త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Idupu Kayitham | ఇడుపుకాయితం సీరియ‌స్ సినిమా కాదు – ఆ గ్యారెంటీ మాది – నిర్మాత కామెంట్స్‌

ఇడుపుకాయితం సీరియ‌స్ క‌థ‌తో తెర‌కెక్కుతోంద‌ని అంద‌రూ అనుకుంటున్నార‌ని, కానీ అందులో నిజం లేద‌ని నిర్మాత బ‌న్నీవాస్ అన్నారు. ప్రియ‌ద‌ర్శి, నాగ‌దుర్గ హీరోహీరోయిన్లుగా తెలంగాణ నేపథ్య కథతో తెరకెక్కుతోన్న ఈ మూవీ డిసెంబ‌ర్ 11న థియేట‌ర్ల‌లోకి రాబోతుంది. ఈ సినిమా నుంచి ఉల్లిపూల అనే పాట‌ను శ‌నివారం రిలీజ్ చేశారు.

N

Entertainment | Published On Nov 28, 2026, 3.39 pm IST

Idupu Kayitham | ఇడుపుకాయితం సీరియ‌స్ సినిమా కాదు  – ఆ గ్యారెంటీ మాది – నిర్మాత కామెంట్స్‌
Advertisement

Idupu Kayitham |  ప్రియ‌ద‌ర్శి, నాగ‌దుర్గ హీరోహీరోయిన్లుగా న‌టించిన ఇడుపుకాయితం మూవీ డిసెంబ‌ర్ 11న థియేట‌ర్ల‌లోకి రాబోతుంది. సుకుమార్ స‌తీమ‌ణి త‌బిత‌తో క‌లిసి బ‌న్నీవాస్ నిర్మిస్తున్న ఈ సినిమాకు వంశీరెడ్డి దొండ‌పాటి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. అనౌన్స్‌మెంట్‌తోనే ఈ సినిమాకు మంచి బ‌జ్ ఏర్ప‌డింది. ఒక్కో పాట‌ను రిలీజ్ చేస్తూ ఆ హైప్‌ను మ‌రింత పెంచుతోన్నారు మేక‌ర్స్‌. తాజాగా ఈ సినిమా నుంచి ఉల్లిపూల సీర‌గ‌ట్టి ఉత్త‌రాది సెరువుదాటి అనే పాట‌ను రిలీజ్ చేశారు. ఈ పాట‌కు అభిన‌య‌శ్రీనివాస్ సాహిత్యం అందించారు. న‌ల్గొండ‌కు చెందిన సింగ‌ర్ హీనా గ్రేస్ ఆల‌పించింది. సురేష్ బొబ్బిలి మ్యూజిక్ అందించారు.

పోటీప‌డి....

సాంగ్ రిలీజ్ ఈవెంట్‌లో ఇడుపుకాయితం సినిమాపై బ‌న్నీవాస్ ఆస‌క్తిక‌ర కామెంట్లు చేశారు. "'ఇడుపు కాయితం" సీరియస్ క‌థ‌తో తెర‌కెక్కుతోన్న సినిమా అని అంద‌రూ అనుకుంటున్నారు కానీ ఆడియెన్స్‌కు కావాల్సినంత‌ ఎంటర్‌టైన్‌మెంట్ ఇందులో ఉంటుంది. ప్రియదర్శి, నాగ దుర్గ ఒకరితో మ‌రొక‌రు పోటీ పడి న‌టించారు. ఇడుపుకాయితం 2 గంటల 41 నిమిషాలు ఎంగేజ్ చేస్తుంది. థియేటర్ నుంచి మీరు హ్యాపీగా బయటకు వెళ్తారు. ఇది మా గ్యారెంటీ" అని తెలిపారు

అమ్మాయి ప్రేమ‌లో ఉంటే...

ప్రియ‌ద‌ర్శి మాట్లాడుతూ "ఉల్లిపూల సాంగ్ విన్నప్పుడు నాకు బాగా నచ్చింది. ఒక అమ్మాయి ప్రేమలో ఉంటే ఎంత బాగుంటుందో చెప్పే సాంగ్ ఇది. ఒక అమ్మాయి ప్రేమలో ఉన్నప్పుడు ఆమె చూసే ప్రపంచం కొత్తగా ప్రత్యేకంగా ఉంటుంది. 24 గంటలు ఆనందంగా కనిపిస్తారు. ఆ ఫీల్ ను అభిన‌య‌ శ్రీనివాస్ తన సాహిత్యంలో అందంగా ఆవిష్క‌రించారు. పది పుస్తకాల్లో ఉండే తత్వాన్ని రెండు మూడు లైన్లలో రాశారు. ఒక చేనేత నేపథ్య సినిమా చేసిన నటుడిగా ఉల్లిపూల చీరలో ఎన్ని నూలు పోగులు ఉంటాయో నాకు తెలుసు. అన్నే ఎమోషన్స్, సెంటిమెంట్స్ ఇడుపుకాయితం మా మూవీ ద్వారా ప్రేక్ష‌కుల‌కు అందించబోతున్నాం"  అన్నారు.

క‌న్నీళ్ల‌తో బ‌య‌ట అడుగుపెడ‌తారు...

డైరెక్టర్ వంశీరెడ్డి దొండపాటి మాట్లాడుతూ - "ప‌క్కా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఇది. బిజీ లైఫ్ లో మనం ఏ బంధాలను కోల్పోతున్నాం అనేది గుర్తుచేసే మంచి కాన్సెప్ట్ తో రూపొందించాం. అబ్బాయి, అమ్మాయి తరుపున ఉండే రెండు కుటుంబాలు కలిసి మా సినిమా చూస్తే వారి మధ్య ఉన్న బంధం మరింత బలపడుతుంది. మా సినిమా చూశాక చెమర్చిన కళ్లతో థియేట‌ర్ నుంచి బ‌య‌ట అడుగుపెడ‌తారు" అని ద‌ర్శ‌కుడు వంశీరెడ్డి చెప్పారు.

 

 

Advertisement
Advertisement