Nushrratt Bharuccha | విహారయాత్రలో విషాదం – తీవ్రంగా గాయపడిన ఛత్రపతి హీరోయిన్
బాలీవుడ్ హీరోయిన్ నుష్రత్ బరుచా ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది. బాలీవుడ్‌లో నాలుగు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న నుష్రత్ ఇటీవలే వెకేషన్ కోసం బాలి వెళ్లింది. అక్కడ జరిగిన ప్రమాదంలో ఆమె వెన్నుముక ఫ్రాక్చర్ అయినట్లు సమాచారం.
Entertainment | Published On Oct 2, 2026, 2.41 pm IST
Nushrratt Bharuccha | విహారయాత్ర కోసం విదేశాలకు వెళ్లిన బాలీవుడ్ హీరోయిన్ నుష్రత్ బరుచా ఓ ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది. ఆమె వెన్నుముక ఫ్రాక్చర్ అయినట్లు సమాచారం. ప్రస్తుతం బాలీవుడ్‌లో ఓ నాలుగు సినిమాలు చేస్తోంది నుష్రత్. ఈ బిజీ షెడ్యూల్స్‌కు బ్రేక్ ఇచ్చిన ఈ బ్యూటీ ఇటీవలే వెకేషన్ కోసం ఇండోనేషియాలోని బాలి వెళ్లింది. అక్కడ జరిగిన ఓ ప్రమాదంలో నుష్రత్‌కు తీవ్రగాయాలయ్యాయి. వెన్నుముక ఫ్రాక్చర్ అయినట్లు ఆమె టీమ్ ప్రకటించింది. మరికొన్ని చోట్ల ఆమెకు గాయాలైనట్లు సమాచారం. ప్రస్తుతం బాలిలోనే ఓ హాస్పిటల్‌లో ఆమెకు ట్రీట్‌మెంట్ జరుగుతోంది.
సర్జరీ...
వెన్నుముకకు సర్జరీ అవసరమని వైద్యులు చెప్పినట్లు సమాచారం. డాక్టర్ల సూచన మేరకు నుష్రత్ ను బాలి నుంచి ఎయిర్ అంబులెన్స్‌లో ముంబైకి తీసుకొచ్చేందుకు ఆమె టీమ్ ప్రయత్నాల్లో ఉన్నారు. అయితే ఈ ప్రమాదం ఎలా జరిగింది? షూటింగ్‌లో గాయపడిందా? లేదంటే వెకేషన్‌లోనే ఆమెకు దెబ్బలు తగిలాయా? అన్నది ఆసక్తికరంగా మారింది.
షూటింగ్‌లకు దూరం...
ఈ బాలీవుడ్ హీరోయిన్ గాయంపై ఆమె టీమ్ క్లారిటీ ఇచ్చింది. "నుష్రత్ ఆరోగ్యమే మాకు ముఖ్యం. అవసరమైన వైద్య సహాయం అందేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. గాయం తీవ్రత ఎక్కువ ఉండటం.. సర్జరీ కారణంగా నుష్రత్‌కు కొద్ది రోజులు విశ్రాంతి అవసరమవుతుంది. ఈ ప్రమాదం కారణంగా కొద్ది వారాలు ఆమె సినిమాలకు దూరంగా ఉండబోతుంది" అంటూ ప్రకటించారు.
తెలుగులో...
బాలీవుడ్‌లో లవ్ సెక్స్ ఔర్ దోఖా, ప్యార్ కా పంచ్‌నామా, సోను కే టీటూ కీ స్వీటీ, డ్రీమ్ గర్ల్ సినిమాలో హీరోయిన్‌గా పెద్ద విజయాలను అందుకుంది నుష్రత్ బరుచా. తెలుగులో శివాజీ హీరోగా నటించిన తాజ్‌మహల్ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. హిందీ ఛత్రపతి రీమేక్‌లో బెల్లంకొండ శ్రీనివాస్‌కు జోడీగా నటించింది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Samsung Galaxy Tab S12 | గెలాక్సీ ట్యాబ్ ఎస్12 ప్లస్, ఎస్12 అల్ట్రా లాంచ్.. ఫీచర్లు, ధరలు ఎలా ఉన్నాయి..
- ●Yuzvendra Chahal | చాహల్ సంచలనం.. ఆ ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన లెగ్ స్పిన్నర్..!
- ●Bhatti Vikramarka | గాంధీ పోరాటాన్ని మరిచి చరిత్రను వక్రీకరిస్తున్నరు
- ●Keerthy Suresh | భర్త కోసం సావిత్రి పోరాటం - కీర్తి సురేష్ కొత్త మూవీ టైటిల్‌పై నెటిజన్ల ట్రోల్స్
- ●Asian Games 2026 | పర్వీన్ పంచ్‌కు పసిడి పతకం.. చైనీస్ తైపీ బాక్సర్‌పై గెలుపు..
- ●Offshore Minerals | అండమాన్ దీవుల్లో అరుదైన ఖనిజాలు.. రెండు ప్రాంతాలకు వేలం..

Samsung Galaxy Tab S12 | గెలాక్సీ ట్యాబ్ ఎస్12 ప్లస్, ఎస్12 అల్ట్రా లాంచ్.. ఫీచర్లు, ధరలు ఎలా ఉన్నాయి..

Yuzvendra Chahal | చాహల్ సంచలనం.. ఆ ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన లెగ్ స్పిన్నర్..!

Bhatti Vikramarka | గాంధీ పోరాటాన్ని మరిచి చరిత్రను వక్రీకరిస్తున్నరు

Keerthy Suresh | భర్త కోసం సావిత్రి పోరాటం - కీర్తి సురేష్ కొత్త మూవీ టైటిల్‌పై నెటిజన్ల ట్రోల్స్






