త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bandi Sanjay | ఇప్పుడున్న‌ది ఇటలీ నేష‌న‌ల్ కాంగ్రెస్‌.. మేమే అస‌లైన గాంధీ వార‌సులం

Bandi Sanjay | గాంధీ భావ‌జాలం కాంగ్రెస్ పార్టీలో క‌నిపించ‌ద‌ని.. అది ఇట‌లీ నేష‌న‌ల్ కాంగ్రెస్ పార్టీ అని కేంద్ర మంత్రి బండి సంజ‌య్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తామే గాంధీ అస‌లైన వార‌సులమ‌ని వ్యాఖ్యానించారు.

S

Telangana | Published On Oct 2, 2026, 2.29 pm IST

Bandi Sanjay | ఇప్పుడున్న‌ది ఇటలీ నేష‌న‌ల్ కాంగ్రెస్‌.. మేమే అస‌లైన గాంధీ వార‌సులం
Advertisement
  • జైశ్రీ‌రామ్ నినాదంతోటి తెలంగాణలో రామ‌రాజ్యాన్ని స్థాపిస్తం
  • గాంధీ బ‌తికున్నంత కాలం హిందువున‌నే చెప్పుకున్న‌రు
  • ఖైర‌తాబాద్‌ల 100 శాతం మేమే గెలుస్తం
  • జమ్మికుంట‌లో మీడియాతో కేంద్ర మంత్రి బండి సంజ‌య్ వ్యాఖ్య‌లు

Bandi Sanjay | త్రినేత్ర న్యూస్: గాంధీ భావ‌జాలం కాంగ్రెస్ పార్టీలో క‌నిపించ‌ద‌ని.. అది ఇట‌లీ నేష‌న‌ల్ కాంగ్రెస్ పార్టీ అని కేంద్ర మంత్రి బండి సంజ‌య్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తామే గాంధీ అస‌లైన వార‌సులమ‌ని వ్యాఖ్యానించారు. గాంధీ బ‌తికున్నంత కాలం హిందువున‌ని చెప్పుకున్నార‌ని.. అదే స్ఫూర్తితో జైశ్రీ‌రామ్ నినాదంతో తెలంగాణ‌లో రామ‌రాజ్యాన్ని స్థాపిస్తామ‌న్నారు. ఖైర‌తాబాద్‌లో 100 శాతం బీజేపీ గెలుస్తంద‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు. శుక్ర‌వారం గాంధీ జ‌యంతి సంద‌ర్భంగా జమ్మికుంట‌లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌పై విమ‌ర్శ‌లు చేశారు.

మ‌హాత్మాగాంధీ చ‌రిత్ర‌ను దేశం ఎప్పుడూ మ‌ర‌వ‌రు. ఆయ‌న బ‌తికున్నంత కాలం నేను హిందువును అని చెప్పుకున్న‌డు. చ‌నిపోయే చివ‌రి క్ష‌ణం వ‌ర‌కు కూడా హే రామ్‌, శ్రీ‌రామ్‌, జై శ్రీ‌రామ్ అని ఆయ‌న ప‌లికేవారు. హిందువులంద‌రు కూడా రామ రాజ్యం రావాలని గ‌తంలో అనుకునేవాళ్లం. రాజు, పేద తేడా లేకుండా పాల‌న అందాలే.. చిట్ట‌చివ‌రి వ్య‌క్తికి కూడా సంక్షేమ ఫ‌లాలు అందాలే అని చెప్పిండు.

డూబ్లికేట్ గాంధీ కుటుంబం దాపురించింది

ఆయ‌న పేరును రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం వాడుకుంటున్న‌రు. డూబ్లికేట్ గాంధీ కుటుంబం ఈ దేశంలో దాపురించింది. గాంధీజీ భావ‌జాలం కాంగ్రెస్ పార్టీలో క‌నిపించ‌దు. అది ఇటలీ నేష‌న‌ల్ కాంగ్రెస్‌. గాంధీజీ మొద‌టినుంచి వార‌సత్వ రాజ‌కీయాల‌కు వ్య‌తిరేకం. కాంగ్రెస్ పార్టీ గాంధీ ఆశ‌యాల‌కు విరుద్ధం. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ.. వాళ్ల పిల్ల‌ల‌కు కూడా గాంధీ త‌గిలించుకుని వార‌స‌త్వ రాజ‌కీయాల‌ను వాడుకుంటరు. నిజ‌మైన‌ గాంధీ కుటుంబం ఈరోజు దేశ రాజ‌కీయాల్లో ఉందా? గాంధీ ఆశ‌యాల‌ను తూచా త‌ప్ప‌కుండా పాటిస్తున్న‌ది మోదీ ప్ర‌భుత్వం.

