Direct-to-Mobile | ఇక ఇంటర్నెట్ లేకున్నా ఫోన్‌లో నేరుగా లైవ్ టీవీ.. కేంద్రం సన్నాహాలు..?
Direct-to-Mobile | స్మార్ట్‌ఫోన్లలో లైవ్ టీవీ చానల్స్‌ను వీక్షించాలంటే తప్పనిసరిగా మొబైల్ డేటా లేదా వైఫై ఉండాల్సిందే. అయితే ఇకపై వీటి అవసరం లేకున్నా నేరుగా ఫోన్‌లోనే లైవ్ టీవీ చానల్స్‌ను వీక్షించే సదుపాయాన్ని అందుబాటులోకి తేనున్నారు. దీన్ని డీ2ఎం (డైరెక్ట్ టు మొబైల్) సాంకేతికతగా చెబుతున్నారు.
Technology | Published On Oct 2, 2026, 2.52 pm IST
Direct-to-Mobile | స్మార్ట్‌ఫోన్లలో లైవ్ టీవీ చానల్స్‌ను వీక్షించాలంటే తప్పనిసరిగా మొబైల్ డేటా లేదా వైఫై ఉండాల్సిందే. అయితే ఇకపై వీటి అవసరం లేకున్నా నేరుగా ఫోన్‌లోనే లైవ్ టీవీ చానల్స్‌ను వీక్షించే సదుపాయాన్ని అందుబాటులోకి తేనున్నారు. దీన్ని డీ2ఎం (డైరెక్ట్ టు మొబైల్) సాంకేతికతగా చెబుతున్నారు. ప్రభుత్వ ప్రసార సంస్థ ప్రసార భారతి ఈ సేవలను వాణిజ్య స్థాయిలో అందుబాటులోకి తెచ్చేందుకు గాను రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ఃను జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఈ మేరకు పలు మీడియా సంస్థలు కథనాలను ప్రచురించాయి. ఇండియా టుడేలో ప్రచురించిన కథనం ప్రకారం ఇకపై ఫోన్లలో లైవ్ టీవీ చానల్స్‌ను వీక్షించేందుకు గాను ఇంటర్నెట్ అవసరం లేదు. డైరెక్ట్ టు మొబైల్ అనే సాంకేతికత ద్వారా టీవీ చానల్స్‌ను వీక్షించవచ్చు. దీనిపై ప్రస్తుతం కేంద్రం కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది.
సెల్యులార్ కనెక్షన్ లేకున్నా లైవ్ టీవీ..
ప్రసార భారతి వచ్చే నెలలో రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్‌ను జారీ చేసే అవకాశం ఉంది. దీంతో డీ2ఎం సాంకేతికతను ప్రయోగాత్మక దశ నుంచి విస్తృత స్థాయి అమలుకు తీసుకెళ్లే ప్రక్రియలో మరో కీలక అడుగు పడనుంది. అయితే దీనికి సంబంధించిన కచ్చితమైన కాలపట్టిక ఇంకా స్పష్టంగా లేదు. టెజాస్ నెట్‌వర్క్స్ అభివృద్ధి చేసిన డివైస్‌లతో నిర్వహించిన సాంకేతిక ధ్రువీకరణ పరీక్షలకు ప్రభుత్వం ఆమోదం తెలపాల్సి ఉంది. ఆ తరువాతే ఈ ప్రాజెక్టు వేగం పుంజుకోనుంది. డీ2ఎం ప్రసార సాంకేతికత ద్వారా మొబైల్ ఫోన్‌లో సెల్యులార్ కనెక్షన్ అవసరం లేకుండానే లైవ్ టీవీ, ఆడియో, వార్తా సమాచారం, అత్యవసర హెచ్చరికలు వంటి కంటెంట్‌ను నేరుగా యాక్సెస్ చేయవచ్చు.
డీ2ఎం అంటే..
డైరెక్ట్ టు మొబైల్ సాంకేతికత వినియోగదారుల కాల్స్ లేదా ఇంటర్నెట్ కోసం వాడే సెల్యులార్ నెట్‌వర్క్‌పై ఆధారపడదు. స్మార్ట్ ఫోన్‌లో ఎఫ్ఎం రేడియో పనిచేసే విధానానికి ఇది కొంత వరకు సమానంగా ఉంటుంది. ఇందులో ప్రత్యేకమైన రేడియో ఫ్రీక్వెన్సీలను మొబైల్‌లోని రిసీవర్ స్వీకరిస్తుంది. ప్రస్తుతం ఈ సాంకేతికతను పౌరులకు అత్యవసర హెచ్చరికలు పంపేందుకు ఉపయోగించే అవకాశాలు ఉన్నాయి. అయితే వాణిజ్య స్థాయిలో ఆ తరువాత సేవలను ప్రారంభించనున్నారు. వాణిజ్య స్థాయిలో అందుబాటులోకి వస్తే పౌరులకు లైవ్ క్రీడలు, వార్తలు, ఇతర కంటెంట్‌ను యాక్సెస్ చేసేందుకు చాన్స్ ఉంటుంది. ఇంటర్నెట్ కనెక్టివిటీ తక్కువగా లేదా అసలు లేని ప్రాంతాల్లో డీ2ఎం సేవలు ఎంతో ఉపయోగపడనున్నాయి.

