Horror OTT | ఓటీటీలోకి మెగా హీరో బ్లాక్‌బస్టర్ హారర్ కామెడీ మూవీ – స్ట్రీమింగ్ డేట్, ప్లాట్‌ఫామ్ ఏవంటే?
మెగా హీరో వరుణ్‌తేజ్ బ్లాక్‌బస్టర్ మూవీ కొరియన్ కనకరాజు ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫామ్ అయ్యింది. సెప్టెంబర్ 4 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఈ హారర్ కామెడీ మూవీ స్ట్రీమింగ్ కాబోతుంది. రితికా నాయక్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో కమెడియన్ సత్య కీలక పాత్ర పోషించాడు.
Entertainment | Published On Aug 30, 2026, 2.08 pm IST
Horror OTT | కొరియన్ కనకరాజు మూవీతో లాంగ్ గ్యాప్ తర్వాత బ్లాక్‌బస్టర్‌ను అందుకున్నాడు మెగా హీరో వరుణ్ తేజ్. హారర్ కామెడీగా తెరకెక్కిన ఈ సినిమాకు మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించాడు. రితికా నాయక్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో సత్య, మురళీధర్ గౌడ్ కీలక పాత్రలు పోషించారు.
పాజిటివ్ టాక్...
ఆగస్ట్ ఫస్ట్ వీక్‌లో థియేటర్లలో రిలీజైన కొరియన్ కనకరాజు పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. దాదాపు 30 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా నలభై కోట్లకుపైగా కలెక్షన్స్ దక్కించుకుంది. ఓటీటీ, శాటిలైట్‌తో పాటు మ్యూజికల్ రైట్స్ ద్వారా మేకర్స్‌కు మరో ఇరవై ఐదు కోట్ల వరకు వచ్చినట్లు సమాచారం. నిర్మాతలకు ఈ మెగా హీరో మూవీ భారీగా లాభాలు తెచ్చిపెట్టింది.
నెట్‌ఫ్లిక్స్...
తాజాగా కొరియన్ కనకరాజు ఓటీటీలోకి వచ్చేస్తోంది. సెప్టెంబర్ 4 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కాబోతుంది. కొరియన్ కనకరాజు మూవీలో వరుణ్ తేజ్ యాక్టింగ్‌తో పాటు సత్య, మురళీధర్ గౌడ్ కామెడీ అభిమానులను ఆకట్టుకున్నాయి. ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందించాడు.
కొరియన్ గ్యాంగ్‌స్టర్....
పెనుకొండకు చెందిన కనకరాజు చెక్కభజన ప్రదర్శనలు చేస్తూ జీవితాన్ని వెళ్లదీస్తుంటాడు. తమ ఊరికే చెందిన చైత్రతో తొలిచూపులోనే ప్రేమలో పడతాడు. కొరియన్ వెళ్లాలన్నది చైత్ర కల. ఆ ప్రయత్నాల్లోనే ఉంటుంది. లోకల్ ఎమ్మెల్యేతో జరిగిన ఓ గొడవలో కనకరాజులోకి కొరియన్ గ్యాంగ్‌స్టర్ ఆత్మ ప్రవేశిస్తుంది. ఆ ఆత్మ నుంచి విముక్తి కోసం తన స్నేహితుడు కిష్టప్ప, ప్రియురాలు చైత్రతో కలిసి కనకరాజు కొరియా వెళతాడు? ఆ గ్యాంగ్‌స్టర్ గురించి కనకరాజుకు ఎలాంటి నిజాలు తెలిశాయి అన్నదే ఈ మూవీ కథ.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Irumudi OTT | అఫీషియల్ – థియేటర్లలో ఆడుతోండగానే ఓటీటీలోకి రవితేజ ఇరుముడి – నిర్మాతలపై ఫ్యాన్స్ ఫైర్
సెప్టెంబర్ 13, 2026

Dhruv Vikram | టాలీవుడ్ డైరెక్టర్‌తో వివాదం – దిగొచ్చిన ధృవ్ విక్రమ్
సెప్టెంబర్ 12, 2026

Adarsha Kutumbam | ఫ్యామిలీ మ్యాన్ .. యాక్షన్ బాట పడితే – ఆదర్శ కుటుంబం టీజర్ వచ్చేసింది – రిలీజ్ డేట్‌పై క్లారిటీ
సెప్టెంబర్ 12, 2026
తాజావార్తలు
- ●KCR | వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్
- ●Hyderabad | పల్టీలు కొట్టిన ఇన్నోవా క్రిస్టా.. ఇంటర్ స్టూడెంట్ స్పాట్ డెడ్
- ●KTR | కేటీఆర్ పీఏ, పీఆర్వోకు పోలీసుల నోటీసులు
- ●Telangana Bar Council | తెలంగాణ బార్ కౌన్సిల్ చైర్మన్‌గా సాముల రామ్ రెడ్డి, బీసీఐ సభ్యుడిగా కిరణ్ కుమార్
- ●Mega Job Mela | సెప్టెంబర్ 19న కోదాడలో మెగా జాబ్ మేళా.. 4 వేల మంది ఉద్యోగవకాశాలు
- ●Vinayaka Chavithi | వినాయకుడి పంచరత్నాలు.. పఠిస్తే ప్రశాంతత.. స్మరిస్తే విఘ్నవినాశనం

KCR | వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్

Hyderabad | పల్టీలు కొట్టిన ఇన్నోవా క్రిస్టా.. ఇంటర్ స్టూడెంట్ స్పాట్ డెడ్

KTR | కేటీఆర్ పీఏ, పీఆర్వోకు పోలీసుల నోటీసులు

Telangana Bar Council | తెలంగాణ బార్ కౌన్సిల్ చైర్మన్‌గా సాముల రామ్ రెడ్డి, బీసీఐ సభ్యుడిగా కిరణ్ కుమార్



