Trisha | సూర్యకు షాకిచ్చిన త్రిష – తమిళ మూవీ ప్రమోషన్స్‌కు దూరం – పెళ్లి రూమర్లు కారణమా?
సూర్య, త్రిష హీరోహీరోయిన్లుగా నటించిన కరుప్పు మూవీ మే 14న థియేటర్లలోకి రాబోతుంది. ఈ తమిళ మూవీ ఆడియో లాంఛ్ ఆదివారం జరిగింది. ఈ వేడుకలో త్రిష కనిపించకపోవడం కోలీవుడ్ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
Trisha | కోలీవుడ్ హీరో సూర్యకు చెన్నై క్వీన్ త్రిష పెద్ద షాకిచ్చింది. రిలీజ్ ముగింట కొత్త సినిమా కరుప్పు ప్రమోషన్స్‌కు దూరమైంది. సూర్య, త్రిష హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న ఈ యాక్షన్ మూవీ మే 14న థియేటర్లలోకి రాబోతుంది. ఇరవై ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత వీరిద్దరు జంటగా నటిస్తోన్న ఈ సినిమాకు ఆర్‌జే బాలాజీ దర్శకత్వం వహిస్తున్నాడు.
రిలీజ్ ఆలస్యం...
గత ఏడాది దీపావళికి ఈ సినిమా రిలీజ్ కావాల్సింది. పోస్ట్ ప్రొడక్షన్‌తో పాటు వీఎఫ్ఎక్స్ పనుల పెండింగ్ కారణంగా పోస్ట్‌పోన్ చేశారు. ఆ తర్వాత ఓటీటీ డీల్ ఆలస్యం కావడం, ఇతర కారణాల వల్ల సినిమా రిలీజ్ ఆలస్యమవుతూనే వచ్చింది.
ప్రమోషన్స్‌కు దూరం...
అన్ని అవాంతరాలను దాటుకొని ఎట్టకేలకు మే 14న ఈ మూవీ థియేటర్లలోకి రాబోతుంది. కానీ రిలీజ్ ముంగిట త్రిష రూపంలో కరుప్పుకు కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. ఈ సినిమా ప్రమోషన్స్‌కు చెన్నై క్వీన్ త్రిష దూరంగా ఉండాలని నిర్ణయించుకుందట.
ఆదివారం మధురైలో కరుప్పు మూవీ ఆడియో లాంఛ్ ఈవెంట్ గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకకు త్రిష కూడా అటెండ్ కాబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ ఈవెంట్‌కు సూర్య, డైరెక్టర్ ఆర్‌జే బాలాజీ , సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్‌తో పాటు టీమ్ అందరూ హాజరయ్యారు. కానీ త్రిష మాత్రం కనిపించలేదు. ఈ వేడుకకు తాను రావడం లేదనే విషయం కూడా మేకర్స్‌కు ముందుగా త్రిష ఇన్ఫామ్ చేయలేదట. చెప్పపెట్టకుండా ఈవెంట్‌కు దూరంగా ఉందట. కనీసం వీడియో బైట్ లాంటివి కూడా రిలీజ్ చేయలేదు. త్రిష నిర్ణయంతో సూర్యతో పాటు దర్శకనిర్మాతలు కూడా డిసపాయింట్ అయినట్లు కోలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
త్రిష పేరు ఎత్తని సూర్య...
ఈ ఆడియో లాంఛ్ ఈవెంట్‌లో సినిమాతో పాటు ఇతర నటీనటులు, టెక్నీషియన్ల గురించి మాట్లాడిన సూర్య ...త్రిష పేరును మాత్రం ఎక్కడ ప్రస్తావించలేదు. డైరెక్టర్ మినహా మిగిలిన యాక్టర్లు, టెక్నీషియన్లు కూడా త్రిష గురించి ముక్తసరిగానే మాట్లాడటం ఆసక్తికరంగా మారింది. ప్రమోషన్స్ విషయంలో కరుప్పు మేకర్స్, త్రిషకు మధ్య సైలెంట్ వార్ నడుస్తోన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కనీసం ఒకటి రెండు ఈవెంట్స్ అయినా అటెండ్ కావాలని త్రిషను కోరుతున్నారట. కానీ చెన్నై క్వీన్ మాత్రం ససేమిరా అంటున్నట్లు సమాచారం.
వ్యక్తిగత జీవితం హైలైట్....
దళపతి విజయ్‌తో ప్రేమాయణం, పెళ్లి రూమర్ల కారణంగానే కరుప్పు మూవీ ప్రమోషన్స్‌కు దూరంగా ఉండాలని త్రిష నిర్ణయించుకుందని సన్నిహితులు అంటున్నారు. ఎక్కడికి వెళ్లిన వ్యక్తిగత జీవితాన్నే హైలైట్ చేస్తుండటంతో కొన్నాళ్లు మీడియాను అవైడ్ చేయాలని అనుకుంటుందట. కరుప్పు మాత్రమే కాకుండా చిరంజీవి విశ్వంభర ప్రమోషన్స్‌కు కూడా త్రిష అటెండ్ కావడం అనుమానమేనని అంటున్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Kaviya Maran | కోలీవుడ్ రాక్‌స్టార్‌తో ఏడడుగులు వేయబోతున్న కావ్య పాప – పెళ్లి ఎప్పుడు..ఎక్కడంటే?
మే 21, 2026

Meenakshi Chaudhary | సంక్రాంతి హీరోయిన్గా మీనాక్షి చౌదరి..! కార్తితో మ్యాజిక్ రిపీట్ చేసేనా..?
మే 20, 2026

Jayam Ravi | నెలకు నలభై లక్షలు ఇవ్వాల్సిందే – జయం రవి నుంచి భరణం కోరిన భార్య – తెరపైకి అగ్ర హీరో పేరు…
మే 19, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



