంబర్ 19న భూమికి అతి దగ్గరగా రానున్న అంతర్నక్షత్ర వస్తువు 3I/ATLAS గురించి ప్రొఫెసర్ Avi Loeb చేసిన విశ్లేషణలు ప్రపంచ శాస్త్రవేత్తల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇది తోకచుక్కా? లేక గ్రహాంతరవాసుల స్పేస్‌షిప్‌నా? దాని పథం, జెట్లు, రసాయనాలు ఎందుకు అనుమానాలకు దారితీస్తున్నాయి?
3I/ATLAS: Is the Interstellar Visitor Approaching Earth an Alien Spacecraft?
(త్రినేత్ర సైన్స్ డెస్క్)
హైదరాబాద్, డిసెంబర్ 13, 2025: మన సౌరవ్యవస్థలోకి మరో నక్షత్ర వ్యవస్థ నుంచి వచ్చిన మూడవ అంతర్నక్షత్ర వస్తువు “3I/ATLAS”, ఈ డిసెంబర్ 19న భూమికి అతి దగ్గరగా వస్తోంది. ఇది రూపంలో సాధారణ తోకచుక్కలా కనిపిస్తున్నా, దీని లక్షణాలు మాత్రం పూర్తి భిన్నంగా ఉన్నాయని హార్వర్డ్ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త ప్రొఫెసర్ డా. అవి లోయెబ్ స్పష్టంగా చెబుతున్నారు. ఈ వస్తువులో కనిపిస్తున్న విభిన్న లక్షణాలు దీన్ని “అంతరిక్షనౌక”గా అనుమానించడానికి దారితీస్తున్నాయని లోయబ్ అభిప్రాయం. దానికి సంబంధించి తన వాదనేంటో చూద్దాం.
జూలై 2025లో అట్లాస్ టెలిస్కోప్ ద్వారా గుర్తించిన ఈ వస్తువు గ్రహాల దిశకు వ్యతిరేకంగా అతి వేగంగా వచ్చి, సూర్యునికి దగ్గరగా (అక్టోబర్ 30న) వెళ్లి ఇప్పుడు మళ్లీ బయటకు వస్తోంది. డిసెంబర్ 19న భూమికి అత్యంత సమీపంగా (కేవలం 270 మిలియన్ కిలోమీటర్ల దూరం) రానుంది. అయితే, ఇది భూమికి ఎలాంటి ప్రమాదం కాదు. కానీ దీని పథం, జెట్లు(రాకెట్లు, జెట్ విమానాలు వెదజల్లే అత్యంత వేగవంతమైన మంటలు), రసాయనాలు వంటివి సాధారణ తోకచుక్కలకు భిన్నంగా ఉన్నాయి.
3I/ATLAS.. చూడ్డానికి తోకచుక్కలాగే..

ఈ అట్లాస్ మన శాస్త్రవేత్తలకు(అందరికీ కాదు) ధూమకేతువులా లేదా అంతరిక్షనౌక లా ఎందుకు కనిపిస్తోందంటే, తోకచుక్క గానీ, మన అంతరిక్ష నౌక గానీ, సూర్యరశ్మి పడగానే దాని మీది మంచు కరిగి గ్యాస్, ధూళి ఒక దిక్కుకు వెళ్లి, అది రాకెట్ లాగా వ్యతిరేక దిశలో తోసుకుపోతుంది. స్పేస్‌షిప్‌కు ఇంజన్ కూడా ఉంటుంది కాబట్టి ఇలాగే తోసుకుపోవచ్చు. అందుకే దూరం నుంచి చూస్తే తోకచుక్కలాగానే కనిపిస్తుంది. తేడా ఏంటంటే, స్పేస్‌షిప్ అయితే లైట్లు వేయొచ్చు, ఏ దిశకైనా వెంటనే మార్చవచ్చు.
చాలా మంది ఖగోళ, ధూమకేతు నిపుణులు దీన్ని సాధారణ మంచు రాయిగానే చూస్తున్నారు. కానీ అవి లోయెబ్ మాటల్లో, గత దశాబ్దాలుగా మన సౌరవ్యవస్థలోని మంచు రాళ్లనే చూసీ చూసీ వాళ్లు అలవాటు పడ్డారు. కొత్తగా ఆలోచించడానికి భయపడుతున్నారు. మనం అంతరిక్షంలోకి స్పేస్‌షిప్‌లు పంపుతున్నాం కదా! ఇతర గ్రహాల జీవులు కూడా అలాగే పంపి ఉండొచ్చు. మిల్కీవే గెలాక్సీ(మన స్వంత పాలపుంత)లోనే 10000 కోట్ల నక్షత్రాలు ఉన్నాయి, ఇక మన సూర్యుడిలాంటివి కోటానుకోట్లలో ఉన్నాయి. ఈ విశాల విశ్వంలో మనలాంటి పాలపుంతలు లక్ష కోట్లున్నట్లు తాజా పరిశోధనాఫలితం. ఇటువంటి పరిస్థితుల్లో ఎక్కడో ఒక చోట మనలాంటి సమాజాలు ఉండొచ్చు. ఉదాహరణకు, 2018లో ఎలాన్ మస్క్ టెస్లా రోడ్‌స్టర్ కారును అంతరిక్షంలోకి పంపాడు. దాన్ని మనవాళ్లు గ్రహశకలమని అపార్థం చేసుకుని, 2018CN41 అని పేరు కూడా పెట్టారు. అంటే, మన అంతరిక్ష నిఘా వ్యవస్థను తప్పుదారి పట్టించే ఖగోళ వస్తువులున్నాయన్నమాటేగా.
3I/ATLAS గురించి ప్రొఫెసర్ లోయెబ్ చెప్పిన ముఖ్యమైన వింతలు

