Ponguleti Srinivas Reddy | ఓం.. భీమ్.. బుష్.. హరీష్.. బీఆర్ఎస్‌ను కబ్జా చేయడానికి మరింత దిగజారినవ్
Ponguleti Srinivas Reddy | మీ మామ కేసీఆర్‌పై క్షుద్రపూజల దగ్గర నుంచి పాల పేరుతో చేసిన పాపపు వ్యాపారాల దాకా అన్ని అవలక్షణాలు ఉన్న అగ్గిపెట్టెరావు వ్యక్తిత్వం ఎంత నీచమైందో అర్థం అయిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రావు విమర్శించారు. బీఆర్ఎస్‌ను కబ్జా చేయడానికి మరింత దిగజారారని ఆరోపించారు.
- కేసీఆర్ మీద క్షుద్రపూజలు చేయించావని కవితే చెప్పింది
- నువ్ ఎన్ని కుట్రలు చేసినా ప్రభుత్వ సంకల్పాన్ని అడ్డుకోలేవ్
- ధరణి పేరుతో దొరలు చేసిన దోపిడీని బయటికి తీయడం ఖాయం
- హరీశ్‌పై ఎక్స్ వేదికగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఫైర్
Ponguleti Srinivas Reddy | త్రినేత్ర.న్యూస్: మీ మామ కేసీఆర్‌పై క్షుద్రపూజల దగ్గర నుంచి పాల పేరుతో చేసిన పాపపు వ్యాపారాల దాకా అన్ని అవలక్షణాలు ఉన్న అగ్గిపెట్టెరావు వ్యక్తిత్వం ఎంత నీచమైందో అర్థం అయిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రావు విమర్శించారు. బీఆర్ఎస్‌ను కబ్జా చేయడానికి మరింత దిగజారారని ఆరోపించారు. ఎన్ని కుట్రలు చేసినా, ప్రతి రోజు పెయిడ్ సోషల్ మీడియాలో ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా ధరణి పేరుతో దొరలు చేసిన దోపిడీని బయటికి తీయడం ఖాయమన్నారు. ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి, పేదల సొంతింటి కలను నెరవేర్చడంతో పాటు గుడిసెలు లేని తెలంగాణను నిర్మించడం కూడా ఖాయమని చెప్పారు. ఈమేరకు ఆయన ఎక్స్ వేదికగా స్పందిస్తూ హరీశ్‌పై తీవ్ర విమర్శలు చేశారు.
పదవుల కోసం, పైసల కోసం హరీశ్ రావు ఎంత నీచానికైనా దిగజారుతారనేది తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. ఆనాడు అగ్గిపెట్టె లేదంటూ యువకులను రెచ్చగొట్టి శవ రాజకీయాలు చేశారు. అధికారంలో ఉన్నప్పుడు పైసల కోసం మంత్రి పదవిని అడ్డుపెట్టుకొని అనైతికంగా ఆసుపత్రులతో పాల వ్యాపారం చేశారు. చివరికి బీఆర్ఎస్ పార్టీని కబ్జా చేసేందుకు హరీష్ రావు మరింతగా దిగజారారు. మామ కేసీఆర్ ఆరోగ్యం బాగుండొద్దని హరీష్ రావు క్షుద్రపూజలు చేయించారని స్వయంగా కేసీఆర్ కుమార్తె కవిత గారే ప్రకటించారంటే, హరీష్ రావు వ్యక్తిత్వం ఎంత నీచమైనదో అర్థం చేసుకోవచ్చు.
ఇలాంటి తప్పుడు మనస్తత్వం కలిగిన వ్యక్తి కాబట్టే.. తన అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకు, రాజకీయ పబ్బం గడుపుకోవడానికి హరీష్ రావు రోజూ చేస్తున్న అసత్య ప్రచారాలను తెలంగాణ ప్రజలు నమ్మడం లేదు. అగ్గిపెట్టెరావు.. ఒక్కటి గుర్తుపెట్టుకో.. ఎన్ని కుట్రలు చేసినా మీ దోపిడీని బయటికి తీయడం ఖాయం. ప్రజలకు మంచి చేయాలనే, గొప్ప పరిపాలన అందించాలనే సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ఈ ప్రజా ప్రభుత్వ సంకల్పాన్ని అడ్డుకోలేవు అని పొంగులేటి హితవు పలికారు.
సంబంధిత వార్తలు

DK Aruna | కొండా సురేఖను తప్పిస్తే చాలా బాధేసింది: బీజేపీ ఎంపీ డీకే అరుణ
సెప్టెంబర్ 4, 2026

Congress Party | కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని.. కాంగ్రెస్ పార్టీ మహా ధర్నా
సెప్టెంబర్ 4, 2026

CM Revanth Reddy | నాణ్యతలో రాజీ వద్దు.. పనులు వేగవంతం చేయాలి : సీఎం రేవంత్‌రెడ్డి
సెప్టెంబర్ 4, 2026
తాజావార్తలు
- ●Razor Blades | బ్లేడ్లు మింగిన బాలుడు.. తొలగించిన ఉస్మానియా వైద్యులు..
- ●DK Aruna | కొండా సురేఖను తప్పిస్తే చాలా బాధేసింది: బీజేపీ ఎంపీ డీకే అరుణ
- ●Arpitha Nursing Home | గర్భసంచి ఆపరేషన్‌కు వెళ్తే.. మహిళ కిడ్నీ తొలగింపు
- ●Murder Case | చేతబడి అనుమానంతో రియల్ ఎస్టేట్ వ్యాపారి హత్య.. మైనర్ సహా ఏడుగురు నిందితులు అరెస్ట్
- ●Sri Krishnashtami | చిన్ని కృష్ణుడిగా సీఎం విజయ్ - రామ్‌చరణ్ ఇంట కృష్ణాష్టమి వేడుకలు - ఫొటోలపై ఓ లుక్కేయండి...
- ●Congress Party | కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని.. కాంగ్రెస్ పార్టీ మహా ధర్నా

Razor Blades | బ్లేడ్లు మింగిన బాలుడు.. తొలగించిన ఉస్మానియా వైద్యులు..

DK Aruna | కొండా సురేఖను తప్పిస్తే చాలా బాధేసింది: బీజేపీ ఎంపీ డీకే అరుణ

Arpitha Nursing Home | గర్భసంచి ఆపరేషన్‌కు వెళ్తే.. మహిళ కిడ్నీ తొలగింపు

Murder Case | చేతబడి అనుమానంతో రియల్ ఎస్టేట్ వ్యాపారి హత్య.. మైనర్ సహా ఏడుగురు నిందితులు అరెస్ట్



