Unidentified Bodies Nepal | నేపాల్ వరద బీభత్సం: గుర్తుతెలియని మృతదేహాల ఖననం.. మరి భవిష్యత్తులో వారిని ఎలా గుర్తిస్తారు?
నేపాల్‌ను వణికించిన వరదల్లో దొరికిన అజ్ఞాత మృతదేహాలను ఖననం చేయనున్నారు. భవిష్యత్తులో వారిని డీఎన్‌ఏ ద్వారా ఎలా గుర్తిస్తారో తెలుసుకోండి.
International | Published On Aug 30, 2026, 2.57 pm IST
సంక్షిప్త సారాంశం
నేపాల్‌లో వరదల కారణంగా బయటపడిన 700 పైగా మృతదేహాలను ఇన్ఫెక్షన్ల ముప్పు నివారించేందుకు పూడ్చిపెట్టనున్నారు. ముందుగా ప్రతి మృతదేహం నుంచి DNA శాంపిల్స్ సేకరించి, దానికి ఒక యూనిక్ ID కేటాయిస్తున్నారు. భవిష్యత్తులో బంధువుల DNAతో మ్యాచ్ అయిన తర్వాత సులభంగా వెలికితీసేలా 1.5 మీటర్ల లోతులో, ప్రత్యేక బ్యాగుల్లో జియో-ట్యాగింగ్ ద్వారా ఖననం చేస్తున్నారు. బాధితుల వివరాలను ఆన్‌లైన్‌లో ఉంచడంతో పాటు, బంధువులు తమ వారిని సులభంగా గుర్తించేందుకు వీలుగా పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.
Unidentified Bodies Nepal | త్రినేత్ర.న్యూస్ : బుధవారం ఉదయం నేపాల్‌ను సునామీలా ముంచెత్తిన ఆకస్మిక వరదలు (flash floods) పెను విషాదాన్ని మిగిల్చాయి. వందలాది మంది ప్రాణాలు కోల్పోగా, ఇప్పటివరకు సుమారు 734 మృతదేహాలను సహాయక బృందాలు వెలికితీశాయి. అయితే, వీటిలో ఎవరివో గుర్తుపట్టలేని, ఎవరూ క్లెయిమ్ చేయని మృతదేహాలు కుళ్ళిపోయి ఇన్ఫెక్షన్లు ప్రబలే ప్రమాదం ఉండటంతో.. వాటిని ఖననం చేయాలని నేపాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

పరిస్థితి చేయిదాటుతుండటంతో..
భారత్ సరిహద్దుల్లోని చిత్వాన్ (Chitwan) జిల్లాలోనే అత్యధికంగా 233 మృతదేహాలు లభ్యమయ్యాయి. ఆసుపత్రుల్లో సరైన సదుపాయాలు, స్థలం లేకపోవడంతో డెడ్ బాడీస్ వేగంగా కుళ్లిపోతున్నాయి. దుర్వాసన తీవ్రం కావడంతో పాటు అంటువ్యాధులు ప్రబలే ముప్పు ఉందని హెల్త్ ఎక్స్‌పర్ట్స్ హెచ్చరించారు. "మృతదేహాల సంఖ్య పెరిగిపోవడంతో ఒక ఇంటిని కూలింగ్ సెంటర్‌గా మార్చాం. అది కూడా నిండిపోవడంతో ఇక ఖననం (bury) చేయడం తప్ప మరో ప్రత్యామ్నాయం లేకపోయింది" అని ఒక అధికారి వాపోయారు.

DNA శాంపిల్స్ సేకరణ.. యూనిక్ ఐడీ
మృతదేహాలను పూడ్చిపెట్టే ముందు అధికారులు ప్రతి డెడ్ బాడీ నుంచి DNA శాంపిల్స్ సేకరిస్తున్నారు. భవిష్యత్తులో వారిని సులభంగా గుర్తించేందుకు ప్రతి మృతదేహానికి ఒక యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్ (ID) ఇస్తున్నారు. శనివారం మధ్యాహ్నం నాటికి 100కు పైగా మృతదేహాలకు DNA ప్రొఫైలింగ్ పూర్తి చేసి ఖననానికి సిద్ధం చేశారు.

ఖననం కోసం ప్రత్యేక ఏర్పాట్లు
భవిష్యత్తులో బంధువులు వస్తే, ఈ మృతదేహాలను సులభంగా బయటకు తీసేందుకు వీలుగా 1.5 మీటర్ల లోతులో గుంటలు తవ్వుతున్నారు. ఒక బాడీకి, మరో బాడీకి మధ్య 40 సెంటీమీటర్ల గ్యాప్ మెయింటైన్ చేస్తున్నారు. మృతదేహాలను ఒక ప్రత్యేకమైన బ్యాగ్‌లో ప్యాక్ చేసి, దానిపై ఆ ఐడీ నంబర్‌ను ఉంచుతున్నారు. అంతేకాదు, ప్రతి ఖనన ప్రదేశంలో ఒక కాంక్రీట్ ప్లాట్‌ఫారమ్ నిర్మించి, దానిపై ఐడీ నంబర్ ఉన్న సైన్ బోర్డును ఏర్పాటు చేస్తున్నారు.

