Telugu OTT | ఓటీటీలోకి సమ్మర్ హాలీడేస్ – స్ట్రీమింగ్ డేట్, ప్లాట్‌ఫామ్ ఫిక్స్
లేటెస్ట్ తెలుగు మూవీ సమ్మర్ హాలీడేస్ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్‌తో పాటు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఖరారయ్యాయి. ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీ డిసెంబర్ 4 నుంచి సోనీలివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతుంది. రోహన్ రాయ్, అరుణ్ దేవ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు శ్రీకర్ నయన్ దర్శకత్వం వహించాడు.
Entertainment | Published On Nov 27, 2026, 8.55 pm IST
Telugu OTT | రోహన్ రాయ్, అరుణ్‌దేవ్ ప్రధాన పాత్రల్లో నటించిన తెలుగు మూవీ సమ్మర్ హాలీడేస్ నిజాయితీతో కూడిన మంచి ప్రయత్నంగా తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. 90ల కాలం నాటి బాల్యపు జ్ఞాపకాలను ప్రతి ఒక్కరికి గుర్తుచేస్తూ దర్శకుడు శ్రీకర్ నయన్ ఈ సినిమాను తెరకెక్కించారు. రాజీవ్ కనకాల, జయసుధ, వాసుకి కీలక పాత్రలు పోషించారు. మంచి సినిమాగా ప్రశంసలు దక్కినా కమర్షియల్‌గా మాత్రం సరైన విజయాన్ని సాధించలేదు.
ఓటీటీలోకి...
తాజాగా సమ్మర్ హాలీడేస్ మూవీ ఓటీటీలోకి రాబోతుంది. ఈ సినిమా స్ట్రీమింగ్ డేట్‌తో పాటు ప్లాట్‌ఫామ్ కన్ఫామ్ అయ్యాయి. డిసెంబర్ 4 నుంచి సోనీలివ్ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతుంది.
చదువుల పేరుతో...
చదువుల పేరుతో పిల్లలపై ఒత్తిడి తీసుకురావద్దనే సందేశాన్ని ఎంటర్‌టైనింగ్‌గా దర్శకుడు సమ్మర్ హాలీడేస్ మూవీలో చూపించాడు. రావురి వెంకటేష్ అలియాస్ ఆర్‌వీ క్రికెట్ అంటే ఇష్టం. కానీ తండ్రి మాత్రం ఎప్పుడూ చదవమని పోరు పెడుతుంటాడు. ఫస్ట్ ర్యాంక్ వస్తే క్రికెట్ కొనిస్తానని తండ్రి మాటిస్తాడు. కానీ ఆర్‌వీకి పదో ర్యాంక్ వస్తుంది. దాంతో తండ్రికి భయపడి అమ్మమ్మ ఇంటికి వెళతాడు. అక్కడ కేవీ అలియాస్ కాశీ వెంకటేశ్వర్లుతో ఆర్‌వీకి పరిచయం ఏర్పడుతుంది. ఆ పరిచయం ఆర్‌వీలో ఎలాంటి మార్పు తీసుకొచ్చింది? తల్లికి ఓ చీర కొనివ్వాలని కేవీ ఏం చేశాడు? అన్నదే ఈ మూవీ కథ. నైంటీస్ మిడిల్‌క్లాస్ బయోపిక్ వెబ్‌సిరీస్‌తో పాటు ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో సినిమాతో ఆకట్టుకున్నాడు రోహన్‌రాయ్.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

OTT Releases This Week | ఈ వారం ఓటీటీలో మిస్ కాకుండా చూడాల్సిన సినిమాలు , వెబ్‌సిరీస్‌లు ఇవే
నవంబర్ 27, 2026

Telugu OTT | ఓటీటీలోకి డీజే టిల్లు డైరెక్టర్ తెలుగు క్రైమ్ కామెడీ మూవీ – అతి అనుమానాలు అనర్థాలు తెచ్చిపెడితే!
నవంబర్ 15, 2026

Bollywood OTT | రెండు కోట్ల బడ్జెట్ – 450 కోట్ల కలెక్షన్స్ – ఓటీటీలోకి బ్లాక్‌బస్టర్ మైథాలజీ మూవీ
నవంబర్ 7, 2026
తాజావార్తలు
- ●Hyderabad Metro | పదో వసంతంలోకి హైదరాబాద్ మెట్రో రైలు..
- ●DEPwD | హైదరాబాద్ దివ్యాంగుల శాఖలో 83 ప్రభుత్వ ఉద్యోగాలు.. రాతపరీక్ష లేకుండానే..
- ●Horoscope | నవంబర్ 28 రాశిఫలాలు.. కుటుంబ సభ్యులతో అపార్థాలు రావచ్చు!
- ●M Revanth Reddy | పర్యావరణ పరిరక్షణకు ప్రత్యేక పాలసీ..
- ●MLC Dasoju | ‘హీరోస్ ఆఫ్ హైదరాబాద్’ అవార్డులు ప్రదానం చేసిన ఎమ్మెల్సీ దాసోజు
- ●Gurrala Nagaraju | తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌లో దక్షిణాఫ్రికా ప్రతినిధిగా గూర్రాల నాగరాజు

Hyderabad Metro | పదో వసంతంలోకి హైదరాబాద్ మెట్రో రైలు..

DEPwD | హైదరాబాద్ దివ్యాంగుల శాఖలో 83 ప్రభుత్వ ఉద్యోగాలు.. రాతపరీక్ష లేకుండానే..

Horoscope | నవంబర్ 28 రాశిఫలాలు.. కుటుంబ సభ్యులతో అపార్థాలు రావచ్చు!

M Revanth Reddy | పర్యావరణ పరిరక్షణకు ప్రత్యేక పాలసీ..



