త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rukmini Vasanth | లాఠీ ప‌ట్టిన టాక్సిక్ హీరోయిన్ – ఫ‌స్ట్ టైమ్ పోలీస్ పాత్ర‌లో రుక్మిణి వ‌సంత్‌

వ‌రుస డిజాస్ట‌ర్ల‌తో సంబంధం లేకుండా క‌న్న‌డ బ్యూటీ రుక్మిణి వ‌సంత్ మ‌రో సినిమాకు గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చింది. ఫ‌స్ట్ టైమ్ పోలీస్ పాత్ర‌లో క‌నిపించ‌బోతుంది. రుక్మిణి వ‌సంత్‌, సీనియ‌ర్ హీరోయిన్ మాలాశ్రీ ప్ర‌ధాన పాత్ర‌ల్లో క‌న్న‌డంలో మంగ‌ళ‌గౌరి పేరుతో యాక్ష‌న్ డ్రామా మూవీ తెర‌కెక్కుతోంది. ఈ సినిమా నుంచి ఓ స్పెష‌ల్ పోస్ట‌ర్‌ను మేక‌ర్స్ అభిమానుల‌తో పంచుకున్నారు.

N

Entertainment | Published On Nov 10, 2026, 2.59 pm IST

Rukmini Vasanth | లాఠీ ప‌ట్టిన టాక్సిక్ హీరోయిన్ – ఫ‌స్ట్ టైమ్ పోలీస్ పాత్ర‌లో రుక్మిణి వ‌సంత్‌
Advertisement

Rukmini Vasanth |హీరోయిన్లు యాక్ష‌న్ సినిమాలు చేసే ట్రెండ్ టాలీవుడ్‌లో పెరుగుతోంది. క్రైమ్ కామెడీగా తెర‌కెక్కిన మా ఇంటి బంగారం సినిమాలో రిస్కీ ఫైట్ సీక్వెన్స్‌ల‌తో ఆడియెన్స్‌ను మెప్పించింది స‌మంత‌. ధ‌నుష్ ఓం సినిమాలో సాయిప‌ల్ల‌వి, మైసాలో ర‌ష్మిక మంద‌న్న కూడా యాక్ష‌న్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్నారు. వీరి బాట‌లోనే డ్రాగ‌న్ బ్యూటీ రుక్మిణి వ‌సంత్ కూడా అడుగులు వేయ‌బోతుంది. కెరీర్‌లో ఫ‌స్ట్ టైమ్ లేడీ ఓరియెంటెడ్ యాక్ష‌న్ మూవీకి గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చింది.

మంగ‌ళ‌గౌరి...

ఈ క‌న్నడ మూవీ టైటిల్‌తో పాటు కొత్త పోస్ట‌ర్‌ను సోమ‌వారం మేక‌ర్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమాకు మంగ‌ళ‌గౌరి అనే పేరును ఖ‌రారు చేశారు. ఇందులో పోలీస్ కానిస్టేబుల్ పాత్ర‌లో రుక్మిణి వ‌సంత్ న‌టిస్తోంది.
మంగ‌ళ‌వారం రిలీజ్ చేసిన‌ పోస్ట‌ర్‌లో ఖాకీ డ్రెస్‌తో భుజాల‌పై లాఠీ పెట్టుకొని ప‌వ‌ర్‌ఫుల్ లుక్‌లో రుక్మిణి వ‌సంత్ క‌నిపిస్తోండ‌గా...చేతిలో గ‌రిటెతో మాలాశ్రీ సీరియ‌స్‌గా ఉండ‌టం ఆస‌క్తిని పంచుతోంది. టాక్సిక్, కాకా సినిమాల నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడ‌క్ష‌న్స్‌తో క‌లిసి క‌న్న‌డ డైరెక్ట‌ర్ హేమంత్ రావ్ మంగ‌ళ‌గౌరి సినిమాను నిర్మిస్తోన్నారు. రాహుల్ పీకే ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

ల‌క్నో బ్యాక్‌డ్రాప్‌లో...

ల‌క్నో బ్యాక్‌డ్రాప్‌లో యాక్ష‌న్ డ్రామాగా మంగ‌ళ గౌరి మూవీ తెర‌కెక్కుతోంది. అనుకోకుండా ఎదురైన కొన్ని క్లిష్ట ప‌రిస్థితుల‌ను ఇద్ద‌రు మ‌హిళ‌లు ధైర్యంగా ఎలా ఎదుర్కొన్నార‌నే అంశాల‌తో ఈ మూవీ రూపొందుతోంది. పోలీస్ క్యారెక్ట‌ర్‌లో రుక్మిణి వ‌సంత్ న‌టిస్తోన్న తొలి సినిమా ఇది. మంగ‌ళ‌గౌరి మూవీ షూటింగ్ తుది ద‌శ‌కు చేరుకున్న‌ట్లు స‌మాచారం.

ఆరో ఫ్లాప్‌...

కాగా ఇటీవ‌ల రిలీజైన టాక్సిక్‌తో వ‌రుస‌గా ఆరో ఫ్లాప్ రుక్మిణి వ‌సంత్‌కు ఎదురైంది. ఈ డిజాస్ట‌ర్ల‌తో సంబంధం లేకుండా క‌న్న‌డంతో పాటు తెలుగు, త‌మిళ భాష‌ల్లో క్రేజీ ఆఫ‌ర్ల‌ను అందుకుంటోంది. ప్ర‌స్తుతం తెలుగులో ఎన్టీఆర్‌తో డ్రాగ‌న్ సినిమా చేస్తోంది.

 

Advertisement
Advertisement