త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Samantha | కోలీవుడ్ బ్లాక్‌బ‌స్ట‌ర్ సీక్వెల్‌లో స‌మంత – క‌మ్‌బ్యాక్ అప్పుడేనా?

ఇటీవ‌లే త‌ల్లిగా మారింది స‌మంత‌. పండింటి మ‌గ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. మాతృత్వ‌పు బంధం కార‌ణంగా సినిమాల‌కు దూరంగా ఉంటోంది . కోలీవుడ్ బ్లాక్‌బ‌స్ట‌ర్ సీక్వెల్‌తో తిరిగి స‌మంత కెమెరా ముందుకు రాబోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఆ సినిమా ఏది...హీరో ఎవ‌రంటే?

N

Entertainment | Published On Nov 28, 2026, 2.15 pm IST

Samantha | కోలీవుడ్ బ్లాక్‌బ‌స్ట‌ర్ సీక్వెల్‌లో స‌మంత – క‌మ్‌బ్యాక్ అప్పుడేనా?
Advertisement

Samantha |  ఇటీవ‌లే మాతృత్వ బంధంలోకి అడుగుపెట్టింది స‌మంత‌. పండంటి మ‌గ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. త‌న‌యుడికి దేవ్ నిడిమోరు అని పేరు పెట్టిన‌ట్లు స‌మంత ప్ర‌క‌టించింది. త‌ల్లిగా మార‌డంతో సినిమాల‌కు నాలుగైదు నెల‌లు పాటు దూరంగా ఉండాల‌ని ఈ హీరోయిన్ నిర్ణ‌యించుకున్న‌ట్లు స‌మాచారం. వ‌చ్చే ఏడాది వేస‌వి త‌ర్వాత తిరిగి స‌మంత కెమెరా ముందుకు రాబోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

సీక్వెల్‌తో...

స‌మంత రీఎంట్రీ మూవీ ఏద‌న్న‌ది అభిమానుల్లో ఆస‌క్తిక‌రంగా మారింది. ఓ త‌మిళ సినిమాతో క‌మ్‌బ్యాక్ ఇవ్వ‌నున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. అది కూడా సీక్వెల్‌తోన‌ని అంటున్నారు. త‌మిళంలో విశాల్ హీరోగా పీఎస్ మిత్ర‌న్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఇరుంబుతిరై బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా నిలిచింది. విశాల్ కెరీర్‌లో హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది.

సైకాల‌జిస్ట్‌...

ఈ సినిమాకు సీక్వెల్‌ను తెర‌కెక్కించేందుకు విశాల్‌తో పాటు డైరెక్ట‌ర్ పీఎస్ మిత్ర‌న్ స‌న్నాహాలు చేస్తోన్నారు. పార్ట్ వ‌న్‌లో హీరోయిన్‌గా స‌మంత న‌టించింది. సీక్వెల్‌లోనూ ఆమె పాత్ర‌ను కంటిన్యూ చేయాల‌ని డైరెక్ట‌ర్ నిర్ణ‌యించుకున్న‌ట్లు స‌మాచారం. ఇరుంబుతిరైలో సైకాల‌జిస్ట్‌గా క‌నిపించిన స‌మంత సీక్వెల్‌లో మాత్రం యాక్ష‌న్ రోల్ చేయ‌బోతుంద‌ని అంటున్నారు. స‌మంత పాత్ర‌లో వ‌చ్చే ట్విస్ట్‌లు స‌ర్‌ప్రైజింగ్‌గా ఉండ‌బోతున్న‌ట్లు టాక్ వినిపిస్తోంది. స‌మంత పున‌రాగ‌మ‌నం ఎప్పుడ‌ద‌న్న‌దానిని అనుస‌రించి షూటింగ్ మొద‌లుపెట్టాలేని మేక‌ర్స్ భావిస్తోన్న‌ట్లు వార్త‌లొస్తున్నాయి.

త‌మిళ హీరో....

ఇరుంబుతిరై 2లో త‌మిళ హీరో ఆర్య విల‌న్‌గా క‌నిపించ‌బోతున్నాడు. ఆర్టిఫీషియ‌ల్ ఇంటెలిజెన్స్ దుర్వినియోగం, మోసాల‌తో ఈ సీక్వెల్ తెర‌కెక్క‌బోతున్న‌ట్లు స‌మాచారం. త‌మిళం, తెలుగు భాష‌ల్లో బైలింగ్వ‌ల్‌గా తెర‌కెక్కించ‌బోతున్న‌ట్లు తెలిసింది.

 

Advertisement
Advertisement