త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rashmika Mandanna | ర‌ష్మిక మంద‌న్న మైసా పోస్ట్‌పోన్? – కొత్త రిలీజ్ డేట్ ఇదేనా!

ఇటీవ‌ల కాలంలో టాలీవుడ్ స్టార్స్ సినిమాలు వాయిదా ప‌డ‌టం కామ‌న్‌గా మారిపోయింది. ఈ పోస్ట్‌పోన్ లిస్ట్‌లో ర‌ష్మిక మంద‌న్న మైసా కూడా చేరిన‌ట్లు స‌మాచారం. న‌వంబ‌ర్ 27న రిలీజ్ కావాల్సిన ఈ సినిమా వారం వాయిదాప‌డిన‌ట్లు వార్త‌లొస్తున్నాయి.

N

Entertainment | Published On Nov 12, 2026, 5.00 pm IST

Rashmika Mandanna | ర‌ష్మిక మంద‌న్న మైసా పోస్ట్‌పోన్? – కొత్త రిలీజ్ డేట్ ఇదేనా!
Advertisement

Rashmika Mandanna |టాలీవుడ్‌లో వాయిదాల ప‌ర్వం కొన‌సాగుతోంది. చెప్పిన డేట్‌కు స్టార్స్ సినిమాలు రిలీజ్ కావ‌డం లేదు. భారీ బ‌డ్జెట్ సినిమాల పోస్ట్‌పోన్ ప్ర‌భావం చిన్న సినిమాల‌పై ప‌డుతోంది. న‌వంబ‌ర్ 12న విడుద‌ల కావాల్సిన శ‌ర్వానంద్ భోగి సెన్సార్ స‌మ‌స్య‌ల కార‌ణంగా వాయిదాప‌డింది. తాజాగా ఈ పోస్ట్‌పోన్ లిస్ట్‌లో ర‌ష్మిక మంద‌న్న మైసా కూడా చేరిన‌ట్లు స‌మాచారం.

గిరిజ‌న యువ‌తిగా...

కెరీర్‌లో ఫ‌స్ట్ టైమ్ ఔట్ అండ్ ఔట్ యాక్ష‌న్ రోల్‌లో ర‌ష్మిక మంద‌న్న న‌టిస్తోన్న మైసా మూవీకి ర‌వీంద్ర పుల్లే ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఇందులో గిరిజ‌న యువ‌తిగా నేష‌న‌ల్ క్ర‌ష్ న‌టిస్తోంది. త‌న జాతికి జ‌రిగిన అన్యాయంపై పోరాడే మైసా మేస్రం అనే యువ‌తిగా ఛాలెంజింగ్ రోల్‌లో ర‌ష్మిక క‌నిపించ‌బోతుంది.

మార్ష‌ల్ ఆర్ట్స్‌...

మైసా కోసం ర‌ష్మిక మంద‌న్న మార్ష‌ల్ ఆర్ట్స్‌లో ట్రైనింగ్ తీసుకుంది. డూప్ లేకుండా రిస్కీ ఫైట్ సీక్వెన్స్‌ల‌లో న‌టించింది. ఇటీవ‌ల రిలీజ్ చేసిన టీజ‌ర్‌లో నేష‌న‌ల్ క్ర‌ష్‌పై వ‌చ్చిన యాక్ష‌న్ సీన్లు అభిమానుల‌ను ఆక‌ట్టుకున్నాయి. ర‌ష్మిక కెరీర్‌కు ఓ ఛేంజ్ ఓవ‌ర్‌లా ఈ సినిమా ఉండ‌బోతుంద‌ని టాలీవుడ్ వ‌ర్గాలు చెబుతోన్నాయి.

వారం వాయిదా...

మైసా సినిమాను న‌వంబ‌ర్ 27న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురాబోతున్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. అయితే ఈ డేట్‌కు సినిమా రిలీజ్ కావ‌డం అనుమాన‌మేన‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు డిలే కావ‌డంతో వారం పాటు ఈ సినిమా వాయిదాప‌డ‌నున్న‌ట్లు స‌మాచారం. న‌వంబ‌ర్ 27న కాకుండా డిసెంబ‌ర్ 4న ఈ లేడీ ఓరియెంటెడ్ మూవీ రిలీజ‌య్యే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. త్వ‌ర‌లోనే పోస్ట్‌పోన్‌పై అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ రానున్న‌ట్లు తెలిసింది.

జ‌పాన్ వెకేష‌న్‌...

ప్ర‌స్తుతం భ‌ర్త విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో క‌లిసి జ‌పాన్‌కు వెకేష‌న్ వెళ్లింది ర‌ష్మిక మంద‌న్న‌. టూర్ నుంచి తిరిగొచ్చిన త‌ర్వాత మైసా ప్ర‌మోష‌న్స్ మొద‌లుపెట్ట‌బోతున్న‌ట్లు స‌మాచారం. ఇందులో రావు ర‌మేష్‌, స‌ముద్ర‌ఖ‌ని, గురు సోమ‌సుంద‌రం, ఈశ్వ‌రీరావు కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్నారు. జేక్స్ బిజోయ్ మ్యూజిక్ అందిస్తున్నారు.

 

Advertisement
Advertisement