త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bhatti Vikramarka | కేర‌ళం అంటే కమ్యూనిజం అనుకున్నం.. కానీ ఇక్క‌డంతా గూండాయిజ‌మే: భ‌ట్టి

Bhatti Election Campaign | కేరళం (Keralam) అంటే క‌మ్యూనిజం (Communism) అనుకున్నామ‌ని, కానీ ఇక్క‌డంతా గుండాయిజ‌మే క‌నిపిస్తుంద‌ని డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క (Bhatti Vikramarka) విమ‌ర్శించారు. శనివారం ఆయన కేరళంలోని పతనం తిట్ట (PAATHANAM THITTA) అసెంబ్లీ నియోజకవర్గంతో పాటు ఇత‌ర ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం (Election campaign) నిర్వ‌హించారు.

S

News | Published On Apr 4, 2026, 1.50 pm IST

Bhatti Vikramarka | కేర‌ళం అంటే కమ్యూనిజం అనుకున్నం.. కానీ ఇక్క‌డంతా గూండాయిజ‌మే: భ‌ట్టి
Advertisement
  • ఇళ్ల‌ల్లో క‌నీసం ముసలోళ్లను పట్టించుకుంట‌లే
  • పాల‌న‌ను, మాన‌వీయ విలువ‌లను గాలికొదిలేశారు
  • ఎల్డీఎఫ్ హామీలు అంతా జూటా
  • వృద్ధుల కోసం ప్ర‌త్యేక మంత్రిత్వ శాఖ తెస్తాం
  • మార్పు, సంక్షేమం, మెరుగైన పాల‌న కోసం యూడీఎఫ్ అభ్య‌ర్థుల‌ను గెలిపించండి
  • కేరళ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో డిప్యూటీ సీఎం భట్టి

త్రినేత్ర‌.న్యూస్: కేరళం (Keralam) అంటే క‌మ్యూనిజం (Communism) అనుకున్నామ‌ని, కానీ ఇక్క‌డంతా గుండాయిజ‌మే క‌నిపిస్తుంద‌ని డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క (Bhatti Vikramarka) విమ‌ర్శించారు. శనివారం ఆయన కేరళంలోని పతనం తిట్ట (Paathanam Thitta) అసెంబ్లీ నియోజకవర్గంతో పాటు ఇత‌ర ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం (Election campaign) నిర్వ‌హించారు. సెక్యులరిజం, కమ్యూనిజం, మార్క్సిజం మాట్లాడ‌తార‌ని భావిస్తామ‌ని.. ఆ త‌ర‌హా ప‌రిస్థితులు ప్ర‌స్తుతం లేవ‌ని ఆవేద‌న చెందారు. మార్పు, సంక్షేమం, సుపరిపాలన, సెక్యులర్ పాలన కోసం అసెంబ్లీ ఎన్నికల్లో యూడీఎఫ్ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

వృద్ధుల కోసం రూ.25 ల‌క్ష‌ల బీమా..

గత ఎన్నికల ముందు లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్ (LDF) ఇచ్చిన హామీలు అమ‌లు కాలేద‌న్నారు. కేరళలో పరిపాలన దారుణంగా పడిపోయిందని చెప్పారు. శబరిమల ఆలయంలో కుంభకోణం జరిగిందన్న ఆరోపణలు, నిరుద్యోగం పెర‌గడం బాధ క‌లిగిస్తోంద‌న్నారు. కేరళ యువత ఒక్క పూట ఆహారం కోసం ప్రపంచం నలుమూలలకు వలస పోవాల్సిన దుస్థితి ఏర్ప‌డింద‌ని చెప్పారు. ఇండ్ల‌ల్లో వృద్ధుల‌ను ప‌ట్టించుకునే వారే లేర‌ని ఆరోపించారు. ఉమెన్ చాందీ పేరిట వృద్ధుల కోసం 25 లక్షల బీమా పథకాన్ని తీసుకువస్తున్నామని వెల్ల‌డించారు. యూడీఎఫ్ అధికారంలోకి రాగానే సీనియర్ సిటిజన్స్ కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తామ‌ని వివ‌రించారు.

మేం సెక్యుల‌రిజాన్ని కోరుకుంటం..

కాంగ్రెస్ వాదులు శాంతి కాముకులు, సుపరిపాలన, సెక్యులరిజాన్ని కోరుకుంటారు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల హామీలను అన్ని అమలు చేస్తున్నాం. ఆర్థిక మంత్రిగా నాకు అన్ని లెక్క‌లు తెలుసు. ఎవరికైనా అనుమానం ఉంటే తెలంగాణకు రండి. నిజ‌నిజాలు తెలుసుకోండి. రాష్ట్రంలోని మహిళలు ఏ మూల నుంచి ఏ మూలకైనా ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే సౌకర్యాన్ని కల్పించాం. ఇప్పటివరకు తెలంగాణ మహిళలు 10 వేల కోట్ల ఉచిత ప్రయాణాలు చేశారు. రాష్ట్రంలో 1.15 కుటుంబాలు ఉంటే ఇందులో 1.06 కోట్ల కుటుంబాలకు సన్నబియ్యం ఇస్తున్నం. 53 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు స‌ర‌ఫ‌రా చేస్తున్నం. 500 కే గ్యాస్ సిలిండర్ అందజేస్తున్నామని, ఇల్లు లేని పేదలకు పక్కా గృహాలు నిర్మిస్తున్నామని భ‌ట్టి తెలిపారు.

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని 22,500 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభించి నిర్మాణ ప‌నులు జ‌రుగుతున్నాయి. రెండు లక్షల మంది రైతుల ఖాతాల్లోకి ఒకేసారి 21 వేల కోట్ల నగదును జమ చేశాం. రెండేళ్లలో 70 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశాం. విద్య‌పై ఎక్కువ ఖ‌ర్చు చేస్తున్నామ‌ని కేరళ సీఎం ప్ర‌క‌టించారు. కానీ తెలంగాణలో విద్య పై అత్య‌ధికంగా వెచ్చిస్తున్నం. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ 25 ఎకరాల్లో 200 కోట్లతో ఒక్కొక్క పాఠశాలను అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తున్నాం అని భ‌ట్టి తెలిపారు. కాలేజీలకు వెళ్లే మహిళలకు నెలకు రూ.1000 చొప్పున అందజేస్తామని, ఉపాధి కోసం యువతకు ఐదు ల‌క్ష‌ల వ‌ర‌కు వడ్డీ లేని రుణాలిస్తామని తెలిపారు. సామాజిక పెన్షన్ ను రెండువేల నుంచి మూడు వేలకు పెంచుతామ‌న్నారు. కార్యక్రమంలో సి.డబ్ల్యూ.సి. సభ్యుడు రుద్రరాజు, నాయ‌కులు తదితరులు పాల్గొన్నారు.

Also Read..

Patolla Karthik Reddy | మూసీ కేసు మూయలేదు. తెరిచే ఉంది. అసలు కథ మిగిలే ఉంది: ప‌ట్టోళ్ల కార్తీక్‌రెడ్డి

K Annamalai | నాకు పార్టీ టికెట్ నిరాక‌రించ‌లేదు.. నేనే పోటీ చేయ‌డం లేదు : అన్నామ‌లై

Advertisement
Advertisement