త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Patolla Karthik Reddy | మూసీ కేసు మూయలేదు. తెరిచే ఉంది. అసలు కథ మిగిలే ఉంది: ప‌ట్టోళ్ల కార్తీక్‌రెడ్డి

Patolla Karthik Reddy | మూసీ కేసు (Musi case) మాయ‌లేదు.. ఆ కేసు ఇంకా తెరిచే ఉంది.. అస‌లు క‌థ మిగిలే ఉంద‌ని బీఆర్ఎస్ నాయ‌కుడు ప‌ట్టోళ్ల కార్తీక్ రెడ్డి (Patolla Karthik Reddy) తెలిపారు. మూసీపై ఎన్జీటీ(NGT)లో తాను వేసిన కేసు డిస్మిస్ అయిందంటూ వ‌స్తున్న వార్త‌ల్లో నిజం లేద‌ని, డిస్మిస్‌ వేరు డిస్పోస్ వేరు అని పేర్కొన్నారు.

S

News | Published On Apr 4, 2026, 12.52 pm IST

Patolla Karthik Reddy | మూసీ కేసు మూయలేదు. తెరిచే ఉంది. అసలు కథ మిగిలే ఉంది: ప‌ట్టోళ్ల కార్తీక్‌రెడ్డి
Advertisement

త్రినేత్ర‌.న్యూస్: మూసీ కేసు (Musi case) మాయ‌లేదు.. ఆ కేసు ఇంకా తెరిచే ఉంది.. అస‌లు క‌థ మిగిలే ఉంద‌ని బీఆర్ఎస్ నాయ‌కుడు ప‌ట్టోళ్ల కార్తీక్ రెడ్డి (Patolla Karthik Reddy) తెలిపారు. మూసీపై ఎన్జీటీ(NGT)లో తాను వేసిన కేసు డిస్మిస్ అయిందంటూ వ‌స్తున్న వార్త‌ల్లో నిజం లేద‌ని, డిస్మిస్‌ వేరు డిస్పోస్ వేరు అని పేర్కొన్నారు. మీడియా వాళ్లు అది గమనించకుండా సీఎంవో నుంచి వచ్చిన లీకులతో అస‌త్య వార్తలు ప్రచురిస్తున్నారన్నారు. అసెంబ్లీలో చెప్పని వాటిని కూడా చేయించేలా ఎన్జీటీ ముందు ప్రభుత్వం చెప్పేలా చేశామ‌ని చెప్పారు. కోర్టుకు చెప్పిన వాటిలో ప్రభుత్వం ఏ ఒక్కటి చేయకపోయినా మళ్లీ కోర్టు మెట్లు ఎక్కుతామ‌న్నారు.

ప్ర‌జ‌లకు న‌ష్టం జ‌రిగితే అడ్డుకుంటం..

రాష్ట్రం కోసం, ప్రజల కోసం ముఖ్యమంత్రి మూసీ ప్రాజెక్టు చేయడం లేదు. నరేంద్ర మోదీ సబర్మతి రివర్ ఫ్రెండ్ చేసిన విధంగా తన పరపతి పెంచుకునేందుకు రేవంత్ రెడ్డి మూసీ ప్రాజెక్టు చేపడుతున్నారు. ప్రజల కోణంలో చేయకపోతే అడ్డుకొని తీరతామ‌ని హెచ్చరించారు. మూసీపై నేను వేసిన కేసును ఎన్జీటీ డిస్మిస్ చేయలేదు, డిస్పోస్ చేసింది. అన్నీ దరఖాస్తు దశల్లోనే ఉన్నాయని.. అన్నీ చేసిన తర్వాతే ముందుకెళ్తామని ప్రభుత్వం ఎన్జీటీకి చెప్పిందని కార్తీక్‌రెడ్డి వివ‌రించారు. ప్రభుత్వం చేస్తామంటోందని.. చేయకపోతే మళ్లీ రావాలని జ‌డ్జి సూచించిన‌ట్లు చెప్పారు.

ఏ ఒక్క‌టి చేయ‌క‌పోయినా..

మూసీలో MFL, FTL లెవెల్స్ ఫిక్స్ కాలేదు. ఎలాంటి అనుమతులు లేకుండా ప్రభుత్వం ముందుకు వెళ్తుండ‌డంతో NGT లో పిటిషన్ దాఖలు చేశాను. తెలంగాణ సాధించిన పార్టీ నుంచి వ‌చ్చినోళ్లం. కేసీఆర్ సైనికులం. మ‌న‌కు తెలివితేట‌లు ఉంట‌యి. అసెంబ్లీలో కూడా చెప్పని విష‌యాల‌ను ఎన్జీటీలో ఒప్పిచ్చినం. డీపీఆర్ లెవెల్స్, అన్ని ప‌ర్యావ‌ర‌ణ అనుమ‌తులు వ‌చ్చినంక‌నే ముందుకు వోత‌మ‌ని ప్ర‌భుత్వంతో చెప్పిచ్చినం. ప్ర‌భుత్వం ఏ ఒక్క‌టి చేయ‌క‌పోయినా మ‌ళ్లీ కోర్టు మెట్లు ఎక్కుతం. పిటిషన్ డిస్పోజల్ చేసింది. కానీ డిస్మిస్ చేయలేదు అని పట్టోళ్ల పేర్కొన్నారు.

Advertisement
Advertisement