Hyderabad Marathon 2026 | హైదరాబాద్‌లో మారథాన్ జోష్.. పరుగులు పెట్టిన యూత్, దివ్యాంగులు
Hyderabad Marathon 2026 | హైదరాబాద్‌లో 15వ ఎన్‌ఎండీసీ హైదరాబాద్ మారథాన్-2026 తో నగరంలో సందడి వాతావరణం నెలకొంది. యూత్, పెద్దలు, దివ్యాంగులు ఈ పరుగులో పాల్గొని ఫుల్ జోష్ నింపారు. దేశంలోని అనేక ప్రాంతాలు సహా విదేశాల నుంచి కూడా రన్నర్స్ తరలివచ్చారు.
- 6,500 మందికిపైగా పాల్గొన్న రన్నర్లు
Hyderabad Marathon 2026 | త్రినేత్ర.న్యూస్: హైదరాబాద్‌లో 15వ ఎన్‌ఎండీసీ హైదరాబాద్ మారథాన్-2026 తో నగరంలో ఆదివారం సందడి వాతావరణం నెలకొంది. యూత్, పెద్దలు, దివ్యాంగులు ఈ పరుగులో పాల్గొని ఫుల్ జోష్ నింపారు. దేశంలోని అనేక ప్రాంతాలు సహా విదేశాల నుంచి కూడా రన్నర్స్ తరలివచ్చారు. ఈ పరుగు ఆద్యాంతం ఉత్సాహంగా సాగింది. వేలాది మంది రన్నర్స్‌తో నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజా నుంచి ప్రారంభమై హుస్సేన్ సాగర్ లేక్, లోక్‌భవన్ మీదుగా గచ్చిబౌలి స్టేడియం వరకు మారథాన్ రన్ నిర్వహించారు. హాఫ్ మారథాన్‌ను జీహెచ్‌ఎంసీ కమిషనర్ కర్ణన్ ప్రారంభించారు. మారథాన్ దృష్ట్యా పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
‘సెల్‌ఫోన్ వద్దు-పుస్తకమే ముద్దు’
మాదాపూర్ హైటెక్స్‌లో ఈ రన్‌లో 6,500 మందికిపైగా రన్నర్లు భాగమయ్యారు. వారిలో 300 మంది దివ్యాంగ రన్నర్లు పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ రన్ దేశంలోనే అతిపెద్ద మారథాన్‌గా గుర్తింపు దక్కించుకుంది. ఫుల్ మారథాన్, హాఫ్ మారథాన్, 10 కే విభాగాల్లో రన్ కొనసాగింది. ఈ ఏడాది మారథాన్‌కు వరల్డ్ అథ్లెటిక్స్ సిల్వర్ సస్టెయినబిలిటీ అవార్డు లభించింది. ‘సెల్‌ఫోన్ వద్దు-పుస్తకమే ముద్దు’ సందేశంతో పిల్లల్లో పుస్తక పఠనాన్ని పెంచాలని సైబరాబాద్ సీపీ డాక్టర్ రమేశ్ పిలుపునిచ్చారు. మారథాన్ విజేతలకు గచ్చిబౌలి స్టేడియం వద్ద బహుమతులు ప్రదానం చేయనున్నారు.
తాజావార్తలు
- ●KCR | వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్
- ●Hyderabad | పల్టీలు కొట్టిన ఇన్నోవా క్రిస్టా.. ఇంటర్ స్టూడెంట్ స్పాట్ డెడ్
- ●KTR | కేటీఆర్ పీఏ, పీఆర్వోకు పోలీసుల నోటీసులు
- ●Telangana Bar Council | తెలంగాణ బార్ కౌన్సిల్ చైర్మన్‌గా సాముల రామ్ రెడ్డి, బీసీఐ సభ్యుడిగా కిరణ్ కుమార్
- ●Mega Job Mela | సెప్టెంబర్ 19న కోదాడలో మెగా జాబ్ మేళా.. 4 వేల మంది ఉద్యోగవకాశాలు
- ●Vinayaka Chavithi | వినాయకుడి పంచరత్నాలు.. పఠిస్తే ప్రశాంతత.. స్మరిస్తే విఘ్నవినాశనం

KCR | వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్

Hyderabad | పల్టీలు కొట్టిన ఇన్నోవా క్రిస్టా.. ఇంటర్ స్టూడెంట్ స్పాట్ డెడ్

KTR | కేటీఆర్ పీఏ, పీఆర్వోకు పోలీసుల నోటీసులు

Telangana Bar Council | తెలంగాణ బార్ కౌన్సిల్ చైర్మన్‌గా సాముల రామ్ రెడ్డి, బీసీఐ సభ్యుడిగా కిరణ్ కుమార్









