Vijay Deverakonda | శ్రీకృష్ణుడిగా విజయ్ దేవరకొండ – హయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన గుజరాతీ మూవీ తెలుగులోకి రీమేక్?
కేవలం యాభై లక్షల బడ్జెట్‌తో రూపొందిన గుజరాతీ మూవీ లాలో కృష్ణ సదా సహాయతే 120 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఇండియాలోనే అత్యధిక లాభాలను తెచ్చిపెట్టిన ఈ మూవీ తెలుగులో రీమేక్ కానున్నట్లు సమాచారం. ఈ మైథలాజికల్ మూవీలో శ్రీకృష్ణుడిగా కనిపించబోతున్నారు.
Vijay Deverakonda | లాలో కృష్ణ సదా సహాయతే...గుజరాతీ భాషలో కేవలం యాభై లక్షల బడ్జెట్‌తో రూపొందించిన ఈ మూవీ అంచనాలకు మించి విజయాన్ని సాధించింది. బాక్సాఫీస్ వద్ద 120 కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టింది. ఇండియాలోనే అత్యధిక లాభాలను తెచ్చిపెట్టిన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. అంతే కాకుండా గుజరాతీ భాషలో ఫస్ట్ టైమ్ వంద కోట్ల వసూళ్లను రాబట్టిన మూవీగా చరిత్రను సృష్టించింది.
మైథలాజికల్ డ్రామా...
లాలో కృష్ణ సదా సహాయతేలో ఎలాంటి స్టార్లు లేరు. భారీ కమర్షియల్ హంగులు కూడా లేవు. కేవలం కంటెంట్, మౌత్‌టాక్‌తోనే సూపర్ హిట్‌గా నిలిచింది. ఆర్థిక ఇబ్బందులతో తప్పులు చేసిన ఓ ఆటో డ్రైవర్‌లో శ్రీకృష్ణుడు ఎలా మార్పు తీసుకొచ్చాడనే పాయింట్‌తో ఈ మూవీ రూపొందింది. మైథలాజికల్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాకు అంకిత్ సఖియా దర్శకత్వం వహించాడు. రీవా రాచ్, శృహాద్ గోస్వామి కీలక పాత్రల్లో నటించారు.
భక్తి సినిమాల ట్రెండ్...
తాజాగా ఈ గుజరాతీ బ్లాక్‌బస్టర్ మూవీ తెలుగులోకి రీమేక్ కానున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం భక్తి సినిమా ట్రెండ్ టాలీవుడ్‌లో బాగా నడుస్తోండటంతో లాలో కృష్ణ సదా సహాయతే సినిమా రీమేక్ రైట్స్‌ను ప్రముఖ నిర్మాత దిల్‌రాజు దక్కించుకున్నట్లు సమాచారం.
శ్రీకృష్ణుడిగా...
ఓ యంగ్ హీరో ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ గెస్ట్‌గా కనిపించబోతున్నట్లు సమాచారం. శ్రీకృష్ణుడిగా విజయ్ దేవరకొండ నటించనున్నట్లు చెబుతోన్నారు. మోడ్రన్ శ్రీకృష్ణుడిగా అతడి పాత్ర ఈ సినిమాకు హైలైట్‌గా ఉండనుందట. గుజరాతీ వెర్షన్‌తో పోలిస్తే తెలుగులో చాలానే మార్పులు చేయబోతున్నట్లు సమాచారం. కమర్షియల్ హంగులు జోడించి రూపొందించబోతున్నట్లు టాక్. త్వరలోనే ఈ రీమేక్‌పై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానున్నట్లు తెలిసింది.
ప్రస్తుతం రణబాలి, రౌడీ జనార్ధన సినిమాలతో బిజీగా ఉన్నాడు విజయ్ దేవరకొండ. వీటితో పాటు హాయ్ నాన్న ఫేమ్ శౌర్యువ్ దర్శకత్వంలో ఓ మైథలాజికల్ థ్రిల్లర్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Chiranjeevi | సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్న కాకా – ఫొటోతో రూమర్లకు చెక్ పెట్టిన మెగాస్టార్
సెప్టెంబర్ 4, 2026

Ananya Nagalla | సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాలో అనన్య – రష్మిక మందన్న ఊరితో లింక్?
సెప్టెంబర్ 4, 2026

Nayanthara | ఫస్ట్ టైమ్ రూల్స్ బ్రేక్ చేసిన నయనతార – డబ్బుల కోసమే అంటూ నెటిజన్ల ట్రోల్స్
సెప్టెంబర్ 4, 2026
తాజావార్తలు
- ●CM Revanth Reddy | నాణ్యతలో రాజీ వద్దు.. పనులు వేగవంతం చేయాలి : సీఎం రేవంత్‌రెడ్డి
- ●Chiranjeevi | సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్న కాకా - ఫొటోతో రూమర్లకు చెక్ పెట్టిన మెగాస్టార్
- ●Pain Killers | 30 రోజుల్లో 13 పెయిన్కిల్లర్లు.. చివరకు కిడ్నీలు ఫెయిల్.. వైద్యుల హెచ్చరిక..
- ●Raja Singh | ఒవైసీ బ్రదర్స్ చరిత్ర తెలుసుకోండి
- ●Ananya Nagalla | సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాలో అనన్య - రష్మిక మందన్న ఊరితో లింక్?
- ●Ramchandar Rao | ఓవైసీ సోదరులకు దేశభక్తి సర్టిఫికెట్లు ఇవ్వడమంటే దేశాన్ని అవమానించడమే: రాంచందర్‌రావు

CM Revanth Reddy | నాణ్యతలో రాజీ వద్దు.. పనులు వేగవంతం చేయాలి : సీఎం రేవంత్‌రెడ్డి

Chiranjeevi | సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్న కాకా - ఫొటోతో రూమర్లకు చెక్ పెట్టిన మెగాస్టార్

Pain Killers | 30 రోజుల్లో 13 పెయిన్కిల్లర్లు.. చివరకు కిడ్నీలు ఫెయిల్.. వైద్యుల హెచ్చరిక..

Raja Singh | ఒవైసీ బ్రదర్స్ చరిత్ర తెలుసుకోండి



