Shruti Haasan | కమల్ తనయ కొత్త ప్రయోగం – మెగాఫోన్ పట్టబోతున్న శృతి హాసన్
కమల్ హాసన్ తనయ శృతి హాసన్ కొత్త అవతారం ఎత్తబోతుంది. త్వరలోనే డైరెక్టర్‌గా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు కోలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. లేడీ ఓరియెంటెడ్ థ్రిల్లర్‌గా శృతి హాసన్ డైరెక్షనల్ డెబ్యూ మూవీ రూపొందనున్నట్లు సమాచారం.
Entertainment | Published On Oct 2, 2026, 1.53 pm IST
Shruti Haasan | డైరెక్టర్లుగా మారి హిట్టు కొట్టిన హీరోలు దక్షిణాది ఇండస్ట్రీలో చాలా మందే కనిపిస్తారు. కానీ హీరోయిన్లు మెగాఫోన్ పట్టడం చాలా అరుదు. విజయ్ నిర్మల, సుహాసిని మణిరత్నంతో పాటు మరికొందరు హీరోయిన్లు దర్శకులుగా సినిమాలు చేశారు. కొన్ని విజయాలను అందుకున్నారు. నేటితరం నాయికలు ఎక్కువగా కెమెరా ముందు కనిపించడానికి ఇష్టపడుతున్నారు. తెర వెనుక సంగతులు పట్టించుకోవడం తక్కువే. తాజాగా కమల్ తనయ శృతి హాసన్ త్వరలోనే మెగాఫోన్ పట్టబోతున్నట్లు ప్రచారం. లేడీ ఓరియెంటెడ్ థ్రిల్లర్ మూవీని తెరకెక్కించబోతున్నట్లు వార్తలొస్తున్నాయి.
సలార్ తర్వాత...
యంగ్ హీరోయిన్ల దూకుడుతో శృతి హాసన్‌కు అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. 2023లో రిలీజైన ప్రభాస్ సలార్ తర్వాత హీరోయిన్‌గా ఒక్క సినిమా కూడా చేయలేదు. రామ్‌చరణ్ పెద్దిలో స్పెషల్ సాంగ్‌లో కనిపించింది. యాక్టింగ్ కెరీర్‌పై ఆశలు వదులుకున్న ఈ బ్యూటీ త్వరలోనే కొత్త ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టబోతున్నట్లు సమాచారం. డైరెక్టర్‌గా మారనున్నట్లు కోలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
థ్రిల్లర్ కథతో...
గత ఏడాది కాలంగా థ్రిల్లర్ కథతో శృతి హాసన్ ఓ స్క్రిప్ట్‌ను సిద్ధం చేస్తోన్నట్లు తెలిసింది. లేడీ ఓరియెంటెడ్ జానర్‌లో వెరైటీ కాన్సెప్ట్‌తో రూపొందుతోన్న ఈ సినిమాకు శృతి హాసన్ స్వయంగా దర్శకత్వం వహించబోతున్నట్లు సమాచారం. ఇందులో హీరోయిన్‌గా కోలీవుడ్ టాప్ స్టార్ నటించనున్నట్లు చెబుతోన్నారు. కేవలం డైరెక్షన్‌పై మాత్రమే ఫోకస్ పెట్టాలని ఈ సినిమాలో నటించకూడదని శృతి హాసన్ నిర్ణయించుకున్నట్లు చెబుతోన్నారు. లిమిటెడ్ బడ్జెట్‌లో ప్రయోగాత్మకంగా రూపొందుతోన్న ఈ సినిమాకు డైరెక్టర్‌గానే కాకుండా మ్యూజిక్ కూడా కమల్ తనయ అందించబోతున్నట్లు సమాచారం. కూతురు సినిమాకు తండ్రి కమల్‌హాసన్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించనున్నట్లు వార్తలొస్తున్నాయి.
ఆకాశంలో ఒక తార...
ప్రస్తుతం తెలుగులో దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తోన్న ఆకాశంలో ఒక తార సినిమాలో శృతి హాసన్ ఓ ప్రత్యేక పాత్రలో కనిపించబోతుంది. నవంబర్ 20న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Bandi Sanjay | ఇప్పుడున్నది ఇటలీ నేషనల్ కాంగ్రెస్.. మేమే అసలైన గాంధీ వారసులం
- ●Prakash Raj | గణపతి నిమజ్జనం పూర్తైంది.. ఇక జ్ఞానేశ్ వంతు.. ప్రకాష్ రాజ్ వివాదాస్పద వ్యాఖ్యలు
- ●Jantar Mantar | సీఈసీకి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టిన ఆప్ లీడర్లు అరెస్ట్.. జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తత
- ●Arattai Business | వాట్సాప్‌కు జోహో మరో సవాల్.. అరట్టై బిజినెస్ లైవ్..
- ●Governor, CM Revanth | మహాత్ముడికి గవర్నర్, ముఖ్యమంత్రి నివాళులు
- ●Ramchandar Rao | మీ ఆరోపణలు పక్కనబెట్టి.. ప్రజలు ఏం సంపాదించుకున్నరో చెప్తే బాగుంటది

Bandi Sanjay | ఇప్పుడున్నది ఇటలీ నేషనల్ కాంగ్రెస్.. మేమే అసలైన గాంధీ వారసులం

Prakash Raj | గణపతి నిమజ్జనం పూర్తైంది.. ఇక జ్ఞానేశ్ వంతు.. ప్రకాష్ రాజ్ వివాదాస్పద వ్యాఖ్యలు

Jantar Mantar | సీఈసీకి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టిన ఆప్ లీడర్లు అరెస్ట్.. జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తత

Arattai Business | వాట్సాప్‌కు జోహో మరో సవాల్.. అరట్టై బిజినెస్ లైవ్..