- దీని పథం(వెళ్తున్న దారి) గ్రహాల సమతలంతో కేవలం 5 డిగ్రీల తేడాతో ఉంది.. యాదృచ్ఛికంగా ఇలా వచ్చే అవకాశం కేవలం2 శాతం మాత్రమే.
- ఇది 1977లో వచ్చిన అంతుచిక్కని “వావ్! సిగ్నల్(Wow! Signal)” దిశ నుంచే వస్తోంది. అది కూడా 0.6% అవకాశంతో.
- సూర్యుడి వైపు జెట్ (యాంటీ-టెయిల్) కనిపిస్తోంది, సాధారణ తోకచుక్కల్లో ఇది దృశ్యభ్రమ(optical illustion) మాత్రమే. కానీ ఇక్కడ అలా లేదు.
- దీని సమయం ఖచ్చితంగా అంగారకుడు, శుక్రుడు, గురుడు దగ్గరగా వచ్చేలా ఉంది. మార్చి 2026లో గురుడి హిల్ రేడియస్‌కు ఖచ్చితంగా సరిపోయేంత దూరంలో వెళ్తుంది ఈ దూరాలు ఖచ్చితంగా గురుడి గురుత్వాకర్షణ పరిధికి సరిగ్గా సరిపోతున్నాయి. బహుశా చిన్న స్పేస్ షిప్‌లను గురుడి చుట్టూ వదిలెయ్యడానికి ప్లాన్ చేసి ఉండవచ్చు(?).
- ఇది చాలా పెద్దగా ఉంది(దాదాపు 6 కిమీ వ్యాసం), వేగవంతమైంది(గంటకు 2,10,000 కిమీ) – ఇంత పెద్ద రాయి అలా కాకతాళీయంగా రావడం అసాధ్యం.
- తోకలోని గ్యాస్‌లో నికెల్ ఎక్కువ, ఐరన్ తక్కువ. మన ఫ్యాక్టరీల్లో తయారు చేసే లోహ మిశ్రమం లాగా ఉంది.
- సూర్యుడి వైపు మరియు వ్యతిరేకంగా రెండు జెట్లు ఉన్నాయి – మంచు కరగడం వల్ల ఇంత శక్తి రాదు, బహుశా థ్రస్టర్లు (ఇంజన్లు) ఉండవచ్చు.
- పెరిహెలియన్(సూర్యుడికి దగ్గరగా వచ్చే కక్ష్యప్రాంతం) దగ్గర గురుత్వాకర్షక వ్యతిరేక వేగం కనిపించింది – ఇంజన్ వల్ల కావచ్చు.
- జెట్లు మిలియన్ కిలోమీటర్ల వద్ద స్థిరంగా ఉన్నాయి – నావిగేషన్ లేదా మినీ ప్రోబ్‌లు విడుదల చేయడానికి ఉపయోగపడవచ్చు.
ఇలాంటి వస్తువులు సాంకేతికపరమైనవి(గ్రహాంతరవాసుల వాహనం) అయితే మనకు ప్రమాదం కావచ్చని లోయెబ్ హెచ్చరిస్తున్నారు. మనకు గ్రహాంతర సాంకేతికతకు తగ్గ ప్రతిస్పందన ప్రణాళికేం లేదు. ఈ డిసెంబర్ 19న అమావాస్య కాబట్టి ఆకాశం స్పష్టంగా ఉండి, హబుల్, జేమ్స్ వెబ్ టెలిస్కోప్‌లు మరింత స్పష్టమైన ఫోటోలు తీయడానికి అవకాశముంటుంది. అవి ఇప్పటికే సిద్ధంగా ఉన్నాయి. ఇక ఆ జెట్ల వేగం కొలిస్తే అవి మంచు కరగడం వల్లనా లేక ఇంజన్ వల్లనా అని తెలుస్తుంది.
మన గెలాక్సీలో మనం ఒంటరిగా లేమనడానికి అతి పెద్ద ఆధారం, 10000 కోట్ల నక్షత్రాలు ఉండటం. మనలాగే జీవం ఎక్కడో ఉండటానికి వందశాతం అవకాశముంది. తారంతర వస్తువులు మనకు ప్రాచీన జీవం లేదా సాంకేతికత గురించి కొత్త ఆధారాలిస్తాయి.

అవి లోయెబ్ అంతర్జాతీయ ఖగోళ శాస్త్రరంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మక వ్యక్తి. Galileo Project హెడ్, Harvard Black Hole Initiative వ్యవస్థాపక డైరెక్టర్, Harvard–Smithsonian Center for Astrophysicsలోని Institute for Theory and Computation డైరెక్టర్, అలాగే Harvard Astronomy Department (2011–2020) మాజీ చైర్మన్ — ఆయన అనుభవం, లోతైన పరిశోధనల కారణంగానే 3I/ATLAS పై ఆయన వ్యాఖ్యలు విశేష ప్రాధాన్యం పొందుతున్నాయి.
అంతేగాక ఆయన Extraterrestrial, Life in the Cosmos వంటి బెస్ట్‌సెల్లర్ పుస్తకాలు రాసి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందారు. 2024లో వచ్చిన Interstellar పుస్తకం కూడా ఇదే అంశంపై విస్తృత చర్చలకు దారితీసింది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Moon Study | చంద్రుడిపై సూక్ష్మజీవుల మనుగడపై కొత్త అధ్యయనం.. వెలుగులోకి ఆసక్తికర విషయాలు
ఆగస్టు 23, 2026

S301 Star | బాప్రే సెకనుకు 25వేల కిలోమీటర్ల వేగం.. అత్యంత వేగంగా దూసుకెళ్తున్న నక్షత్రం !
ఆగస్టు 22, 2026

Primordial Black Holes | ఆదిమ కృష్ణబిలం జాడ చిక్కింది..! శాస్త్రవేత్తలు ఏమన్నారంటే..!
మార్చి 31, 2026
తాజావార్తలు
- ●Mercedes Benz Cars | భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన బెంజ్ కార్లు
- ●Hero Motors | మూడు ఐపీఓల లిస్టింగ్.. ఎవరి షేర్ ఎంత లాభం ఇచ్చిందంటే?
- ●Bank Employees Strike | ఈ నెల 28 నుంచి మూడు రోజులు బ్యాంకులు బంద్.. ఉద్యోగుల సమ్మె సైరన్ ఎందుకు? వాళ్ల డిమాండ్స్ ఏంటి?
- ●Lady Shri Ram College | మైనర్‌పై గ్యాంగ్‌రేప్ ఘటన.. విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్న లేడీ శ్రీరామ్ కళాశాల
- ●Anthropic | ఆంథ్రోపిక్ నుంచి క్లాడ్ ఓపస్ 5.5.. గత మోడల్స్ కన్నా 40 శాతం తక్కువ ఖర్చు..
- ●Election Commission | సర్‌పై ఈసీలో అంతర్గత విభేదాలు.. జ్ఞానేశ్ కుమార్ నిర్ణయాలపై ఇద్దరు కమిషనర్లు అభ్యంతరాలు

Mercedes Benz Cars | భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన బెంజ్ కార్లు

Hero Motors | మూడు ఐపీఓల లిస్టింగ్.. ఎవరి షేర్ ఎంత లాభం ఇచ్చిందంటే?

Bank Employees Strike | ఈ నెల 28 నుంచి మూడు రోజులు బ్యాంకులు బంద్.. ఉద్యోగుల సమ్మె సైరన్ ఎందుకు? వాళ్ల డిమాండ్స్ ఏంటి?

Lady Shri Ram College | మైనర్‌పై గ్యాంగ్‌రేప్ ఘటన.. విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్న లేడీ శ్రీరామ్ కళాశాల



