Nani Paradise | డల్లాస్ గడ్డపై మారుమోగిన తెలంగాణ జానపదం – ప్యారడైజ్ నుంచి ఏషనాగుల సాంగ్ రిలీజ్
నాని ప్యారడైజ్ సినిమాలోని తెలంగాణ జానపదం గీతం ఏషనాగుల కట్టమీద పాట యూట్యూబ్‌తో ఇతర మ్యూజిక్ ప్లాట్‌ఫామ్స్‌లో ట్రెండింగ్ అవుతోంది. ఈ పాటను డల్లాస్‌లో జరిగిన అనిరుధ్ మ్యూజిక్ కాన్సెర్ట్‌లో రిలీజ్ చేశారు. ఈ సాంగ్ లాంఛ్ ఈవెంట్‌లో నాని పాల్గొన్నాడు.
Entertainment | Published On Aug 29, 2026, 2.50 pm IST
Nani Paradise | తెలంగాణ జానపదం డల్లాస్ వేదికపై మారుమోగింది. తెలంగాణ పల్లె పాటకు ప్రపంచ దేశాల మ్యూజిక్ లవర్స్ సైతం ఫిదా అయ్యారు. ప్రస్తుతం తెలుగు సినిమాల్లో తెలంగాణ జానపదాలను పాటలుగా ఉపయోగించే ట్రెండ్ పెరిగిపోయింది. హుషారుగా సాగే ఈ బాణీలు మ్యూజిక్ లవర్స్‌ను ఉర్రూతలూగిస్తున్నాయి. యూట్యూబ్‌తో పాటు ఇతర మ్యూజిక్ ప్లాట్‌ఫామ్స్‌లో వందల మిలియన్ల వ్యూస్‌ను సాధిస్తున్నాయి. ఈ ట్రెండ్‌లో నాని ప్యారడైజ్ చేరింది.
ఏషనాగుల...
ఈ సినిమా కోసం తెలంగాణ ఫేమస్ జాపపద గీతం ఏషనాగుల పాటను రీమిక్స్ చేశారు. ఈ పాటను తెలంగాణ ఫోక్ సింగర్ జంగిరెడ్డితో కలిసి రామ్ మిరియాల, ప్రభ ఆలపించారు. అనిరుధ్ మ్యూజిక్ అందించారు. ఏషనాగుల కట్టమీదా పాటను అమెరికాలోని డల్లాస్‌లో జరిగిన అనిరుధ్ లైవ్ కాన్సెర్ట్‌లో రిలీజ్ చేశారు. ఈ సాంగ్ లాంఛ్ ఈవెంట్‌లో హీరో నాని పాల్గొన్నాడు. ఏషనాగుల పాటకు అనిరుధ్‌తో కలిసి నాని డ్యాన్స్ చేశాడు. ఈ స్పెషల్ పర్ఫార్మెన్స్ మ్యూజిక్ లవర్స్‌ను మెప్పించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కీర్తి సురేష్ స్టెప్పులు...
ఏషనాగుల పాట ప్రస్తుతం యూట్యూబ్‌తో పాటు మిగిలిన మ్యూజికల్ ప్లాట్‌ఫామ్స్‌లో ట్రెండింగ్‌లో ఉంది. లిరికల్ వీడియోను కూడా శనివారం రిలీజ్ చేశారు. మాస్ సాంగ్‌కు నాని, కీర్తి సురేష్ తమ స్టెప్పులతో అదరగొట్టారు. ప్యారడైజ్‌లోని ఫస్ట్ సింగిల్ ఆయాషేర్ కూడా తెలంగాణ ఫోక్ సాంగ్ కావడం గమనార్హం. ఇప్పటికే ఈ పాట యూట్యూబ్‌లో రెండు వందల మిలియన్ల వ్యూస్ సాధించింది.
మోహన్‌బాబు విలన్....
ప్యారడైజ్ మూవీకి శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో నానికి జోడీగా కయదు లోహర్ హీరోయిన్‌గా నటిస్తోంది. సీనియర్ నటుడు మోహన్‌బాబు విలన్‌గా కనిపించబోతున్న ఈ సినిమాలో రాఘవ్ జుయాల్, సంపూర్ణేష్‌బాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సెప్టెంబర్ 25న ప్యారడైజ్ థియేటర్లలోకి రాబోతుంది. దసరా తర్వాత నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న ఈ మూవీని సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు.
https://t.co/qcmVgb3DUp#Yeshanagula out on your favourite streaming platforms...
Banger Lyric video on the way...
Until then lets keep dancing to the @anirudhofficial's naatu mass 🕺🕺
— THE PARADISE (@TheParadiseOffl) August 29, 2026
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Siima Awards 2026 | సైమా అవార్డ్స్ వేడుకలో సందడి చేసిన హీరోయిన్లు – స్పెషల్ అట్రాక్షన్‌గా రుక్మిణి వసంత్
సెప్టెంబర్ 13, 2026

Irumudi OTT | అఫీషియల్ – థియేటర్లలో ఆడుతోండగానే ఓటీటీలోకి రవితేజ ఇరుముడి – నిర్మాతలపై ఫ్యాన్స్ ఫైర్
సెప్టెంబర్ 13, 2026

Adarsha Kutumbam | ఫ్యామిలీ మ్యాన్ .. యాక్షన్ బాట పడితే – ఆదర్శ కుటుంబం టీజర్ వచ్చేసింది – రిలీజ్ డేట్‌పై క్లారిటీ
సెప్టెంబర్ 12, 2026
తాజావార్తలు
- ●Siima Awards 2026 | సైమా అవార్డ్స్ వేడుకలో సందడి చేసిన హీరోయిన్లు - స్పెషల్ అట్రాక్షన్‌గా రుక్మిణి వసంత్
- ●Passenger Ship | 240 మంది ప్రయాణికులతో వెళ్తున్న నౌక.. జావా సముద్రంలో గల్లంతు
- ●Irumudi OTT | అఫీషియల్ - థియేటర్లలో ఆడుతోండగానే ఓటీటీలోకి రవితేజ ఇరుముడి - నిర్మాతలపై ఫ్యాన్స్ ఫైర్
- ●Vinayaka Chavithi | గణపతి.. విఘ్నహర్తే కాదు.. జ్ఞానదాత కూడా..
- ●SIIMA Awards | ఉత్తమ నటుడిగా తేజ సజ్జా.. బెస్ట్ కమెడియన్‌గా బుల్లిరాజు
- ●Brahmotsavalu 2026 | తిరుమల వెంకన్న తొమ్మిది రోజుల ఉత్సవం వెనుక వెయ్యేళ్ల చరిత్ర..!

Siima Awards 2026 | సైమా అవార్డ్స్ వేడుకలో సందడి చేసిన హీరోయిన్లు - స్పెషల్ అట్రాక్షన్‌గా రుక్మిణి వసంత్

Passenger Ship | 240 మంది ప్రయాణికులతో వెళ్తున్న నౌక.. జావా సముద్రంలో గల్లంతు

Irumudi OTT | అఫీషియల్ - థియేటర్లలో ఆడుతోండగానే ఓటీటీలోకి రవితేజ ఇరుముడి - నిర్మాతలపై ఫ్యాన్స్ ఫైర్

Vinayaka Chavithi | గణపతి.. విఘ్నహర్తే కాదు.. జ్ఞానదాత కూడా..



