OTT | ఒకే రోజు ఓటీటీలో…థియేటర్లలో విశ్వేక్‌సేన్, తరుణ్‌భాస్కర్ సినిమాలు
విశ్వక్‌సేన్, తరుణ్ భాస్కర్ సినిమాలు ఒకే రోజు థియేటర్‌తో పాటు ఓటీటీలో సందడి చేశాయి. విశ్వక్‌సేన్ హీరోగా తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన ఈఎన్ఈ రిపీట్ థియేటర్లలో రిలీజైంది. విశ్వక్‌సేన్ కల్ట్‌తో పాటు తరుణ్ భాస్కర్ క్రేజీ కళ్యాణం మూవీ గురువారం ఓటీటీ ప్రేక్షకుల ముందుకొచ్చాయి.
OTT | విశ్వక్‌సేన్, తరుణ్ భాస్కర్ కలయికలో రూపొందిన ఈఎన్ఈ రిపీట్ మూవీ గురువారం థియేటర్లలో రిలీజైంది. ఈ నగరానికి ఏమైందికి సీక్వెల్‌గా ఈ కామెడీ మూవీ తెరకెక్కింది. థియేటర్లలోనే కాకుండా ఓటీటీలోనూ గురువారం విశ్వేక్‌సేన్, తరుణ్ భాస్కర్ సినిమాలు సందడి చేశాయి.
కల్ట్
విశ్వక్‌సేన్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన కల్ట్ మూవీ సడెన్‌గా ఓటీటీలోకి వచ్చింది. గురువారం నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. హాలీవుడ్‌లో ఫేమస్ అయిన స్లాషర్ థ్రిల్లర్ అనే కాన్సెప్ట్‌తో విశ్వక్‌సేన్ ఈ సినిమాను తెరకెక్కించారు.
ఈ యాక్షన్ మూవీలో గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌గా నటించింది. తారక్ పొన్నప్ప, మురళీశర్మ, కార్తికేయ, అనిరుధ్ కీలక పాత్రలు పోషించారు.
మితిమీరిన హింస, రక్తపాతంతో విశ్వక్‌సేన్ ఈ సినిమాను తెరకెక్కించారు. గోవా హోమ్‌మినిస్టర్ కొడుకు ఎల్విన్ తన పుట్టినరోజు సందర్భంగా స్నేహితుల కోసం ఫామ్ హౌజ్‌లో ఓ పార్టీ ఏర్పాటుచేస్తాడు. ఆ పార్టీలో బొమ్మ లాంటి ముసుగులు ధరించిన కొందరు అందరిని చంపేయడం మొదలుపెడతారు. ఆ పార్టీకి అటెండ్ అయిన డీఎస్పీ సంకల్ప్ నాయక్ ఈ హత్యల మిస్టరీని ఎలా ఛేదించాడు? అనే అంశాలతో ఈ మూవీ రూపొందింది.
క్రేజీ కళ్యాణం
అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించిన క్రేజీ కళ్యాణం మూవీ గురువారం ఆహా ఓటీటీలో రిలీజైంది. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమాకు భద్రప్ప గాజుల దర్శకత్వం వహించారు. ఇందులో తరుణ్ భాస్కర్, అఖిల్ ఉద్దేమూరి, సీనియర్ నరేష్ కీలక పాత్రలు పోషించారు. తండ్రి ఇష్టానికి వ్యతిరేకంగా తనకు నచ్చిన అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని అనుకున్న ఓ అమ్మాయి కథతో ఈ సినిమా తెరకెక్కింది. క్రేజీ కళ్యాణం మూవీకి థియేటర్లలో మిక్స్‌డ్ టాక్ వచ్చింది. ఈ సినిమాలో తాగుబోతు పాత్రలో తరుణ్ భాస్కర్ కనిపించారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Krithi Shetty | కీర్తి సురేష్, కృతిశెట్టి మాస్ స్టెప్పులు – హీరోయిన్ల పాటతో ప్రమోషన్స్ షురూ
నవంబర్ 20, 2026

OTT Releases This Week | ఈ వారం ఓటీటీలో 25 సినిమాలు రిలీజ్- టాలీవుడ్ నుంచి హయ్యెస్ట్
నవంబర్ 20, 2026

Nivetha Thomas | నేషనల్ అవార్డ్ సినిమా చేసినా… ఛాన్స్‌లు నిల్ – ఓటీటీలోకి నివేదా థామస్ ఎంట్రీ
నవంబర్ 20, 2026
తాజావార్తలు
- ●Ponnam Prabhakar | వేగంగా తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియ: పొన్నం ప్రభాకర్
- ●Kavya Maran | సన్ గ్రూప్ ఉద్యోగులకు గోల్డ్ రింగ్స్‌ను గిఫ్ట్‌గా ఇచ్చిన కావ్య మారన్
- ●IRCTC Tour | చలికాలంలో రూ.14 వేలకే ఊటీ టూర్.. హైదరాబాద్ నుంచి ఐఆర్సీటీసీ స్పెషల్ ప్యాకేజీ
- ●MLA Sudarshan Reddy | వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటా.. కాంగ్రెస్ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు
- ●Elderly couple death | వృద్ధాప్య సమస్యలతో భర్త మృతి.. తట్టుకోలేక గంటల వ్యవధిలోనే భార్య కన్నుమూత
- ●Indus Water | సింధూ జలాల ఒప్పందంపై మా వైఖరి స్పష్టంగా ఉంది : భారత్

Ponnam Prabhakar | వేగంగా తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియ: పొన్నం ప్రభాకర్

Kavya Maran | సన్ గ్రూప్ ఉద్యోగులకు గోల్డ్ రింగ్స్‌ను గిఫ్ట్‌గా ఇచ్చిన కావ్య మారన్

IRCTC Tour | చలికాలంలో రూ.14 వేలకే ఊటీ టూర్.. హైదరాబాద్ నుంచి ఐఆర్సీటీసీ స్పెషల్ ప్యాకేజీ

MLA Sudarshan Reddy | వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటా.. కాంగ్రెస్ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు



