త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

OTT Releases This Week | ఈ వారం ఓటీటీలో 25 సినిమాలు రిలీజ్‌- టాలీవుడ్ నుంచి హ‌య్యెస్ట్‌

ఈ వారం ఓటీటీలోకి కాన్సెప్ట్ ఓరియెంటెడ్ క‌థాంశాల‌తో రూపొందిన సినిమాలు స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి వ‌చ్చాయి. హార‌ర్‌, సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్‌, కామెడీ క‌థాంశాల‌తో రూపొందిన ఆ సినిమాలు ఏవంటే?

N

Entertainment | Published On Nov 20, 2026, 4.40 pm IST

OTT Releases This Week | ఈ వారం  ఓటీటీలో 25 సినిమాలు రిలీజ్‌-  టాలీవుడ్ నుంచి హ‌య్యెస్ట్‌
Advertisement

OTT Releases This Week | ఈ శుక్ర‌వారం ఒక్క రోజే ఓటీటీలో వివిధ భాష‌ల‌కు చెందిన 25కు పైగా సినిమాలు రిలీజ‌య్యాయి. అందులో తెలుగు సినిమాలే ఎక్కువ‌గా ప్రేక్ష‌కుల ముందుకొచ్చాయి. ప్ర‌శాంత్ నీల్ హార‌ర్ మూవీ 418, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ క్రేజీ క‌ళ్యాణంతో పాటు ప‌లు కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలు ఈ వారం ఓటీటీలో సంద‌డి చేశాయి.

నెట్‌ఫ్లిక్స్‌

 

418 (తెలుగు)

స‌లార్‌, కేజీఎఫ్ సినిమాల డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ నిర్మించిన తెలుగు హార‌ర్ మూవీ 418 నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. చైత్రా జే ఆచార్‌, చ‌ర‌ణ్ ల‌క్క‌రాజు ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన ఈ సినిమాకు కీర్త‌న్ నాద‌గౌడ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.
హైకు (త‌మిళ్‌)
దిండోరా వెబ్‌సిరీస్ సీజ‌న్ 2 (హిందీ)
మంగ్లీక్ వెబ్‌సిరీస్ (హిందీ)
గార్డియ‌న్ స్టార్స్ (ఇంగ్లీష్‌)
జెంటిల్‌మాన్‌స్ట‌ర్ (ఇంగ్లీష్‌)

అమెజాన్ ప్రైమ్ వీడియో

మ‌యూఖ (తెలుగు)

తెలుగు సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్ మూవీ మ‌యూఖ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో రిలీజైంది. పాయ‌ల్ చెంగ‌ప్ప ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ఈ సినిమాకు శ్రీతేజ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

ది వ్వాన్ (హిందీ)

సిద్దార్థ్ మ‌ల్హోత్రా, త‌మ‌న్నా జంట‌గా న‌టించిన హార‌ర్ మూవీ ది వాన్ అమెజాన్ ప్రైమ్‌లో ఫ్రీ స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి వ‌చ్చింది. పంచాయ‌త్ ఫేమ్ దీప‌క్‌కుమార్ మిశ్రా ఈ బాలీవుడ్ మూవీకి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.
డ్రోన్స్ (త‌మిళ్‌)
క‌ల్ట్ (తెలుగు)
సిటీ లైట్స్ (క‌న్న‌డ‌)
మ‌ర్నామి (క‌న్న‌డ‌)
క‌రేజ్ (హిందీ)
ది ఒడిస్సీ (ఇంగ్లీష్‌)
ది బీస్ట్ (ఇంగ్లీష్‌

ఈటీవీ విన్ ఓటీటీ

రెచ్చిపోదాం బ్ర‌ద‌ర్ (తెలుగు)
ఆల్మోస్ట్ అర్జున్ (తెలుగు)
రంగ‌స్థ‌లం (తెలుగు)

స‌న్ నెక్స్ట్

అనుమాన ప‌క్షి (తెలుగు)

రాగ్‌మ‌యూర్ హీరోగా డీజే టిల్లు ఫేమ్ విమ‌ల్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన తెలుగు కామెడీ మూవీ అనుమాన ప‌క్షి థియేట‌ర్ల‌లో డిజాస్ట‌ర్‌గా నిలిచింది. తాజాగా ఈ సినిమా స‌న్ నెక్స్ట్ ద్వారా ఓటీటీ ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. అనుమాన‌ప‌క్షిలో మెర్లిప్ ఫిలిప్‌, బ్ర‌హ్మాజీ, ప్రిన్స్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు.
చిర‌మ్ (మ‌ల‌యాళం)

జియో హాట్‌స్టార్‌

కికు చిరంజీవి (తెలుగు)
మిస్ట‌ర్ అండ్ మిస్ ఆఫీస్ (త‌మిళ్‌)

ఆహా ఓటీటీ

క్రేజీ క‌ళ్యాణం (తెలుగు)

అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ హీరోయిన్‌గా తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్కిన క్రేజీ క‌ళ్యాణం ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. భ‌ద్ర‌ప్ప గాజుల ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాలో అఖిల్ రాజ్‌, త‌రుణ్ భాస్క‌ర్‌, సీనియ‌ర్ న‌రేష్ కీల‌క పాత్ర‌లు పోషించారు.

సోనీ లివ్ ఓటీటీ

అన్బిల్ అవ‌న్ (త‌మిళ్‌)

జీ5 ఓటీటీ

తీన్‌తిగ్డా వెబ్‌సిరీస్ (హిందీ)

 

Advertisement
Advertisement