త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Venkatesh | వెంకటేష్, త్రివిక్రమ్ మూవీ టైటిల్ ఇదే – ఫ‌స్ట్ లుక్‌తో స‌ర్‌ప్రైజ్ చేసిన మేక‌ర్స్‌

Venkatesh | వెంక‌టేష్ హీరోగా త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ మూవీ తెర‌కెక్కుతోంది. ఈ సినిమాకు ఆద‌ర్శ కుటుంబం హౌస్ నెంబ‌ర్ 47...ఏకే 47 అనే టైటిల్ క‌న్ఫామ్ చేశారు. ఫ‌న్ ఫ్యామిలీ డ్రామాగా రూపొందుతున్న మూవీ ఫ‌స్ట్ లుక్‌ను విడుద‌ల చేశారు.

N

News | Published On Dec 10, 2025, 11.46 am IST

Venkatesh | వెంకటేష్, త్రివిక్రమ్ మూవీ టైటిల్ ఇదే –  ఫ‌స్ట్ లుక్‌తో స‌ర్‌ప్రైజ్ చేసిన మేక‌ర్స్‌
Advertisement

Venkatesh | డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ (Trivikram) మూవీ టైటిల్స్‌కు స‌ఫ‌రేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అచ్చ తెలుగులో పొయెటిక్‌గా త‌న సినిమాల‌కు పేర్లు పెడుతుంటారు త్రివిక్ర‌మ్‌. మ‌రోసారి త‌న మార్కు చాటుకున్నారు. ప్ర‌స్తుతం వెంక‌టేష్ హీరోగా త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ మూవీ తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లే పూజా కార్య‌క్ర‌మాల‌తో ఈ సినిమా లాంఛ్ అయ్యింది. బుధ‌వారం ఫ్యాన్స్‌కు మేక‌ర్స్‌ స్వీట్ స‌ర్‌ప్రైజ్ ఇచ్చారు. ఈ మూవీ టైటిల్‌తో పాటు ఫ‌స్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు.

వెంక‌టేష్‌(Venkatesh), త్రివిక్ర‌మ్ కాంబోలో వ‌స్తున్న ఈ మూవీకి ఆద‌ర్శ కుటుంబం హౌస్ నెంబ‌ర్ 47 ఏకే 47 అనే టైటిల్ క‌న్ఫామ్ చేశారు. ఈ సినిమా ఫ‌స్ట్‌లుక్‌ను రిలీజ్ చేశారు. చేతిలో బ్యాగ్ ప‌ట్టుకొని చిరున‌వ్వులు చిందిస్తూ హోమ్లీ లుక్‌లో వెంక‌టేష్ క‌నిపిస్తున్నారు. ఆద‌ర్శ కుటుంబం హౌస్ నెంబ‌ర్ 47కు ఏకే 47ను జోడించి టైటిల్ పెట్ట‌డం ఆస‌క్తిని పంచుతోంది.
నేటి (బుధ‌వారం) నుంచి ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లైన‌ట్లు ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ ద్వారా మేక‌ర్స్ క్లారిటీ ఇచ్చారు. 2026 స‌మ్మ‌ర్‌లో ఈ సినిమాను ప్రేక్ష‌కుల‌ ముందుకు తీసుకురాబోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఫ‌స్ట్ షెడ్యూల్‌ను హైద‌రాబాద్‌లో షూట్ చేస్తున్న‌ట్లు స‌మాచారం.

ఆద‌ర్శ కుటుంబం :హౌస్ నెంబ‌ర్ - 47 ఏకే 47

Venkatesh, Trivikram's new combo 'Adarsha Kutumbam' announcement poster
ఆద‌ర్శ కుటుంబం హౌస్ నెంబ‌ర్ 47 లో వెంక‌టేష్‌కు జోడీగా శాండ‌ల్‌వుడ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ సినిమాకు హ‌ర్ష‌వ‌ర్ద‌న్ రామేశ్వ‌ర్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఆద‌ర్శ కుటుంబం సినిమాను హారిక హాసిని క్రియేష‌న్స్ ప‌తాకంపై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు.
గ‌తంలో వెంక‌టేష్, త్రివిక్ర‌మ్ కాంబోలో నువ్వు నాకు న‌చ్చావ్‌, వాసు, మ‌ల్లీశ్వ‌రీ సినిమాలు వ‌చ్చాయి. కానీ ఈ సినిమాల‌కు కేవ‌లం రైట‌ర్‌గా మాత్ర‌మే త్రివిక్ర‌మ్ వ్య‌వ‌హ‌రించాడు. త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో వెంక‌టేష్ న‌టిస్తున్న ఫ‌స్ట్ మూవీ ఇదే కావ‌డం గ‌మ‌నార్హం.
త్రివిక్ర‌మ్ మూవీతో పాటు చిరంజీవి మ‌న శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్‌లో వెంక‌టేష్ న‌టిస్తున్నారు. ఇందులో ఓ స్పెష‌ల్ రోల్ చేయ‌బోతున్నారు. అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ కాబోతుంది. చిరంజీవి, వెంక‌టేష్ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న ఫ‌స్ట్ మూవీ ఇదే కావ‌డంతో అభిమానుల్లో భారీగా అంచ‌నాలు నెల‌కొన్నాయి.

Advertisement

తాజావార్తలు

Advertisement