Nora Fatehi | బాధితురాలిగా నటించొద్దు – ఇల్లు, కారు గిఫ్ట్‌గా ఇచ్చా – నోరా ఫతేహిపై సుఖేష్ చంద్రశేఖర్ ఆరోపణలు
మనీ లాండరింగ్ కేసులో జైలు శిక్షను అనుభవిస్తున్న సుఖేష్ చంద్రశేఖర్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని ఇటీవల బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహి ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నది. ఆమె కామెంట్లపై సుఖేష్ ఓ లేఖ ద్వారా బదులిచ్చారు. నోరా ఫతేహిపై సంచలన ఆరోపణలు చేశారు. సుఖేష్ రాసినట్లుగా చెబుతున్న ఈ లెటర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Entertainment | Published On Aug 30, 2026, 1.28 pm IST
Nora Fatehi | మనీ లాండరింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సుఖేష్ చంద్రశేఖర్ బాలీవుడ్ హీరోయిన్ నోరా ఫతేహిపై సంచలన ఆరోపణలు చేశారు. మొరాకాలో నోరా ఫతేహి కొన్న ఇళ్లు కోసం తాను కోట్ల రూపాయలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. తన నుంచి జాక్వెలిన్ ఫెర్నెండేజ్‌ను దూరం చేయడానికి నోరా ఫతేహి చాలానే కుట్రలు పన్నిందని అన్నాడు. సుఖేష్ చంద్రశేఖర్ రాసినట్లుగా చెబుతోన్న చేతిరాతతో కూడిన ఓ లెటర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒకప్పుడు తనతో నోరా ఫతేహి షాపింగ్‌లకు, విహారయాత్రలకు వచ్చిందని, ఇప్పుడు తాను ఎవరో కూడా తెలియనట్లు నటిస్తుందని ఈ లేఖలో సుఖేష్ పేర్కొన్నారు.
మొరాకాలో ఇల్లు...
"నా దగ్గర నుంచి ఎప్పుడూ డబ్బు తీసుకోలేదని అబద్దాలు చెబుతున్నావు. నేను ఇచ్చిన కోట్ల రూపాయల డబ్బుతోనే మొరాకాలోని కాసాబ్లాంకాలో నువ్వు ఇల్లు కొనుగోలు చేసింది నిజం కాదా. ఆ టైమ్‌లో మన మధ్య జరిగిన చాటింగ్ ఇప్పటికీ నా వద్ద ఉన్నాయి. నువ్వు చెప్పేవి నిజాలే అయితే ఆ మెసేజ్‌లు అందరికి చూపించు. మన మధ్య ఏం జరిగిందో ప్రపంచానికి తెలియనివ్వు" అని ఈ లేఖలో కనిపిస్తోంది.
సింపథీ కోసమే...
"జైలు నుంచే తాను నోరా ఫతేహికి మెసేజ్‌లు పంపిస్తే అవి ఎలా వచ్చాయో కూడా తెలియదంటూ అమాయకురాలిగా నటిస్తుంది.బాధితురాలినంటూ సింపథీ కోసం డ్రామాలు ఆడుతుంది. యాడ్స్, సినిమాల్లో అవకాశాల పోతున్నాయనే అబద్దాలు ఆడుతుంది" అని ఈ లేఖలో సుఖేష్ పేర్కొన్నారు.
జాక్వెలిన్ ఫెర్నెండేజ్...
తనతో కలిసి నోరా ఫతేహి చాలా సార్లు షాపింగ్‌లు, విహారయాత్రలకు వచ్చిందని సుఖేష్ అన్నారు. ఆమెకు ఓ బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్‌గా ఇచ్చానని, ఆ బహుమతికి చూసి ఆనందపడిన నోరా తనకు లవ్ యూ బ్యాడ్ బాయ్ అంటూ మెసేజ్ పంపించిందని ఈ లేఖలో సుఖేష్ తెలిపాడు. జాక్వెలిన్ ఫెర్నేండేజ్‌తో తాను సన్నిహితంగా ఉండటం నోరా ఫతేహి తట్టుకోలేకపోయిందని, అసూయతో ఆమెను నా నుంచి దూరం చేసేందుకు చాలానే కుట్రలు పన్నిందని ఈ లేఖలో కనిపిస్తోంది. జాక్వెలిన్‌తో రిలేషన్‌ను తెంచుకోవాలంటూ తనకు ప్రతి రోజు చాలా సార్లు ఫోన్ చేసి వేడుకునేదని సుఖేష్ అన్నారు. ఈ లేఖ ద్వారా బాలీవుడ్ బ్యూటీపై సుఖేష్ చాలానే ఆరోపణలు చేశారు. ఈ లెటర్ నిజంగానే సుఖేష్ రాసాడని కొందరు అంటున్నారు. ప్రస్తుతం ఈ లెటర్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.
తప్పుడు ప్రచారాలు ...
ఇటీవలే ఓ పాడ్‌కాస్ట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సుఖేష్ చంద్రశేఖర్ మనీ లాండరింగ్ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని నోరా ఫతేహి అన్నది. అతడి నుండి డబ్బులు తీసుకున్నాననే తప్పుడు ప్రచారాల వల్ల తాను ఎంతో మానసిక వేదనకు గురైనట్లు చెప్పింది. ఈ ఆరోపణల కారణంగా తన కెరీర్ నాశనమైందని చెప్పింది. ఆమె చేసిన కామెంట్ల లేఖ ద్వారా సుఖేష్ బదులు ఇచ్చినట్లు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●CM Revanth Reddy | నాణ్యతలో రాజీ వద్దు.. పనులు వేగవంతం చేయాలి : సీఎం రేవంత్‌రెడ్డి
- ●Chiranjeevi | సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్న కాకా - ఫొటోతో రూమర్లకు చెక్ పెట్టిన మెగాస్టార్
- ●Pain Killers | 30 రోజుల్లో 13 పెయిన్కిల్లర్లు.. చివరకు కిడ్నీలు ఫెయిల్.. వైద్యుల హెచ్చరిక..
- ●Raja Singh | ఒవైసీ బ్రదర్స్ చరిత్ర తెలుసుకోండి
- ●Ananya Nagalla | సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాలో అనన్య - రష్మిక మందన్న ఊరితో లింక్?
- ●Ramchandar Rao | ఓవైసీ సోదరులకు దేశభక్తి సర్టిఫికెట్లు ఇవ్వడమంటే దేశాన్ని అవమానించడమే: రాంచందర్‌రావు

CM Revanth Reddy | నాణ్యతలో రాజీ వద్దు.. పనులు వేగవంతం చేయాలి : సీఎం రేవంత్‌రెడ్డి

Chiranjeevi | సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్న కాకా - ఫొటోతో రూమర్లకు చెక్ పెట్టిన మెగాస్టార్

Pain Killers | 30 రోజుల్లో 13 పెయిన్కిల్లర్లు.. చివరకు కిడ్నీలు ఫెయిల్.. వైద్యుల హెచ్చరిక..

Raja Singh | ఒవైసీ బ్రదర్స్ చరిత్ర తెలుసుకోండి






