త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Manne Krishank | రాజీవ్ గాంధీ కూడా ఐస్ క్రీమ్ అమ్మారు..

Manne Krishank | ఏఐసీసీ మాజీ అధ్య‌క్షురాలు సోనియా గాంధీ ఆత్మ‌క‌థ బిలాంగింగ్( Belonging ) పుస్త‌కం విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. ఈ పుస్త‌కంలోని కొన్ని అంశాల‌ను బీఆర్ఎస్ లీడ‌ర్ మ‌న్నె క్రిశాంక్( Manne Krishank ) ఉటంకించారు.

S

Telangana | Published On Nov 12, 2026, 4.50 pm IST

Manne Krishank | రాజీవ్ గాంధీ కూడా ఐస్ క్రీమ్ అమ్మారు..
Advertisement

Manne Krishank | త్రినేత్ర న్యూస్ : ఏఐసీసీ మాజీ అధ్య‌క్షురాలు సోనియా గాంధీ ఆత్మ‌క‌థ బిలాంగింగ్( Belonging ) పుస్త‌కం విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. ఈ పుస్త‌కంలోని కొన్ని అంశాల‌ను బీఆర్ఎస్ లీడ‌ర్ మ‌న్నె క్రిశాంక్( Manne Krishank ) ఉటంకించారు. బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌( KTR )ను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్య‌లను కోట్ చేస్తూ ఉద‌హ‌రించారు.

సీఎం రేవంత్ రెడ్డి గారూ.. ప‌లు బ‌హిరంగ స‌భ‌ల్లో మీతో పాటు చాలా మంది కాంగ్రెస్ నేత‌లు క‌నీసం 100 సార్లు కేటీఆర్ అమెరికాలో అంట్లు తోమాడు అని సంబోధించారు. మ‌ళ్లీ ఇలాంటి వ్యాఖ్య‌లు మీరు భ‌విష్య‌త్‌లో చేయ‌ద‌ల‌చుకుంటే.. 1966లో ఇందిరా గాంధీ ప్ర‌ధాన మంత్రిగా ఉన్న‌ప్పుడు.. రాజీవ్ గాంధీ ఇంపిరీయ‌ల్ కాలేజీలో స్టూడెంట్‌గా ఉన్న స‌మ‌యంలో పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేశారు. రాజీవ్ గాంధీ ఐస్ క్రీమ్ అమ్మారు. స్ట్రాబెర్రీలు ఏరిండు. బేక‌రీలోనూ రాజీవ్ గాంధీ ప‌ని చేశార‌ని.. ఇది శ్ర‌మ‌కు ఇవ్వాల్సిన గౌర‌వం రేవంత్ గారూ అని మ‌న్నె క్రిశాంక్ పేర్కొన్నారు. రాజీవ్ గాంధీ పార్ట్‌టైమ్ ఉద్యోగం చేసిండ‌న్న విష‌యాన్ని సోనియా గాంధీ త‌న బిలాంగింగ్ పుస్త‌కంలోని 62వ పేజీలో పొందుప‌రిచార‌ని మ‌న్నె క్రిశాంక్ తెలిపారు.

Advertisement
Advertisement