త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sonia Gandhi Autobiography Belonging | ‘నేను మీ మనిషినే’ అని సోనియా ఇంకా నిరూపించుకోవాలా? ‘బిలాంగింగ్’ బుక్‌పై సుజాత వేల్పూరి ఎమోషనల్ పోస్ట్!

50 ఏళ్ల క్రితం ఈ ఇంటి కోడలిగా వచ్చినా సోనియా గాంధీని ఇంకా విదేశీయురాలిగానే చూస్తారా? ఆమె ఆత్మకథ 'బిలాంగింగ్' నేపథ్యంలో రచయిత్రి సుజాత వేల్పూరి రాసిన పోస్ట్ వైరల్!

J

Popular news | Published On Nov 12, 2026, 5.26 pm IST

Sonia Gandhi Autobiography Belonging | ‘నేను మీ మనిషినే’ అని సోనియా ఇంకా నిరూపించుకోవాలా? ‘బిలాంగింగ్’ బుక్‌పై సుజాత వేల్పూరి ఎమోషనల్ పోస్ట్!

సంక్షిప్త సారాంశం

విదేశాల్లోని భారతీయ మూలాల నేతలను చూసి గర్వపడే మనం, 50 ఏళ్ల క్రితం మన దేశపు కోడలిగా వచ్చిన సోనియా గాంధీని మాత్రం ఇంకా పరాయిదానిగానే చూస్తున్నామంటూ రచయిత్రి సుజాత వేల్పూరి పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. భర్తను కోల్పోయాక, ఇటలీకి వెళ్లిపోయే అవకాశం ఉన్నా పిల్లల కోసం, కుటుంబం కోసం ఇక్కడే నిలబడిన సోనియా వ్యక్తిత్వాన్ని ఆమె కొనియాడారు. "నేను మీ మనిషినే" అని చెప్పుకోవడానికి సోనియా 530 పేజీల పుస్తకం రాయాల్సి రావడం బాధాకరమని అభిప్రాయపడ్డారు. ఈ పుస్తకంలోని కొన్ని చాప్టర్లపై ఒత్తిడి వల్ల అమెజాన్ ఆంక్షలు పెట్టిందన్న వార్తల నేపథ్యంలో, అసలు అందులో ఏముందో తెలుసుకోవాలనే ఆసక్తి నెలకొంది.

Advertisement

Sonia Gandhi Autobiography Belonging | త్రినేత్ర న్యూస్ : విదేశాల్లో ఉన్నత పదవులు అధిరోహించిన భారతీయ మూలాల నేతలను చూసి మనం ఎంతో గర్వపడతాం. కానీ, యాభై ఏళ్ల క్రితం మన దేశపు కోడలిగా అడుగుపెట్టిన సోనియా గాంధీని మాత్రం నేటికీ 'ఇటాలియన్'గానే చూస్తూ విమర్శించడం ఎంతవరకు సబబు? సోనియా గాంధీ ఆత్మకథ 'బిలాంగింగ్' (Belonging) పుస్తకం విడుదలైన నేపథ్యంలో.. ప్రముఖ రచయిత్రి సుజాత వేల్పూరి సోషల్ మీడియాలో పెట్టిన ఒక ఎమోషనల్ పోస్ట్ ఇప్పుడు నెట్టింట తీవ్ర చర్చకు దారితీస్తోంది.

ఇక్కడి మూలాలు ఉన్న కమలా హారిస్ అమెరికా ప్రెసిడెంట్ కావాలని కోరుకుంటాం, తమిళ మూలాల షణ్ముగ రత్నం సింగపూర్ ప్రెసిడెంట్ అయితే బోర విరుచుకుని చెప్పుకుంటాం, ఫిజీలో మహేంద్ర చౌదరి రాజైతే, మన వాడు అని మీసం మెలేస్తాం, అమెరికా వైస్ ప్రెసిడెంట్ తెలుగింటి అల్లుడు అని….అబ్బో చెప్పక్కర్లేదు, రచ్చ !! మామూలు రచ్చ కాదు మనది.

కానీ, ఎప్పుడో యాభై ఏళ్ళ క్రితం పెళ్లి చేసుకుని ఇక్కడికి కోడలిగా వచ్చినామెని మాత్రం ఈ రోజుకీ ఇటాలియన్ గానే చూస్తాం! కాల కూట విషాలు కక్కుతాం!
ఒక రాజకీయ కుటుంబంలో మెట్టినందుకు తనకు తాను శిక్ష వేసుకున్నట్టుగా, ప్రేమించి చేసుకున్న భర్తను పోగొట్టుకున్నా, తనకంట్ఘూ ఇక్కడ మరెవరూ లేక పోయినా పిల్లల్ని పెట్టుకుని ఇక్కడే నిలబడి పాతుకు పోయిన సోనియా అంటే స్త్రీగా నాకెంతో గౌరవం.

“ఈ దరిద్రపు రాజకీయాలు మాకొద్దు" అని పిల్లల్ని తీసుకుని ఇటలీ వెళ్ళిపోయే అవకాశం ఉన్నా, గడపలోనే ఆగిపోయిన సోనియా అంటే,నాకెంతో గౌరవం.
ఆమె ప్రధాని అయితే శిరోముండనం చేయించుకుని కటిక నేల మీద నిద్రిస్తానని, భర్త బతికి ఉండగానే విధవ వేషం వేస్తానని శపథం చేసి వీరంగాలు వేసిన సుష్మా స్వరాజ్ ని ఆ క్షణంలో ఎంత అసహ్యించుకున్నానో చెప్పలేను.

ఒక స్త్రీని ప్రధాని కాకుండా ఆపడానికి కూడా ఆమెకి మతాచారమే ఆయుధం అయింది!

పుస్తకం పేరు "బిలాంగింగ్"..

నేనుమీ మనిషినే! నేను ఇక్కడి దాన్నే, ఈ దేశపు కోడలినే...అని ఆమె తన ఆటో బయాగ్రఫీ తో కూడా అదె పదే పదే చెప్పాల్సి వస్తోంది

బుక్ అమెజాన్ లో అనౌన్స్ కాగానే ప్రీ బుక్ చేసుకున్నాను.

530 పేజీల పెద్ద పుస్తకం. త్వరగానే పూర్తి చేస్తాననుకుంటున్మా.

సోనియా తన జీవితం గురించి ఏం మాట్లాడిందో,ఆమె స్వరాన్ని నొక్కడానికి పెద్దల ఒత్తిడి తో అమెజాన్ ఆంక్షలు పెట్టిన చాప్టర్లు ఏంటో.. తెలుసుకోవాలని ఉత్సాహం గా ఉంది.

రచయిత్రి

సుజాత వేల్పూరి

Advertisement
Advertisement