త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mahesh Bhagwat | హైద‌రాబాద్ సీపీగా మ‌హేశ్ భ‌గ‌వ‌త్‌

Mahesh Bhagwat | రాష్ట్రంలో మ‌రోసారి ఐపీఎస్‌ల బ‌దిలీలు జ‌రిగాయి. తాజాగా 21 మంది ఐపీఎస్‌ల‌ను బ‌దిలీ చేస్తూ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సంజ‌య్ జాజు గురువారం ఉత్త‌ర్వులు జారీ చేశారు.

S

Telangana | Published On Nov 12, 2026, 5.16 pm IST

Mahesh Bhagwat | హైద‌రాబాద్ సీపీగా మ‌హేశ్ భ‌గ‌వ‌త్‌
Advertisement

Mahesh Bhagwat | త్రినేత్ర న్యూస్ : రాష్ట్రంలో మ‌రోసారి ఐపీఎస్‌ల బ‌దిలీలు జ‌రిగాయి. తాజాగా 21 మంది ఐపీఎస్‌ల‌ను బ‌దిలీ చేస్తూ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సంజ‌య్ జాజు గురువారం ఉత్త‌ర్వులు జారీ చేశారు. హైద‌రాబాద్ సీపీగా కొన‌సాగుతున్న వీసీ స‌జ్జ‌నార్‌కు ఫైర్‌, డిజాస్ట‌ర్ రెస్పాన్స్ డీజీగా బ‌దిలీ అయ్యారు. ఎస్పీఎఫ్ డీజీగా స‌జ్జ‌నార్‌కు అద‌న‌పు బాధ్య‌త‌లు అప్ప‌గించారు. ఇక ఆయ‌న స్థానంలో హైద‌రాబాద్ పోలీసు క‌మిష‌న‌ర్‌గా మహేశ్ భ‌గ‌వ‌త్ నియామ‌కం అయ్యారు. ఆర్టీసీ వైస్‌ ఛైర్మన్‌, ఎండీగా అనిల్‌ కుమార్‌, జైళ్లశాఖ డీజీగా స్వాతి లక్రా, ఉమెన్‌ సేఫ్టీ వింగ్‌ డీజీగా సౌమ్య మిశ్రా, పౌరసరఫరాల శాఖ కమిషనర్‌గా నాగిరెడ్డి, ఏసీబీ డీజీగా చారు సిన్హాను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

Advertisement

తాజావార్తలు

Advertisement