Taapsee | నాలుగేళ్ల తర్వాత తెలుగు సినిమాలో తాప్సీ – బాలీవుడ్‌లో ఆఫర్లు తగ్గడమే కారణమా?
ఢిల్లీ బ్యూటీ తాప్సీ నాలుగేళ్ల తర్వాత టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నట్లు సమాచారం. కొరియన్ కనకరాజు డైరెక్టర్ మేర్లపాక గాంధీతో తాప్సీ ఓ హారర్ సినిమా చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. పాటలు, కామెడీ లేకుండా ప్రయోగాత్మకంగా ఈ సినిమా ఉండబోతున్నట్లు చెబుతున్నారు.
Entertainment | Published On Aug 29, 2026, 5.18 pm IST
Taapsee | ఢిల్లీ బ్యూటీ తాప్సీ కెరీర్ తెలుగు సినిమాలోనే మొదలైంది. మంచు మనోజ్ హీరోగా రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన ఝుమ్మంది నాదంతో హీరోయిన్‌గా ఫస్ట్ టైమ్ కెమెరా ముందుకొచ్చింది. ఆ తర్వాత ప్రభాస్ మిస్టర్ పర్‌ఫెక్ట్‌తో మొగుడు, వీర, దరువు, షాడోతో పాటు మరికొన్ని సినిమాలు చేసింది. ఇందులో మిస్టర్ పర్‌ఫెక్ట్ మినహా మిగిలిన సినిమాలన్నీ డిజాస్టర్ కావడంతో తాప్సీపై ఐరెన్ లెగ్ అనే ముద్రపడింది. దాంతో టాలీవుడ్‌కు టాటా చెప్పిన ఈ బ్యూటీ బాలీవుడ్ బాట పట్టింది. హిందీలో మాత్రం స్టార్ హీరోయిన్‌గా గుర్తింపును సొంతం చేసుకుంది.
గ్లామర్ కోసమే...
బాలీవుడ్‌లో సినిమాలు చేస్తూ టాలీవుడ్‌తో పాటు దక్షిణాది సినీ పరిశ్రమపై చాలా సార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. గ్లామర్ కోసమే తెలుగులో హీరోయిన్లను తీసుకుంటారంటూ తాప్సీ చేసిన కామెంట్లపై చాలానే విమర్శలు వచ్చాయి.
టాలీవుడ్‌లోకి రీఎంట్రీ...
హిందీలో అవకాశాలు చాలానే వచ్చినా విజయాలు మాత్రం దక్కలేదు. ఈ ఢిల్లీ బ్యూటీ బాలీవుడ్‌లో హిట్టు కొట్టి ఏడెనిమిదేళ్లు దాటిపోయింది. ఈ ఫ్లాప్‌ల కారణంగా ఆఫర్లు తగ్గుముఖం పట్టాయి. యంగ్ హీరోయిన్ల జోరుతో తాప్సీ వైపు డైరెక్టర్లు ఎవరూ కన్నెత్తిచూడటం లేదని టాక్ వినిపిస్తోంది. దాంతో బాలీవుడ్‌పై ఆశలు వదులుకున్న ఈ బ్యూటీ తిరిగి టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇచ్చే ప్రయత్నాల్లో ఉన్నట్లు సమాచారం.
హారర్ మూవీ...
తాజాగా ఓ హారర్ మూవీకి తాప్సీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు చెబుతోన్నారు. ఇటీవలే కొరియన్ కనకరాజుతో కమర్షియల్ హిట్టును అందుకున్న మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తాప్సీ హీరోయిన్‌గా ఓ సినిమా ఫిక్సైనట్లు టాక్ వినిపిస్తోంది. కామెడీ, పాటలు లేకుండా ప్యూర్ హారర్ మూవీగా ఈ సినిమా రూపొందనున్నట్లు సమాచారం. మేర్లపాక గాంధీ మూవీతో దాదాపు నాలుగేళ్ల తర్వాత తాప్సీ టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇవ్వబోతుంది. చివరగా తెలుగులో 2022లో మిషన్ ఇంపాజిబుల్ సినిమా చేసింది.
తాప్సీ హీరోయిన్‌గా నటించిన బాలీవుడ్ మూవీ గాంధారి సెప్టెంబర్ 3న డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ కాబోతుంది. యాక్షన్ రివేంజ్ డ్రామాగా రూపొందిన ఈ మూవీని రాఘవేంద్రరావు మాజీ కోడలు కనికా థిల్లాన్ నిర్మించింది.
సంబంధిత వార్తలు

Chiranjeevi | సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్న కాకా – ఫొటోతో రూమర్లకు చెక్ పెట్టిన మెగాస్టార్
సెప్టెంబర్ 4, 2026

Ananya Nagalla | సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాలో అనన్య – రష్మిక మందన్న ఊరితో లింక్?
సెప్టెంబర్ 4, 2026

Nayanthara | ఫస్ట్ టైమ్ రూల్స్ బ్రేక్ చేసిన నయనతార – డబ్బుల కోసమే అంటూ నెటిజన్ల ట్రోల్స్
సెప్టెంబర్ 4, 2026
తాజావార్తలు
- ●CM Revanth Reddy | నాణ్యతలో రాజీ వద్దు.. పనులు వేగవంతం చేయాలి : సీఎం రేవంత్‌రెడ్డి
- ●Chiranjeevi | సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్న కాకా - ఫొటోతో రూమర్లకు చెక్ పెట్టిన మెగాస్టార్
- ●Pain Killers | 30 రోజుల్లో 13 పెయిన్కిల్లర్లు.. చివరకు కిడ్నీలు ఫెయిల్.. వైద్యుల హెచ్చరిక..
- ●Raja Singh | ఒవైసీ బ్రదర్స్ చరిత్ర తెలుసుకోండి
- ●Ananya Nagalla | సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాలో అనన్య - రష్మిక మందన్న ఊరితో లింక్?
- ●Ramchandar Rao | ఓవైసీ సోదరులకు దేశభక్తి సర్టిఫికెట్లు ఇవ్వడమంటే దేశాన్ని అవమానించడమే: రాంచందర్‌రావు

CM Revanth Reddy | నాణ్యతలో రాజీ వద్దు.. పనులు వేగవంతం చేయాలి : సీఎం రేవంత్‌రెడ్డి

Chiranjeevi | సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్న కాకా - ఫొటోతో రూమర్లకు చెక్ పెట్టిన మెగాస్టార్

Pain Killers | 30 రోజుల్లో 13 పెయిన్కిల్లర్లు.. చివరకు కిడ్నీలు ఫెయిల్.. వైద్యుల హెచ్చరిక..

Raja Singh | ఒవైసీ బ్రదర్స్ చరిత్ర తెలుసుకోండి



