Web Series | గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్‌పై వెబ్‌సిరీస్ – ఓటీటీలో ఫ్రీ స్ట్రీమింగ్
గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ జీవితం ఆధారంగా వీరప్పన్ ది బండిట్ కింగ్ పేరుతో ఓ వెబ్‌సిరీస్ రూపొందింది. కాంతార కిషోర్, అర్జున్, లక్ష్మిరాయ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్ వేవ్స్ ఓటీటీలో రిలీజైంది. ఫ్రీగా స్ట్రీమింగ్ అవుతోంది.
Web Series | 1990 - 2000 దశకంలో తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలను గడగడలాడించాడు గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్. అతడిని పట్టుకోవడానికి పదేళ్లకుపైనే పోలీసులు ప్రయత్నించారు. వీరప్పన్‌ను అంతమొందించడానికి ఆపరేషన్ కుకూన్ పేరుతో తమిళనాడు ప్రభుత్వం ఓ సీక్రెట్ ఆపరేషన్ చేపట్టింది. ఈ ఆపరేషన్ కోసం దాదాపు వంద కోట్లకుపైనే ఖర్చుచేసింది. చివరకు 2004లో నాటకీయ పరిణామల మధ్య వీరప్పన్‌ను షూట్ చేశారు. ఈ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.
వెబ్‌సిరీస్...
తాజాగా గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ జీవితంపై ఓ వెబ్‌సిరీస్ వచ్చింది. వీరప్పన్ ది బండిట్ కింగ్ పేరుతో రూపొందిన ఈ సిరీస్ వేవ్స్ ఓటీటీలో రిలీజైంది. తమిళం, కన్నడంతో పాటు హిందీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఎలాంటి సబ్‌స్క్రిప్షన్ ఛార్జీలు లేకుండా ఈ సిరీస్‌ను చూడొచ్చని వేవ్స్ ఓటీటీ ప్రకటించింది.
కాంతార కిషోర్...
ఈ వెబ్‌సిరీస్‌లో వీరప్పన్ పాత్రలో కాంతర ఫేమ్ కిషోర్ నటించాడు. సీనియర్ హీరో అర్జున్, లక్ష్మిరాయ్‌తో పాటు పలువురు దక్షిణాది యాక్టర్స్ కీలక పాత్రల్లో నటించారు. ఏఆర్ రమేష్ ఈ వెబ్‌సిరీస్‌కు దర్శకత్వం వహించాడు.
ఆరు ఎపిసోడ్స్‌తో వీరప్పన్ ది బండిట్ కింగ్ వెబ్‌సిరీస్ రూపొందింది. ఒక్కో ఎపిసోడ్ రన్‌టైమ్ 45 నిమిషాలకుపైనే ఉండటం గమనార్హం. వీరప్పన్ స్మగ్లర్‌గా మారడానికి దారితీసిన పరిస్థితులతో పాటు పోలీసుల కన్నుగప్పి ఎనుగు దంతాలు, గంధపు చెక్కలను ఎలా అక్రమంగా రవాణా చేశాడన్నది చూపించారు.ఈ వెబ్‌సిరీస్‌లో వీరప్పన్‌ను పట్టుకోవడానికి ప్రయత్నించే పోలీస్ ఆఫీసర్‌గా అర్జున్ నటించారు. మొత్తం మూడు సీజన్లతో ఈ వెబ్‌సిరీస్‌ను తెరకెక్కించబోతున్నట్లు డైరెక్టర్ ఏఆర్ రమేష్ ప్రకటించారు.
సంబంధిత వార్తలు

Ramayana Serial | రామాయణ సీరియల్లోని సీతారాముల కాంబినేషన్లో బాలీవుడ్ మూవీ – రణబీర్ సినిమాకు పోటీగా రిలీజ్
అక్టోబర్ 10, 2026

Priyanka Chopra | ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటించిన ఒకే ఒక తమిళ మూవీ – దళపతి విజయ్ హీరో – యూట్యూబ్‌లో ఫ్రీ స్ట్రీమింగ్
అక్టోబర్ 3, 2026

OTT Releases | ఈ వారం ఓటీటీలో రిలీజైన సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే – మలయాళం మూవీ హైలైట్
అక్టోబర్ 2, 2026
తాజావార్తలు
- ●Web Series Review | లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ - హైపర్ ఆది తెలుగు వెబ్‌సిరీస్ నవ్వించిందా?
- ●Hyderabad Cyber Crime Police | 9 రాష్ట్రాల్లో హైదరాబాద్ పోలీసుల మెరుపు దాడులు: 35 మంది సైబర్ నేరగాళ్ల అరెస్ట్.. రూ.88 లక్షలు రికవర్
- ●Delhi CJP Protest | ఢిల్లీని కుదిపేసిన సీజేపీ నిరసన.. దేశ రాజధానిలో అసలేం జరిగింది?
- ●Navaratri Utsavams | తిరుచానూరులో రేపటి నుంచి పద్మావతి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు
- ●INDIA bloc protest October 12 | ఢిల్లీ పోలీసుల నిర్బంధకాండపై భగ్గుమన్న విపక్షాలు: అక్టోబర్ 12న ‘ఇండియా’ కూటమి మహా ధర్నా
- ●Rajamouli | శ్రీకృష్ణుడి పాత్రలో డైరెక్టర్ రాజమౌళి - సగం షూటింగ్ పూర్తయిన తర్వాత ఆగిపోయిన మైథాలజీ మూవీ

Web Series Review | లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ - హైపర్ ఆది తెలుగు వెబ్‌సిరీస్ నవ్వించిందా?

Hyderabad Cyber Crime Police | 9 రాష్ట్రాల్లో హైదరాబాద్ పోలీసుల మెరుపు దాడులు: 35 మంది సైబర్ నేరగాళ్ల అరెస్ట్.. రూ.88 లక్షలు రికవర్

Delhi CJP Protest | ఢిల్లీని కుదిపేసిన సీజేపీ నిరసన.. దేశ రాజధానిలో అసలేం జరిగింది?

Navaratri Utsavams | తిరుచానూరులో రేపటి నుంచి పద్మావతి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు



