త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Teenmar Mallanna BC Rajyadhikara Yatra | కొడంగల్‌లో అడుగుపెడతా.. రేవంత్ రెడ్డి భరతం పడతా

బీసీ రాజ్యాధికార యాత్రలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 2028లో బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని శపథం చేశారు.

J

Rangareddy | Published On Sep 23, 2026, 7.29 pm IST

Teenmar Mallanna BC Rajyadhikara Yatra | కొడంగల్‌లో అడుగుపెడతా.. రేవంత్ రెడ్డి భరతం పడతా

సంక్షిప్త సారాంశం

తెలంగాణలో బీసీలకు రాజకీయ, భూ, విద్య, వైద్య అధికారాలు దక్కాలనే లక్ష్యంతో తీన్మార్ మల్లన్న బీసీ రాజ్యాధికార యాత్ర కొనసాగుతోంది. పరిగి నుంచి వికారాబాద్ వరకు సాగిన ఈ పాదయాత్ర 122 కిలోమీటర్ల మైలురాయిని చేరుకుంది. 80 ఏళ్లుగా అధికారం రెడ్డి, వెలమల చేతుల్లోనే ఉందని, బీసీలకు రాజకీయ వాటా దక్కకుండా అడ్డుకుంటున్నారని మల్లన్న ఆరోపించారు. 2028 నాటికి రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రిని తీసుకురావడమే తమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.

Advertisement
  • ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు

Teenmar Mallanna BC Rajyadhikara Yatra | త్రినేత్ర న్యూస్ : తెలంగాణ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేస్తామని, 2028లో బీసీ వర్గానికి చెందిన వ్యక్తిని ముఖ్యమంత్రిగా చేసి తీరుతామని తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సంచలన ప్రకటన చేశారు. బీసీలకు జనాభాకు తగిన రాజకీయ అధికారం, నాణ్యమైన విద్య, వైద్యం, భూమి దక్కాలనే డిమాండ్‌తో ఆయన చేపట్టిన "బీసీ రాజ్యాధికార యాత్ర" ఏడో రోజు పరిగి నుంచి వికారాబాద్ వైపు ఉత్సాహంగా సాగింది. ఈ పాదయాత్ర తాజాగా 122 కిలోమీటర్ల మైలురాయిని విజయవంతంగా పూర్తి చేసుకుంది.

Teenmar Mallanna Warns Revanth Reddy During BC Rajyadhikara Yatra in Vikarabad

80 ఏళ్లుగా రెడ్డి, వెలమల చేతుల్లోనే అధికారం

వికారాబాద్‌లో నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లో మల్లన్న మాట్లాడుతూ.. గత 80 ఏళ్లుగా తెలంగాణలో రాజకీయ అధికారం, సంపద మొత్తం రెడ్డి, వెలమ సామాజిక వర్గాల చేతుల్లోనే కేంద్రీకృతమై ఉన్నాయని విమర్శించారు. బీసీలకు రాజకీయాల్లో తగిన ప్రాతినిధ్యం దక్కకుండా ఈ వర్గాలు అడ్డుకుంటున్నాయని మండిపడ్డారు. కులగణన పత్రాలను తగలేసినందుకు తనను కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారని, కానీ తాను బీసీల హక్కుల కోసం వెనకడుగు వేసేది లేదని స్పష్టం చేశారు.

Teenmar Mallanna Warns Revanth Reddy During BC Rajyadhikara Yatra in Vikarabad

రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు

రైతు రుణమాఫీ పేరుతో బీసీల పేరుతో 9 వేల కోట్ల అప్పు తెచ్చి, ఎంపీగా పోటీ చేసిన రంజిత్ రెడ్డికి 5 వేల కోట్లు మాఫీ చేశారని మల్లన్న ఆరోపించారు. ఇది ఎవరి కోసం పనిచేస్తున్న ప్రభుత్వం అని ప్రశ్నించారు. అలాగే, వికారాబాద్ ప్రాంత ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి తాత కోటి ఎకరాల భూమిని పేదలకు పంచకుండా రెడ్లు, వెలమలకు అప్పగించారని ఆరోపించారు. 1954-55 కాస్ర పహాని నాటి నుంచి రెవెన్యూ శాఖ వారి చేతుల్లోనే ఉందని దుయ్యబట్టారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు రాకుండా కోర్టుల్లో కేసులు వేసి అడ్డుకుంటున్నారని మండిపడ్డారు.

Teenmar Mallanna Warns Revanth Reddy During BC Rajyadhikara Yatra in Vikarabad

పాఠశాల విద్యార్థులతో మమేకమైన మల్లన్న

పాదయాత్రలో భాగంగా మల్లన్న మార్గమధ్యంలో నస్కల్‌లోని ప్రాథమిక పాఠశాలను, కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను సందర్శించారు. విద్యార్థులతో కలిసి బెంచ్‌పై కూర్చుని వారి చదువు, మధ్యాహ్న భోజనం నాణ్యత, హాస్టల్ వసతులు, యూనిఫాంల గురించి ఆప్యాయంగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించి గోవిందపూర్ వైపు యాత్రను కొనసాగించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఇంచార్జి బంధారపు నర్సయ్య గౌడ్, వికారాబాద్ జిల్లా అధ్యక్షులు మహమ్మద్ గౌస్ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Teenmar Mallanna Warns Revanth Reddy During BC Rajyadhikara Yatra in Vikarabad

Advertisement
Advertisement