బంధువులకు ఎలా అప్పగిస్తారు?
ఈ మొత్తం ప్రాసెస్‌ను వీడియో, ఫోటోగ్రఫీ ద్వారా డాక్యుమెంట్ చేయడంతో పాటు ఆ ప్రదేశాన్ని జియో-ట్యాగ్ (Geo-tag) చేస్తున్నారు. తమ వారి కోసం వెతుకుతున్న బంధువులు దేశవ్యాప్తంగా ఉన్న ఆసుపత్రుల్లో తమ DNA శాంపిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది.
ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత, నేపాల్ హెల్త్ డిపార్ట్‌మెంట్ ఆ డేటాను మృతదేహాల DNAతో మ్యాచ్ చేస్తుంది. రిపోర్ట్ మ్యాచ్ అయితే, ఆ ప్రత్యేకమైన ఐడీ నంబర్ ఆధారంగా పోలీసులు ఆ బాడీ ఎక్కడ ఉందో లొకేట్ చేస్తారు. ఆ తర్వాత మృతదేహాన్ని వెలికితీసి బంధువులకు అప్పగిస్తారు.
గుర్తుతెలియని మృతదేహాల వివరాలను పోలీసులు ఒక వెబ్‌సైట్‌లో కూడా అప్‌లోడ్ చేశారు. నేపాల్‌లో విదేశీయులతో సహా ఇంకా దాదాపు 2,500 మంది ఆచూకీ గల్లంతైనట్లు అధికారుల సమాచారం.
रसुवा जिल्ला भोटेकोशीमा आएको बाढीबाट प्रभावित "पहिचान नखुलेका तथा बेवारिसे शव" सम्बन्धी विवरणहरूका लागि QR Scan वा https://t.co/pnKPe51ZdI हेर्न सक्नुहुन्छ ।#नेपालप्रहरी #NepalPolice #BelieveInBlue #ToServeandProtect pic.twitter.com/o8OqgBGhr6
— Nepal Police (@NepalPoliceHQ) August 29, 2026
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Nepal Floods | నేపాల్ వరదల్లో అద్భుతం.. 9 రోజుల తర్వాత జలవిద్యుత్ ప్రాజెక్టు సొరంగం నుంచి ప్రాణాలతో బయటపడ్డ ఇద్దరు కార్మికులు
సెప్టెంబర్ 4, 2026

Sonu Sood | నేపాల్ త్రిశూలి బజార్‌ను సందర్శించిన సోనూ సూద్
సెప్టెంబర్ 2, 2026

Nepal Flash Floods | ఆకస్మిక వరదలకు అదే కారణం.. తేల్చిన నేపాల్ ప్రధాని బలేంద్ర షా
సెప్టెంబర్ 2, 2026
తాజావార్తలు
- ●Nagarmal Bajoria | 300 సార్లు ఎన్నికల్లో పోటీ.. ఆ కోరిక తీరకుండానే అనంత లోకాలకు
- ●Konda Surekha | కొండా సురేఖకు మరో ఝలక్..
- ●Traffic Restrictions | వినాయక విగ్రహాల తరలింపు.. ధూల్‌పేటలో 14 వరకు ట్రాఫిక్ ఆంక్షలు
- ●CM Revanth Reddy | కొడంగల్ లిఫ్ట్.. ఫేజ్-2 పనులకు టెండర్లు పిలవండి
- ●KRMB | తాగు నీటి అవసరాలకే నీటిని వినియోగించాలి.. కేఆర్ఎంబీ ఆదేశాలు
- ●CM Revanth Reddy | హకీంపేట్ ఎడ్యుకేషన్ హబ్ పనులను పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి

Nagarmal Bajoria | 300 సార్లు ఎన్నికల్లో పోటీ.. ఆ కోరిక తీరకుండానే అనంత లోకాలకు

Konda Surekha | కొండా సురేఖకు మరో ఝలక్..

Traffic Restrictions | వినాయక విగ్రహాల తరలింపు.. ధూల్‌పేటలో 14 వరకు ట్రాఫిక్ ఆంక్షలు

CM Revanth Reddy | కొడంగల్ లిఫ్ట్.. ఫేజ్-2 పనులకు టెండర్లు పిలవండి



