త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Massive Fire Accident | ప్లాస్టిక్‌ కుర్చీల తయారీ పరిశ్రమలో అగ్ని ప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం.. ఎలా జ‌రిగిందంటే!

Massive Fire Accident | రంగారెడ్డి జిల్లా నందిగామ (Nandigama) లోని ప్లాస్టిక్‌ కుర్చీల తయారీ పరిశ్రమలో గురువారం భారీ అగ్ని ప్ర‌మాదం (Massive Fire Accident) చోటుచేసుకుంది.

S

Telangana | Published On Nov 12, 2026, 5.24 pm IST

Massive Fire Accident | ప్లాస్టిక్‌ కుర్చీల తయారీ పరిశ్రమలో అగ్ని ప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం.. ఎలా జ‌రిగిందంటే!
Advertisement

Massive Fire Accident | త్రినేత్ర న్యూస్: రంగారెడ్డి జిల్లా నందిగామ (Nandigama) లోని ప్లాస్టిక్‌ కుర్చీల తయారీ పరిశ్రమలో గురువారం భారీ అగ్ని ప్ర‌మాదం (Massive Fire Accident) చోటుచేసుకుంది. దీంతో కుర్చీలు, ఇత‌ర సామ‌గ్రి మంట‌ల్లో పూర్తిగా ద‌గ్ధ‌మ‌య్యాయి. ప‌రిస‌ర ప్రాంతాల్లో ద‌ట్ట‌మైన పొగ క‌మ్ముకోగా స్థానికంగా ఉన్న ప్ర‌జ‌లు తీవ్ర భ‌యాందోళ‌న‌ల‌కు గుర‌య్యారు. ఫ్యాక్టరీ కార్మికులు బయటకు పరుగులు తీశారు. ఇంత‌కీ ప్ర‌మాదం ఎలా జ‌రిగిందంటే!

ప‌రిశ్ర‌మ‌లు వెల్డింగ్ ప‌నులు చేస్తుండ‌గా ప్ర‌మాద‌వ‌శాత్తు మంట‌లు అంటుకున్నాయి. ఒక్క‌సారిగా మంట‌లు చెల‌రేగ‌డంతో పెద్ద మొత్తంలో సామ‌గ్రి ద‌గ్ధ‌మైంది. ఈ ఘ‌ట‌న‌పై సమాచారం అందుకున్న‌ అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన‌ ఘటనా స్థలికి చేరుకుని 5 ఫైరింజన్లతో మంటలార్పేందుకు శ్రమిస్తున్నారు. కొంత‌వ‌ర‌కు మంట‌లు అదుపులోకి వ‌చ్చిన‌ట్లు స‌మాచారం. ఈ ఘటనలో భారీగా ఆస్తి నష్టం వాటిళ్లిందని నిర్వాహకులు ఆవేదన వ్య‌క్తం చేస్తున్నారు. ఇదిలా ఉండ‌గా ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి పూర్తి వివ‌రాలు తెల‌యాల్సి ఉంది.

Advertisement
Advertisement