టెలికాం కంపెనీల విముఖత..
డీ2ఎం మొబైల్ నెట్‌వర్క్‌పై ఆధారపడదు కనుక వినియోగదారుల డేటా ప్లాన్ నుంచి డేటా ఖర్చు ఉండదు. అలాగే సెల్యులార్ నెట్‌వర్క్ లేకపోయినా ప్రభావం ఉండదు. మొబైల్ డేటా నెట్‌వర్క్‌లపై పడే భారం తగ్గుతుంది. అయితే డీ2ఎం వల్ల తమ వ్యాపారంపై పెద్ద ఎత్తున ప్రభావం పడుతుందని టెలికాం సంస్థలు కేంద్రానికి చెప్పినట్లు సమాచారం. దీనిపై స్పష్టత రావల్సి ఉంది. ప్రస్తుతం ప్రైవేటు టెలికాం కంపెనీలు డేటాతోపాటు కొన్ని బండిల్డ్ ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ ప్లాన్లలో లైవ్ టీవీ, ఓటీటీ ప్లాన్లను మిళితం చేసి అందిస్తున్నాయి. ఓటీటీలను మినహాయిస్తే కొత్తగా వచ్చే డీ2ఎం సాంకేతికతతో లైవ్ టీవీ చానల్స్ వీక్షణపై ప్రభావం పడుతుంది. దీంతో ఆ విభాగంలో టెలికాం కంపెనీలు ఆదాయాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది. అయితే దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ప్రయోగాల్లో సత్ఫలితాలు..
మొబైల్ ఫోన్లలో డీ2ఎం సేవలను అందించేందుకు గాను ప్రసార భారతి ఆధ్వర్యంలో ఇప్పటికే ఐఐటీ కాన్పూర్ నిర్వహణలో అధ్యయనం చేపట్టారు. దీని ప్రకారం 470 లేదా 582 వరకు మెగాహెడ్జ్ బ్యాండ్‌లలో డీ2ఎం ప్రసారాలను అందించడం వల్ల సెల్యులార్ నెట్‌వర్క్‌లకు అంతరాయం కలగదని తేలింది. అలాగే స్మార్ట్‌ఫోన్లు అతిగా వేడికి గురికావడం కూడా ఉండదని వెల్లడైంది. అందువల్ల కేంద్రం ఈ సదుపాయాన్ని అందించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. కాగా ప్రసార భారతి, ఐఐటీ కాన్పూర్, సాంక్య ల్యాబ్స్ కలిసి ఈ సాంకేతికతపై ఇప్పటికే 19 నగరాల్లో ప్రయోగాలను ప్రారంభించాయి. అవి సత్ఫలితాలను అందించాయి. దీంతో దేశ వ్యాప్తంగా ప్రజలకు డీ2ఎం సేవలను అందించేందుకు కేంద్రం ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలిసింది. ఈ వ్యవస్థను ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో ఏర్పాటు చేసి నిర్వహిస్తారని సమాచారం. అయితే ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఫోన్లలో డీ2ఎం సిగ్నల్స్‌ను పొందేందుకు అవసరమైన హార్డ్‌వేర్, సాంకేతికత లేదు. అందువల్ల కొన్ని లక్షల కోట్ల సంఖ్యలో డివైస్‌లను మార్చాల్సి ఉంటుంది. మరలాంటప్పుడు ఈ ప్రాజెక్టును ఎలా ముందుకు తీసుకెళ్తారన్నది కూడా సందేహంగా మారింది. ప్రజలు మళ్లీ కొత్త ఫోన్లను కొనుగోలు చేయాలా, ఇప్పటికే ఉన్న ఫోన్ల పరిస్థితి ఏమిటన్నది ప్రశ్నలను లేవనెత్తుతోంది. అయితే త్వరలో ఈ అన్ని విషయాలపై స్పష్టత రానుంది.
తాజావార్తలు
- ●Nushrratt Bharuccha | విహారయాత్రలో విషాదం - తీవ్రంగా గాయపడిన ఛత్రపతి హీరోయిన్
- ●Bandi Sanjay | ఇప్పుడున్నది ఇటలీ నేషనల్ కాంగ్రెస్.. మేమే అసలైన గాంధీ వారసులం
- ●Prakash Raj | గణపతి నిమజ్జనం పూర్తైంది.. ఇక జ్ఞానేశ్ వంతు.. ప్రకాష్ రాజ్ వివాదాస్పద వ్యాఖ్యలు
- ●Shruti Haasan | కమల్ తనయ కొత్త ప్రయోగం - మెగాఫోన్ పట్టబోతున్న శృతి హాసన్
- ●Jantar Mantar | సీఈసీకి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టిన ఆప్ లీడర్లు అరెస్ట్.. జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తత
- ●Arattai Business | వాట్సాప్‌కు జోహో మరో సవాల్.. అరట్టై బిజినెస్ లైవ్..

Nushrratt Bharuccha | విహారయాత్రలో విషాదం - తీవ్రంగా గాయపడిన ఛత్రపతి హీరోయిన్

Bandi Sanjay | ఇప్పుడున్నది ఇటలీ నేషనల్ కాంగ్రెస్.. మేమే అసలైన గాంధీ వారసులం

Prakash Raj | గణపతి నిమజ్జనం పూర్తైంది.. ఇక జ్ఞానేశ్ వంతు.. ప్రకాష్ రాజ్ వివాదాస్పద వ్యాఖ్యలు

Shruti Haasan | కమల్ తనయ కొత్త ప్రయోగం - మెగాఫోన్ పట్టబోతున్న శృతి హాసన్





