Thriller Movie | డైరెక్టర్‌గా మారిన ఉప్పెన సినిమాటోగ్రాఫర్ – మలయాళ రైటర్ కథతో తెలుగు మూవీ
ఉప్పెన, విరూపాక్ష సినిమాలకు కెమెరామెన్‌గా పనిచేసిన శామ్‌దత్ డైరెక్టర్‌గా మారారు. డోంట్ స్లీప్ పేరుతో తెలుగులో ఓ సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాను తెరకెక్కించారు. చౌర్యపాఠం ఫేమ్ ఇంద్రరామ్ హీరోగా నటిస్తున్న ఈ మూవీ త్వరలో థియేటర్లలో రిలీజ్ కాబోతుంది.
Thriller Movie | సినిమాటోగ్రాఫర్ శామ్‌దత్ డైరెక్టర్‌గా మారారు. తెలుగులో ఓ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీని రూపొందించారు. స్వతహాగా మలయాళీ అయిన శామ్‌దత్....తెలుగులో ప్రస్థానం, విరూపాక్ష, ఉప్పెన, మ్యాడ్, తండేల్ వంటి బ్లాక్‌బస్టర్ మూవీస్‌కు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశాడు. తాజాగా శామ్‌దత్ మెగాఫోన్ పెట్టారు. తెలుగులో డోంట్ స్లీప్ పేరుతో ఓ సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాను తెరకెక్కించారు.
మలయాళ రైటర్స్ కథ...
చౌర్యపాఠం ఫేమ్ ఇంద్రరామ్ హీరోగా నటిస్తోన్న ఈ సినిమాలో రవీంద్ర విజయ్, తబా రీమా, జ్యోతి బెనర్జీ , సునీల్ తాపా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు మలయాళ రైటర్స్ సజీర్ బాబా, లునా జబీన్ కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ అందించారు. మలయాళంలో సూపర్ హిట్‌గా నిలిచిన ఆర్‌డీఎక్స్‌తో పాటు పలు సినిమాలకు ఈ రచయితల ద్వయం కథను అందించారు. ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ ఐయామ్ గేమ్ సినిమాకు కథను అందిస్తున్నారు.
విజయ్ సేతుపతి రిలీజ్...
డోంట్ స్లీప్ మూవీ ఫస్ట్ లుక్‌ను ఆదివారం మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి రిలీజ్ చేశారు. మంచు కొండల బ్యాక్‌డ్రాప్‌లో హీరోను వెంటాడుతూ రవీంద్ర విజయ్ కనిపిస్తున్నారు. రవీంద్ర విజయ్ చేతిలో గన్ ఉండటం ఆసక్తిని పంచుతోంది. హీరో ఇంద్రరామ్ కళ్లుమూసుకొని నిద్రపోతున్నట్లుగా ఉండటం, అతడి తలకు గాయాలు ఉన్న మరో లుక్ ఈ పోస్టర్‌లో కనిపిస్తోంది. కలకు, వాస్తవానికి మధ్య జరిగే సంఘర్షణ నేపథ్యంలో డిఫరెంట్ పాయింట్‌తో ఈ సినిమా తెరకెక్కుతోన్నట్లు సమాచారం. త్వరలోనే ఈ మూవీ థియేటర్లలోకి రానున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
మమ్ముట్టితో...
ఈ సినిమాకు పుష్ప ఫేమ్ మోనిక రామకృష్ణ ప్రొడక్షన్ డిజైనర్లుగా వ్యవహరిస్తున్నారు. గోకుల్ హర్షన్ మ్యూజిక్ అందిస్తున్నారు. డైరెక్టర్‌గా తెలుగులో శామ్‌దత్‌కు ఇదే మొదటి మూవీ. ఓవరాల్‌గా ఇది రెండోది. గతంలో స్ట్రీట్‌లైట్స్ అనే మలయాళ సినిమాకు శామ్‌దత్ దర్శకత్వం వహించారు. మమ్ముట్టి హీరోగా నటించిన ఈ మూవీ కమర్షియల్‌గా ఆశించిన విజయాన్ని సాధించలేదు.
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



