Nivetha Thomas | నేషనల్ అవార్డ్ సినిమా చేసినా… ఛాన్స్‌లు నిల్ – ఓటీటీలోకి నివేదా థామస్ ఎంట్రీ
దాదాపు రెండేళ్ల గ్యాప్ తర్వాత నివేదా థామస్ తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. శ్రీమతి పేరుతో ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమా చేసింది. థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలో ఈ మూవీ రిలీజ్ అవుతోంది. డిసెంబర్ 4 నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతుంది.
Nivetha Thomas |నాని హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందిన నిన్నుకోరి సినిమాతో హీరోయిన్‌గా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది నివేదా థామస్. తొలి సినిమాలోనే సహజ నటనతో ఆకట్టుకుంది. నిన్నుకోరి హిట్‌తో నివేదాకు తెలుగులో చక్కటి అవకాశాలు దక్కాయి. పవన్ కళ్యాణ్, రజనీకాంత్, ఎన్టీఆర్ వంటి స్టార్స్‌తో సినిమాలు చేసింది. 118, బ్రోచెవారెవరురా లాంటి మూవీస్‌తో విజయాలను దక్కించుకుంది. నివేదా జోరు , యాక్టింగ్ స్టైల్ చూసి టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా మారడం ఖాయమని అంతా అనుకున్నారు. ముద్దుగుమ్మగా ఉన్న ఈ కోలీవుడ్ బ్యూటీ బరువు పెరిగి బొద్దుగా మారడంతో అవకాశాలు తగ్గాయి.
తల్లి పాత్రలో...
రెండేళ్ల క్రితం రిలీజైన తెలుగు మూవీ 35 చిన్న కథకాదులో తల్లి పాత్రలో కనిపించింది. ఈ సినిమా రెండు నేషనల్ అవార్డులను గెలుచుకుంది. నివేదా నటనకు ప్రశంసలు వచ్చాయి. కానీ ఆఫర్లు మాత్రం రాలేదు. తాజాగా చెన్నై చిన్నది ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వబోతుంది.
లేడీ ఓరియెంటెడ్
శ్రీమతి పేరుతో తెలుగులో లేడీ ఓరియెంటెడ్ సినిమా చేసింది. థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలో ఈ మూవీ రిలీజ్ అవుతోంది. డిసెంబర్ 4 నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతుంది. విడుదల తేదీని వెల్లడించిన మేకర్స్ టీజర్‌ను రిలీజ్ చేశారు.
మధ్య తరగతి గృహిణి...
ఈ టీజర్‌లో మధుశ్రీ అనే మధ్యతరగతి గృహిణి పాత్రలో నివేదా కనిపించింది. కుటుంబ విధేయతకు, ఓ మహిళ ఆత్మగౌరవానికి మధ్య సంఘర్షణతో ఈ సినిమా తెరకెక్కబోతున్నట్లు వెల్లడించారు. పెళ్లి తర్వాత కుటుంబ బాధ్యతల కారణంగా తన కలలకు దూరమైన ఓ గృహిణి తిరిగి వాటిని సాకారం చేసుకోవడానికి సాగించిన జర్నీ , పడిన తపనతో ఈ ఎమోషనల్ డ్రామాగా శ్రీమతి మూవీ తెరకెక్కుతోంది.
హరితేజ....
ఈ ఓటీటీ మూవీలో తిరువీర్, హరితేజ కీలక పాత్రలు పోషించారు. శ్రీమతితో దాదాపు రెండేళ్ల తర్వాత తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది నివేదా థామస్.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Supreme Court | మేనరిక వివాహాలపై చట్టం తెచ్చే అవసరాన్ని పరిశీలించండి.. కేంద్రానికి సుప్రీం నోటీసులు
- ●Stock Markets | ఆల్‌టైమ్ హై దిశగా సెన్సెక్స్, నిఫ్టీ.. భారీ ర్యాలీతో ముగిసిన సూచీలు..
- ●Blood Donation Camp | మత్స్యకార దినోత్సవానికి కాంగ్రెస్ సేవా స్ఫూర్తి!
- ●Nitin Nabin Karimnagar Tour | 23న కరీంనగర్‌కు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్
- ●Ponnam Prabhakar | ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమాతో ఆర్థిక భరోసా: పొన్నం ప్రభాకర్
- ●Lava Smart 4 Pro | రూ.10వేలకే లావా కొత్త స్మార్ట్‌ఫోన్.. భారీ బ్యాటరీ..

Supreme Court | మేనరిక వివాహాలపై చట్టం తెచ్చే అవసరాన్ని పరిశీలించండి.. కేంద్రానికి సుప్రీం నోటీసులు

Stock Markets | ఆల్‌టైమ్ హై దిశగా సెన్సెక్స్, నిఫ్టీ.. భారీ ర్యాలీతో ముగిసిన సూచీలు..

Blood Donation Camp | మత్స్యకార దినోత్సవానికి కాంగ్రెస్ సేవా స్ఫూర్తి!

Nitin Nabin Karimnagar Tour | 23న కరీంనగర్‌కు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్






