త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Venkatesh | విక్ట‌రీ వెంక‌టేష్ ప్రొడ్యూస‌ర్‌గా వ‌చ్చిన ఒకే ఒక తెలుగు మూవీ – పెద్ద హిట్టు…హీరో ఎవ‌రంటే?

సుదీర్గ సినీ ప్ర‌యాణంలో టాలీవుడ్ హీరో వెంక‌టేష్ ప్రొడ్యూస‌ర్‌గా ఓ సినిమా చేశారు. ఈ సినిమా కోసం వెంక‌టేష్ ఎంట‌ర్‌ప్రైజెస్ పేరుతో ఓ బ్యాన‌ర్‌ను నెల‌కొల్పారు. ఆ సినిమా ఏదంటే?

N

News | Published On Jan 31, 2026, 9.46 pm IST

Venkatesh | విక్ట‌రీ వెంక‌టేష్ ప్రొడ్యూస‌ర్‌గా వ‌చ్చిన ఒకే ఒక తెలుగు మూవీ – పెద్ద హిట్టు…హీరో ఎవ‌రంటే?
Advertisement

Venkatesh |  న‌ల‌భై ఏళ్ల సుదీర్ఘ సినీ ప్ర‌యాణంలో హీరోగా ఎన్నో విజ‌య‌వంత‌మైన‌ సినిమాలు చేశారు విక్ట‌రీ వెంక‌టేష్. ఫ్యామిలీ క‌థ‌లే కాకుండా యాక్ష‌న్‌, కామెడీ, దేశ‌భ‌క్తి, ఫాంట‌సీ ఇలా అన్ని జాన‌ర్‌ల‌లో సినిమాలు చేశారు. హీరోగా ఇప్ప‌టివ‌ర‌కు 76 సినిమాలు చేశాడు వెంక‌టేష్‌. అందులో అత్య‌ధిక శాతం విజ‌యాలే ఉన్నాయి. ప్ర‌స్తుతం సీనియ‌ర్ హీరోల్లో ఫుల్ బిజీగా కొన‌సాగుతోన్నారు.

హిందీలో సినిమాలు...

రామ‌నాయుడు త‌న‌యుడిగా ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టిన వెంక‌టేష్...అతి త‌క్కువ కాలంలోనే త‌న‌కంటూ సొంత ఇమేజ్‌ను ఏర్పాటుచేసుకున్నాడు. తెలుగులోనే కాకుండా హిందీలో సినిమాలు చేసి విజ‌యాల‌ను అందుకున్నాడు. క‌థ న‌చ్చితే మ‌ల్టీస్టార‌ర్ సినిమాలు చేయ‌డానికి కూడా వెంక‌టేష్ రెడీగా ఉంటారు.

ప్రొడ్యూస‌ర్‌గా ఒకే ఒక సినిమా...

హీరోగానే కాకుండా ప్రొడ్యూస‌ర్‌గా కూడా వెంక‌టేష్ ఓ సినిమా చేశారు. తండ్రి రామానాయుడు...అన్న సురేష్ బాబు బాట‌లో అడుగులు వేయాల‌ని అనుకున్నారు. సొంతంగా బ్యాన‌ర్ నెల‌కొల్పి అల‌నాటి స్టార్ హీరోతో వెంక‌టేష్ ఓ సినిమా నిర్మించారు. ఈ మూవీ పెద్ద హిట్ట‌యిన చిత్ర నిర్మాణం మాత్రం కొన‌సాగించ‌లేక‌పోయారు.
ఎంకి నాయుడు బావ‌...
వెంక‌టేష్ నిర్మించిన ఈ ఒకే ఒక తెలుగు మూవీ ఎంకి నాయుడు బావ‌. 1978లో రిలీజైన ఈ సినిమాలో శోభ‌న్‌బాబు, వాణిశ్రీ జంట‌గా న‌టించారు. కెరీర్ ఆరంభంలో త‌న అభిమాన హీరోగా శోభ‌న్‌బాబును పేర్కొనేవారు వెంక‌టేష్‌. ఆయ‌న‌తో సినిమా చేయాల‌నే క‌ల‌తోనే ఎంకి నాయుడు బావ‌ను నిర్మించారు వెంక‌టేష్‌. ఈ సినిమా కోస‌మే వెంక‌టేష్ ఎంట‌ర్‌ప్రైజెస్ పేరుతో నిర్మాణ సంస్థ‌ను స్థాపించారు. ఈ సినిమాను నిర్మించిన టైమ్ లో వెంకటేష్ వయసు 18 ఏళ్లు కావడం గమనార్హం.

ఎంకి పాట‌ల ఆధారంగా...

నండూరి సుబ్బారావు రాసిన ఎంకి పాట‌లు ఆధారంగా విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో డైరెక్ట‌ర్ బోయిన సుబ్బారావు తెర‌కెక్కించారు. ప‌ల్లెటూరి బ్యాక్‌డ్రాప్‌లో స్వ‌చ్ఛ‌మైన ప్రేమ‌క‌థ‌గా రూపొందిన ఈ సినిమాలో శోభ‌న్‌బాబు, వాణిశ్రీ త‌మ కెమిస్ట్రీతో అభిమానుల‌ను ఆక‌ట్టుకున్నారు. అప్ప‌టివ‌ర‌కు స్టైలిష్ మూవీస్ చేస్తూ వ‌చ్చిన శోభ‌న్ బాబు ఈ సినిమాలో అచ్చ‌మైన ప‌ల్లెటూరి యువ‌కుడి పాత్ర‌లో క‌నిపించి ఆడియెన్స్‌ను మెప్పించాడు. బావామ‌ర‌ద‌ళ్లు అయిన‌ నాయుడు, ఎంకి ప్రేమ‌క‌థ‌కు ఆస్తులు, కుటుంబ క‌ల‌హాలు ఎలా అడ్డంకిగా నిలిచాయ‌నే పాయింట్‌తో ఈ మూవీ రూపొందింది.ఈ సినిమా విజ‌యంలో కేవీ మ‌హ‌దేవ‌న్ మ్యూజిక్ కీల‌కంగా నిలిచింది.
ఎంకి నాయుడు బావ బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా నిలిచిన వెంక‌టేష్ మాత్రం ప్రొడ్యూస‌ర్‌గా మ‌రో సినిమా చేయ‌లేదు. తెలుగులో హీరో వెంక‌టేష్ ప్రొడ్యూస‌ర్‌గా వ‌చ్చిన ఒకే ఒక మూవీగా ఎంకి నాయుడు బావ నిలిచింది.

 

Advertisement

తాజావార్తలు

Advertisement