త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Teenmar Mallanna | స్కిల్ యూనివ‌ర్సిటీ వీసీకి పీహెచ్‌డీ ప‌ట్టా కూడా లేదు : ఎమ్మెల్సీ తీన్మార్ మ‌ల్ల‌న్న‌

Teenmar Mallanna | తెలంగాణ‌లోని కాంగ్రెస్ ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా ఏర్పాటు చేసిన యంగ్ ఇండియా స్కిల్ యూనివ‌ర్సిటీపై ఎమ్మెల్సీ తీన్మార్ మ‌ల్లన్న తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. స్కిల్ యూనివ‌ర్సిటీకి స్కిల్స్ లేని వీసీ ఉన్నారు.. దేశంలోనే పీహెచ్‌డీ లేని తొలి వైస్ ఛాన్స‌ల‌ర్ ఆయ‌నే అని మ‌ల్ల‌న్న తెలిపారు.

S

Telangana | Published On Sep 11, 2026, 11.28 pm IST

Teenmar Mallanna | స్కిల్ యూనివ‌ర్సిటీ వీసీకి పీహెచ్‌డీ ప‌ట్టా కూడా లేదు : ఎమ్మెల్సీ తీన్మార్ మ‌ల్ల‌న్న‌
Advertisement

Teenmar Mallanna | త్రినేత్ర‌.న్యూస్ : తెలంగాణ‌లోని కాంగ్రెస్ ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా ఏర్పాటు చేసిన యంగ్ ఇండియా స్కిల్ యూనివ‌ర్సిటీపై ఎమ్మెల్సీ తీన్మార్ మ‌ల్లన్న తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. స్కిల్ యూనివ‌ర్సిటీకి స్కిల్స్ లేని వీసీ ఉన్నారు.. దేశంలోనే పీహెచ్‌డీ లేని తొలి వైస్ ఛాన్స‌ల‌ర్ ఆయ‌నే అని మ‌ల్ల‌న్న తెలిపారు. శాస‌న‌మండ‌లిలో మ‌ల్ల‌న్న మాట్లాడుతూ.. పాలిటెక్నిక్ విద్యార్థులు, అధ్యాపకుల సమస్యలపై మాట్లాడుతూ, జీవో నంబర్ 97 కారణంగా రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు, అధ్యాపకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.

యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి పాలిటెక్నిక్ వ్యవస్థను తీసుకురావడం వల్ల భవిష్యత్తులో స్కాలర్‌షిప్‌లు నిలిచిపోవడం, ఫీజులు పెరగడం, అధ్యాపకులకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయని చెప్పారు. ఈ అంశంపై వందలాది మంది విద్యార్థులు తనకు వినతిపత్రాలు అందజేశారని వెల్లడించారు. ఈ సందర్భంగా యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పనితీరుపై కూడా తీన్మార్ మల్లన్న తీవ్ర విమర్శలు చేశారు. "స్కిల్ యూనివర్సిటీకి స్కిల్స్ లేని వీసీ ఉన్నారు. దేశంలోనే పీహెచ్‌డీ లేని తొలి వైస్ ఛాన్సలర్ ఆయనే. యూనివర్సిటీలో సరైన మౌలిక వసతులు లేవు. కేవలం ఐదుగురు సిబ్బందితోనే వ్యవస్థ నడుస్తోంది" అని మండలిలో వ్యాఖ్యానించారు.పాలిటెక్నిక్ విద్యార్థులు, అధ్యాపకులను మనోవేదనకు గురిచేస్తున్న 97 జీవోను వెంటనే రద్దు చేసి, పాత విధానంలోనే పాలిటెక్నిక్ విద్యను కొనసాగించాలని ప్రభుత్వాన్ని కోరారు.

Advertisement
Advertisement