దేవుళ్ల పేరుతో రాష్ట్రాన్ని చీల్చుతున్న‌రు..

డ‌బ్బున్నోళ్లు రామున్ని కొలుస్త‌ర‌ని రేవంత్ అంటుండు. గాంధీ ఒంటి మీద నూలు పోగు కూడా లేదు. నిజ‌మైన గాంధీ వార‌సులం మేం. అవినీతి మ‌చ్చ లేకుండా మోదీ పాలిస్తున్న‌రు. మ‌నుషుల్లో ద్వేషం ఉండొద్దు. స్వ‌చ్ఛంగా ఉండాలి. రాబోయే రోజుల్లో జైశ్రీ‌రామ్ నినాదంతోటి తెలంగాణలో రామ‌రాజ్యాన్ని స్థాపిస్తం. రాముని వ్య‌తిరేకులు ఇవాళ నాలుగు రాష్ట్రాల‌కు ప‌రిమిత‌మైండ్రు. రాముడికి, రాజ్యాంగానికి, దేశానికి కాంగ్రెస్‌వాళ్లు వ్య‌తిరేకం. ఈరోజు వ్యవ‌సాయానికి నీళ్లు లేవు. ఇచ్చిన ఆరు గ్యారంటీల అడ్ర‌స్ లేదు. హిందూ దేవుళ్ల పేరుతో రేవంత్‌రెడ్డి రాష్ట్రాన్ని చీల్చే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఆరు గ్యారంటీల మీద ప్ర‌జ‌ల దృష్టిని మ‌ళ్లించ‌డానికే రేవంత్ నాట‌కాలు ఆడుతున్నారు.

కేసీఆర్ అయితే బ‌య‌టికి రాడు. గాంధీ జ‌యంతికి.. దేనికి కూడా బ‌య‌టికి రాడు. ఎన్నిక‌ల ముందు బ‌య‌టికి వ‌స్త‌డు. శాస‌న‌మండ‌లి ఎన్నిక‌ల‌ప్పుడు పీవీ జ‌యంతి, వ‌ర్ధంతి కార్య‌క్ర‌మాల‌కు వ‌స్త‌డు. ఇటువంటి వ్య‌క్తులు స‌మాజానికి ఏం సందేశం ఇస్త‌రో ఆలోచించాలి. ప్ర‌జ‌లు మార్పు కోరుకోవాలి. ఈరోజు ప్ర‌జ‌లు చాలా ఇబ్బందులు ప‌డుతున్నారు. కేసీఆర్‌ 10 సంవ‌త్స‌రాలు టైంపాస్ చేసిండు. కాంగ్రెస్ పార్టీకి సేమ్ వైఖ‌రి ఉంది.

బీఆర్ఎస్‌, కాంగ్రెస్ ఒక్క‌టైనా మేమే గెలుస్తం

మొన్న కాంగ్రెస్ పార్టీ నాయ‌కుడొచ్చి మేం గ్యారంటీ గెలుస్తం అన్న‌డు. ఖైర‌తాబాద్‌ల 32 వేల ఓట్లు ఉన్న‌య‌ట‌. మ‌రి హిందువుల‌వి 2 ల‌క్ష‌ల ఓట్లు ఉన్న‌య్.. వాళ్లు పిచ్చోళ్లా? ఇవాళ ఖైర‌తాబాద్ ఉప ఎన్నిక‌కు కార‌ణ‌మైన కాంగ్రెస్ పార్టీని ప్ర‌జ‌లు బొంద పెడుత‌రు. బీఆర్ఎస్ పార్టీ అడ్ర‌స్ గ‌ల్లంతైత‌ది. ఇక్క‌డ మాకు ప‌ట్టుంది. ఆ రెండు పార్టీలు ఒక్క‌టైనా గెలిసేది బీజేపీయే.

Advertisement
Advertisement